Kalavari kodalu kanaka Mahalakshmi serial today episode భుజంగం విహారికి కాల్ చేసి నీకు ఈ రోజు నుంచి బ్యాడ్ డేస్ మొదలయ్యావి.. నువ్వు మీ అమ్మని కాపాడుకుంటూ నీకు అత్యంత ఇష్టమైన నీ మొదటి భార్యని మర్చిపోతున్నావ్..
దాన్ని గుడిలో ఒక్కదాన్నే అలా ఎలా వదిలేశావురా అని విహారిని అడుగుతాడు. రేయ్ నువ్వు లక్ష్మీని ఏం చేయబోతున్నావురా అని విహారి అడిగితే అలా ఎలా చెప్తానురా.. ఆల్ రెడీ నీ ప్రాణానికి ప్రాణం అయిన లక్ష్మీకి స్కెచ్ వేసేశా.. పరుగెత్తు పరుగెత్తి పరుగెత్తి దాన్ని కాపాడుకో అని భుజంగం అంటాడు. దాంతో విహారి గుడికి పరుగులు తీస్తాడు.
పంతులు లక్ష్మీతో అభిషేకానికి అంతా రెడీ చేశాను నువ్వు వెళ్లి చీర మార్చుకొని రామ్మా అని అంటారు. ప్రదక్షిణ పూర్తి కాలేదని లక్ష్మీ వెళ్తుంది. సహస్ర బయట భవవన్న(గంగిరెద్దు )ను చూసి ఇద్దరు ఆడవాళ్లు భసవన్న ఉన్నాడని మర్చిపోయి ఎర్ర చీర కట్టుకొని వచ్చేశా త్వరగా వెళ్లి మార్చుకొని వద్దాం అని పరుగులు పెడతారు. అది చూసిన సహస్ర ఎర్ర చీర తీసుకొని వచ్చి పంతులు లక్ష్మీ కోసం ఉంచిన పసుపు చీర స్థానంలో ఎర్ర చీరని పెడుతుంది. ప్రదక్షిణలు పూర్తి చేసిన లక్ష్మీ ఆ చర్ర చీరే తన కోసం పంతులు పెట్టారని తీసుకొని వెళ్లి కట్టుకుంటుంది. సహస్ర లక్ష్మీని చూసి తన ప్లాన్ వర్కౌట్ అయిందని నీకు నీ కడుపులో బిడ్డని నామరూపాలు లేకుండా చేస్తానని అనుకుంటుంది. తర్వాత గంగిరెద్దు దగ్గరకు వెళ్లి మనసులో దీన్ని వదిలేస్తే లక్ష్మీని పొడిచి పొడిచి చంపేస్తుందని అనుకొని గంగిరెద్దు ని కట్టిన తాడు తీసేస్తుంది. గంగిరెద్దు లక్ష్మీని ఎర్ర రంగు చీరలో చూసి పరుగు పరుగున వస్తుంది.
లక్ష్మీ గంగిరెద్దు ని చూసి తన చీర రంగు చూసుకొని భయంతో పరుగులు పెడుతుంది. అప్పుడే విహారి అక్కడికి వచ్చి లక్ష్మీ పరుగులు పెట్టడం చూస్తాడు. పరుగున లక్ష్మీ దగ్గరకు వెళ్లి దగ్గర్లో ఉన్న పసుపు రంగు వస్త్రం లక్ష్మీ మీద కప్పుతాడు. దాంతో ఎద్దు ఆగిపోతుంది. సహస్ర షాక్ అయిపోతుంది. నీకేం కాలేదు కదా లక్ష్మీ.. ఈ టైంలో నువ్వు గుడికి రావడం ఏంటి.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. మీకు చెప్పకుండా రావడం తప్పే క్షమించండి అని లక్ష్మీ అంటే అసలు ఇక్కడికి నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావ్ అని విహారి అడుగుతాడు. లక్ష్మీ విహారికి తాను గర్బవతి అని చెప్పకుండా ఈ రోజు ఓ ముఖ్యమైన పూజ అని చెప్తుంది. ఇంటికి వెళ్లిపోదాం పద అని విహారి అంటే ఈ పూజ చాలా ముఖ్యం ఇది అయిపోగానే నేను వచ్చేస్తా అని అంటుంది. సరే నేను ఉంటాను అని విహారి అంటాడు. లక్ష్మీ వద్దు అని ఎంత చెప్పినా విహారి వినడు. సహస్ర లక్ష్మీని చూసి సాయంత్రంలోపు నువ్వు ఈ పూజ చేయాలి కదా.. దాన్ని చెడగొడతా.. నువ్వు గర్భవతి అని తెలిసినా.. నీ కడుపులో వారసుడు ఉన్నాడు అని తెలిసినా.. నిన్ను అందరూ నెత్తిన పెట్టుకొని చూస్తారు.. అది నేను జరగనివ్వను.. అని అనుకుంటుంది.
మరోవైపు సుభాష్ హ్యాకర్తో విహారికి ఫోన్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి భుజంగం ఫోన్ నెంబరు తీసుకుంటారు. అడ్రస్ కోసం అతనితో కాసేపు మాట్లాడమని హ్యాకర్ సుభాష్కి చెప్తాడు. సుభాస్ భుజంగానికి కాల్ చేసి రియలస్టేట్ లక్కీ డిప్ అదీ ఇదీ అని మాట్లాడుతాడు. భుజంగం కోపంతో ఫోన్ కట్ చేయమని అంటాడు. సుభాష్ మాట్లాడుతూ ఉండగా హ్యాకర్ అడ్రస్ కనిపెట్టేస్తాడు. అంబిక, సుభాష్లకు లొకేషన్ పంపిస్తాడు. ఇద్దరూ లొకేషన్కి బయల్దేరుతారు. ఇక పంతులు లక్ష్మీ దగ్గరకు వస్తారు. విహారిని చూసి ఈయన ఎవరు అంటే లక్ష్మీ తడబడుతుంది. దాంతో విహారి నేను తన భర్తని.. తను నా భార్య అని అంటాడు. పంతులు లక్ష్మీ వాళ్లతో అమ్మవారికి అభిషేకం చేసి ముత్తయిదువులకు అన్నప్రసాదలు ఇచ్చి తర్వాతా భార్యాభర్తలు దీపం వెలిగించి పూజ విరమించాలి.. మధ్యలో ఎలాంటి ఆటంకం ఎదురైనా అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని చెప్తారు. సహస్ర పూజ ఆపడానికి ముత్తయిదువులు లేకుండా చేయాలి అనుకుంటుంది. ఇక పద్మాక్షి సహస్రని భోజనానికి పిలవడానికి వస్తుంది. గదిలో సహస్ర లేకుండా తలగడలు పెట్టడం చూసి ఎక్కడికి వెళ్లిందని కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Author : Jhanshi Balleda

