Kalavari kodalu kanaka Mahalakshmi serial today episode సహస్ర బాలేదు అని చెప్పి స్వామీజీ చెప్పి దీక్ష నుంచి తప్పించుకుంటుంది. పండు లక్ష్మీతో సహస్రమ్మ దోష నివారణ చేయడం లేదు కదా కనీసం నువ్వు అయినా చేయమ్మా అని అంటాడు.
నేను చేయడం ఏంటి అని లక్ష్మీ అంటే నీ కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడమ్మా నువ్వు దీక్ష చేయకపోతే వారసుడికి ప్రమాదం అమ్మా అని అంటాడు.
లక్ష్మీ పండుతో సరే నా కడుపులో ఉన్న వారసుడి కోసం నేను దీక్ష చేస్తానని అంటుంది. నువ్వు బయటకు వెళ్లావని నేను ఏదో ఒకటి ఇంట్లో చెప్తా నువ్వు పూజకు వెళ్లమ్మా అని పండు లక్ష్మీని పంపిస్తాడు. లక్ష్మీ సంచి పట్టుకొని దాచుకుంటూ బయటకు వెళ్లడం మేడ మీద నుంచి సహస్ర చూస్తుంది. లక్ష్మీ ఎక్కడికి వెళ్తుందా ఫాలో అవ్వాలి అనుకొని బెడ్ మీద పిల్లోలు పెట్టి బయటకు వెళ్లిపోతుంది. సహస్ర లక్ష్మీని ఫాలో అవుతుంది. ఇక దారిలో సహస్రని పద్మాక్షికి తెలిసిన కొంత మంది ఆపేస్తారు. మళ్లీ మాట్లాడుతా అని సహస్ర పరుగులు పెడుతుంది. లక్ష్మీ గుడిలోకి వెళ్లిపోతుంది. లక్ష్మీ వెనకాలే సహస్ర పరుగులు పెడుతుంది.
విహారి వస్తూ ఉంటే దారిలో లక్ష్మీని అరెస్ట్ చేసిన లేడీ పోలీస్ సింహపురి సీత ఎదురొస్తుంది. నువ్వు నీ పని మనిషి కలిసి నా ఉద్యోగం పోగొడితే ఎలా యూనిఫాం వేసుకున్నా అనుకున్నావా.. నేను పిటిషన్ వేసి అక్కడే నేనేంటో నిరూపించుకున్నా.. ఇక నుంచి నా ఫోకస్ అంతా నీ మీదే అని అంటుంది. నీ ఇంట్లో నీ ఫ్యామిలీలో అతి త్వరలో ఒకర్ని అరెస్ట్ చేయబోతున్నా అని అంటుంది. ఎవర్ని అరెస్ట్ చేస్తారు.. ఎందుకు అరెస్ట్ చేస్తారు అని విహారి అడిగితే ఇప్పుడే చెప్పడం ఎందుకు నువ్వు మీ ఇంటికి వెళ్లి వెయిట్ చేయ్ వారెంట్తో వచ్చి అరెస్ట్ చేస్తా అని అంటుంది. వెంటనే విహారి సంధ్యకి కాల్ చేసి విషయం చెప్తాడు. నా ఫ్యామిలీలో ఎవర్ని సింహపురి సీత అరెస్ట్ చేస్తుందో తెలుసుకొని చెప్పండని అడుగుతాడు. సంధ్య ఎంక్వైరీ చేసి విహారికి కాల్ చేసి విషయం చెప్పి మీరు ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది.
లక్ష్మీ గుడికి వెళ్లి పంతుల్ని కలిసి ఈ రోజు గుడిలో కడుపుతో ఉన్న వాళ్ల దోష నివారణ పూజ చేయాలి అని చెప్పారని చెప్తుంది. అవును అని పంతులు కూడా చెప్తారు. దాంతో లక్ష్మీ తనతో దోష నివారణ పూజ జరిపించి తన కడుపులో బిడ్డని కాపడమని చెప్తుంది. పంతులు సరే అంటారు. సహస్ర దూరం నుంచి మొత్తం చూస్తుంటుంది. పంతులు లక్ష్మీకి ప్రదక్షిణ చేయమని పంపిస్తారు. లక్ష్మీ చాటుగా ఎందుకు గుడికి వచ్చిందో తెలుసుకుంటానని సహస్ర అనుకుంటుంది. మరోవైపు విహారి త్వరగా ఇంటికి వస్తాడు. మందులు వేసుకుంటున్న యమున దగ్గరకు వెళ్తాడు. యమున విహారిని చూసి ఏమైనా కావాలా అని అడుగుతుంది. నిజం కావాలమ్మా అని విహారి అంటాడు. ఏంట్రా అని యమున అంటే నీ జీవితంలో దాచిన రహస్యం.. నీకు మాత్రమే తెలిసిన నిజం అని అంటాడు. నేను ఏం దాచలేదు అని యమున అంటే అమ్మా గుడిలో ఎవర్ని చూసి మూర్ఛ వచ్చి పడిపోయావ్.. నీకు విషం ఇచ్చింది ఎవరు.. అని విహారి అడుగుతాడు. యమున కంగారు పడుతుంది. అమ్మా నీకు ప్రమాదం పొంచి ఉంది.. నిన్ను కాపాడుకోవాలి అంటే నువ్వు నిజం చెప్పాలి.. నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవాలి అంటే నువ్వు నిజం చెప్పాలి అంటాడు.
యమున కొడుకుతో చెప్తానురా.. నాకు మీ నాన్నకే తెలిసిన నిజం ఇప్పుడు నీకు చెప్తాను.. గుడిలో నాకు ఫిట్స్ రావడానికి కారణం భుజంగం.. నా జీవితంలో నేను చూసిన క్రూరమైన మనిషి ఆ భుజంగం.. వాడు నరరూప రాక్షసుడు అలాంటి వాడు నా గతంలో ఉన్నాడు అని చెప్పడానికి నాకు నోరు రావడం లేదు.. అలాంటి వాడు వాడు అని మొత్తం విహారికి చెప్తుంది. ఆ రోజు న్యాయం వైపు నిలబడటం నా తప్పు. ఆ నేరం చేసింది వాడు.. కానీ ఆ నేరం నా మీద వేయాలి అనుకుంటే మీ నాన్న నన్ను తీసుకొచ్చేశారు.. ఇన్నాళ్లు లేని ఆ దుర్మార్గుడు ఇప్పుడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో అని అంటుంది. నేరం వాడు చేసి నీ మీద తోసేశాడు.. వాడిని పట్టుకొని నిన్ను కాపాడుకుంటా.. వాడిని ఎలా అయినా రేపు పట్టుకుంటా అని విహారి అంటాడు.
సహస్ర పంతులు దగ్గరకు వెళ్లి ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఏ పూజ చేస్తుంది అని అడుగుతుంది. పంతులు దోష నివారణ పూజ చేస్తుంది అని అనగానే సహస్ర షాక్ అయిపోతుంది. గర్భం దాల్చని వాళ్లు కూడా ఈ పూజ చేయొచ్చా అని సహస్ర అడిగితే లేదమ్మ కేవలం గర్భం దాల్చిన వాళ్లే ఈ పూజ చేస్తారు. ఆమె కూడా తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఏ గండాలు రాకుండా చేయాలని ఈ దోష నివారణ పూజ చేస్తుందని పంతులు చెప్పడంలో లక్ష్మీ గర్భవతా అని సహస్ర చెమటలు పట్టేస్తుంది. లక్ష్మీ వెనకాలే తిరుగుతూ లక్ష్మీ నువ్వు గర్భవతివా..వారసుడిని ఇచ్చేది నువ్వా.. అసలు నీకు వారసుడు పుట్టడానికి వీల్లేదు.. నిన్ను ఈ రోజు ఇక్కడే చంపేయాలని ఉంది.. నీ కడుపులో బిడ్డ బతక్కుండా చేస్తా అని అనుకుంటుంది. భుజంగం విహారికి కాల్ చేసి నా గురించే ఆలోచిస్తావా.. మీ అమ్మని కాపాడుకుంటావా.. నీకు అదృష్టం కలిసొచ్చి ఏం కావడం లేదు కానీ నీకు దురదృష్టం వెంటాడుతుందిరా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Author : Jhanshi Balleda

