Dailyhunt
kalavari kodalu kanaka mahalakshmi serial today April 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సీమంతంలో విహారి! సహస్ర ప్రెగ్నెంట్ కాదని యమునకు తెలిసిపోయిందా!

kalavari kodalu kanaka mahalakshmi serial today April 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సీమంతంలో విహారి! సహస్ర ప్రెగ్నెంట్ కాదని యమునకు తెలిసిపోయిందా!

ABP దేశం 1 week ago

Kalavari kodalu kanaka Mahalakshmi serial today episode యమున కొడుకు పరిస్థితి చూసి చాలా ఏడుస్తుంది. విహారి నిన్ను ఎలారా మామూలు మనిషిని చేయడం అని తల బాదుకుంటుంది.

మరోవైపు బామ్మ సరి అలియాస్ లక్ష్మీ సీమంతానికి ఏర్పాట్లు చేస్తుంది. భుజంగం మనుషులు శోభ, మరో రౌడీ లక్ష్మీని చంపడానికి సీమంతం దగ్గరకు వస్తారు. లక్ష్మీని చంపడానికి ఓ పవర్ ఫుల్ ట్యాబ్లెట్స్ని లక్ష్మీ మందుల్లో కలిపేయాలని చూస్తారు.

లక్ష్మీ ఓ కాటన్ చీర కట్టుకొని వస్తుంది. ముత్తయిదువులు అందరూ బామ్మతో పెద్దమ్మా అన్నీ బాగా చేశావు కానీ ఓ మంచి చీర తీసుకొని రావాలి కదా అని అంటుంది. లక్ష్మీ వాళ్లతో పర్లేదు ఈ చీర బాగుంది అని అంటుంది. బామ్మ లక్ష్మీతో అమ్మా సిరి మర్చిపోయానమ్మా మంచి చీర తీసుకొని వస్తాను అని చెప్పి అందరికీ సిరి బాధ్యత అప్పగించి తాను బయటకు వెళ్తుంది. మరోవైపు సహస్ర ప్రెగ్నెంట్లా కనిపించడానికి పెట్టుకున్న ప్రెగ్నెంట్ బంప్ గదిలోకి వెళ్లి చిరాకుగా తీసేస్తుంది. ఎందుకు తీసేశావే అని పద్మాక్షి అంటే గర్భవతి కాకుండా అయినట్లు కనిపించడానికి ఇది పెట్టుకోవడం చాలా కష్టంగా ఉందని అంటుంది. కొన్ని రోజులు తప్పదే.. ఎవరైనా చూస్తే బాగోదే అని పద్మాక్షి అంటుంది.

సహస్ర బంప్ తీసేసి పొట్టని పాముతూ తిరుగుతూ ఉంటే యమున దూరం నుంచి చూసి ఇదేంటి సహస్ర కడుపు లేనట్లు కనిపిస్తుందని అనుకుంటుంది. వెంటనే సహస్ర అని పిలుస్తుంది. చూడటానికి దగ్గరకు వెళ్తుంది. సహస్ర, పద్మాక్షి షాక్ అయిపోతారు. యమున దగ్గరకు వచ్చేలోపు సహస్ర బంప్ పెట్టుకుంటుంది. ఇక్కడేం చేస్తున్నావ్ సహస్ర అని యమున అడిగితే నెలలు నిండుతున్నాయి కదా నేనే జాగ్రత్తలు చెప్తున్నా.. అయినా ఎవరు తనకు ఏం చెప్పరు కదా నేనే చెప్పాలి అని పద్మాక్షి అంటుంది. యమున పద్మాక్షితో ఎందుకు చెప్పము వదినా.. అని సహస్రకు జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంది. పద్మాక్షి కూతురికి ఒక్కటిచ్చి ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకు అని అంటుంది.

బామ్మ సిరి కోసం షాపింగ్ చేసి ఇంటికి వెళ్తుంటే లక్ష్మీని కాపాడటానికి గతంలో బామ్మ కొట్టిన ఇద్దరు రౌడీలు బామ్మని ఆపి గొడవ పడతారు. మళ్లీ మీ కాళ్లు చేతులు చితక్కొడతాను అని బామ్మ కర్ర తీస్తుంది. బామ్మ బ్యాగ్ని రౌడీలు తీసుకుంటే బామ్మ చాలా బాధ పడుతుంది. వాళ్లు బ్యాగ్ విసిరేస్తారు. నా మనవరాలి కోసం కొన్ని చీరరా అని అనుకుంటుంది. బామ్మ తల మీద రౌడీలు కొట్టే టైంకి విహారి మందు మత్తులో వచ్చి కారు డోర్తో రౌడీని కొడతాడు. తర్వాత ఇద్దరు రౌడీలను చితక్కొడతాడు. ఓ రౌడీ చాకుతో బామ్మని పొడవబోతే విహారి చేయి అడ్డు పెడతాడు. విహారి మందుతోనే చేయి కడుక్కుంటాడు. నువ్వు ఎవరో కానీ సమయానికి వచ్చి కాపాడావు బాబు అని బామ్మ అంటే నేను డ్రాప్ చేస్తా పద అని విహారి అంటాడు. వద్దు అని బామ్మ అంటే విహారి పర్లేదు అని బామ్మని కారు ఎక్కిస్తాడు.

అంబిక సుభాష్ కోసం ఎదురు చూస్తుంటుంది. సుభాష్లో ఈ మధ్య మార్పు కనిపిస్తుందని అనుకుంటుంది. ఏంటి లేట్ అని సుభాష్ని అడిగితే ట్రాఫిక్ అని చెప్తాడు. ఇంతలో సుభాష్కి ఓ కాల్ వస్తే సుభాష్ లిఫ్ట్ చేయడు.. మళ్లీ కాల్ వస్తుంది. మళ్లీ కాల్ కట్ చేస్తాడు. అంబిక సుభాష్తో మనం విహారి లూప్ హోల్ పట్టుకొని వాడంటత వాడే బిజినెస్ల నుంచి వెళ్లిపోయేలా చేద్దాం అని అంటుంది. సుభాష్కి మళ్లీ మళ్లీ కాల్ రావడం అంబిక అనుమానపడుతుంది. లక్ష్మీ ముత్తయిదువులతో మాట్లాడుతూ ఉంటుంది.

లక్ష్మీ బిజీగా ఉన్నప్పుడు శోభ లక్ష్మీని చంపడానికి తెచ్చిన మందులు తీస్తుంది. లక్ష్మీ కడుపులో బిడ్డని తడుముతూ ఈ రోజు నా సీమంతం మొదటి గాజులు మీరే వేయాలి విహారి గారు కానీ నాకు ఆ అదృష్టం లేదు అని ఏడుస్తుంది. ఇంతలో విహారి బామ్మని తీసుకొని ఇంటికి వస్తాడు. బామ్మ లోపలికి వెళ్లి కారులో బ్యాగ్ మర్చిపోవడంతో విహారి చూసి బ్యాగ్ గాజులు పట్టుకొని లోపలికి వెళ్తాడు. బామ్మకి గాజులు బ్యాగ్ ఇస్తాడు. బామ్మ విహారితో ఇంత వరకు వచ్చావ్ లోపలికి రా బాబు నా మనవరాలికి సీమంతం చేస్తున్నా అంటుంది. లేదు అని విహారి అంటే కనీసం మంచి నీరు అయినా తాగుదువు రా బాబు అని విహారిని తీసుకెళ్తుంది. లక్ష్మీ విహారిని చూసి షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Author : Jhanshi Balleda

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam