Dailyhunt
kalavari kodalu kanaka mahalakshmi serial today April 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం దిగొచ్చిన అమ్మవారు.. ప్రసాదంలో విషం కలిపిన సహస్ర!

kalavari kodalu kanaka mahalakshmi serial today April 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం దిగొచ్చిన అమ్మవారు.. ప్రసాదంలో విషం కలిపిన సహస్ర!

ABP దేశం 3 weeks ago

Kalavari kodalu kanaka Mahalakshmi serial today episode సాక్ష్యాత్తు అమ్మవారే లక్ష్మీ కోసం ముత్తయిదువులా వస్తుంది. విహారి దగ్గరికి వచ్చి ఎవరో ఒకరు ముత్తయిదువు కోసం అడుగుతూ ఉంటారు మీకు ఏమైనా కావాలా అని అమ్మవారు విహారిని అడుగుతుంది.

దానికి విహారి మా అమ్మవారు కనకదుర్గమ్మ పూజ చేస్తుంది. ముగ్గురు ముత్తయిదువులు కావాలి అని అంటాడు. దాంతో అమ్మవారు చెల్లి, అక్క అని పిలవగానే మరో ఇద్దరు అమ్మవార్లు వస్తారు. నా పేరు దుర్గ, తను నా చెల్లి గౌరీ, తను మా అక్క పార్వతి అని అమ్మవార్లు పరిచయం చేసుకుంటారు.

విహారి వాళ్లకి దండం పెట్టి మీరు ఎవరో కానీ నా భార్య పూజ దిగ్విజయం చేయడానికి సాక్ష్యాత్తు అమ్మవార్లలా వచ్చారని అంటాడు. ముగ్గురు అమ్మవార్లు విహారి వెనక వెళ్తారు. లక్ష్మీ అమ్మవారి దగ్గర తలబాదుకొని అమ్మా దుర్గమ్మ నేను ఏం తప్పు చేశానని ముత్తయిదువులు రాకుండా చేస్తున్నావ్ చెప్పమ్మా అని ఏడుస్తుంది. ఏడుస్తూ లక్ష్మీ కళ్లు తిరిగిపోడిపోతే విహారి వచ్చి పట్టుకొని లేపుతాడు. ముత్తయిదువులు వచ్చారా అని లక్ష్మీ అడిగితే విహారి అమ్మవార్లను చూపిస్తాడు. లక్ష్మీ వాళ్లకి దండం పెడుతుంది. సహస్ర షాక్ అయిపోతుంది. అందర్నీ రాకుండా చేసినా వీళ్లు ఎలా వచ్చారు అని అనుకుంటుంది. లక్ష్మీ వాళ్లకి దండం పెట్టి సమయానికి వచ్చిన మీరు నాకు ఆ అమ్మవారితో సమానం అని లక్ష్మీ అంటుంది. ఈ దుర్గ ఉండగా నీకు ముత్తయిదువులకు కరువు ఉండదు అని అమ్మవారు అంటుంది. అమ్మవారు పంతుల్ని పిలిచి తర్వాత కార్యక్రమం చేయమని చెప్పడం పంతులు అమ్మవారిని చూసి సంతోషంతో పూజ చేస్తారు.

అంబిక, సుభాష్ భుజంగం లొకేషన్కి వెళ్తారు. ఇంటికి తాళం వేసి ఉండటం చూసి పక్కనే వెతుకుతారు. పక్కనే ఉన్న ఓ గిఫ్ట్ బాక్స్ అంబిక తీసి చూస్తుంది. అందులో ఓ టేపు రికార్డ్ ఉంటుంది. నన్ను టేస్ చేయాలి అనుకుంటున్నారా మీరు.. మీరు నన్ను కలవాలి అనుకుంటే నేను కలవను.. నేను కలవాలి అనుకుంటే కలుస్తాను అని వాయిస్ వస్తుంది. అప్పుడే అంబికకు భుజంగం కాల్ చేసి నాకు మీ అవసరం లేదు.. కానీ నేను నీకు చిన్న సాయం చేస్తా.. ఫారెన్సిక్ రిపోర్ట్ కవర్ చూపిస్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం మీ వదిన చేసిన మర్డర్ ఫారెన్సిక్ రిపోర్ట్.. వాటిని వాడుకొని మీ వదినను విహారిని ఓ ఆట ఆడుకోవాలి అనుకుంటే ఆడుకో అని అంటాడు. థ్యాంక్యూ సోమచ్ అని అంబిక వాటిని తీసుకొని వెళ్తుంది.

లక్ష్మీ అమ్మవార్లకి వాయినం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. అమ్మవారు లక్ష్మీతో అన్నప్రసాదాలు ఇవ్వమ్మా అవి స్వీకరించకపోతే పూజ పూర్తికానట్లే అని చెప్పడంతో లక్ష్మీ వండిన ప్రసాదం తీసుకొస్తా అని చెప్పి వెళ్తుంది. సహస్ర అది విని.. గన్నీరు మొక్కల రసం వేస్తే లక్ష్మీ ప్రసాదం తిన్న లక్ష్మీ చనిపోతుందని అనుకుంటుంది. దాన్ని తీసుకెళ్లి ప్రసాదంలో కలుపుతుంది. లక్ష్మీ అమ్మవార్లకి ప్రసాదం వడ్డిస్తుంది. ముగ్గురిని చూసిన సహస్ర బాగా తిని చావండి అని అనుకుంటుంది. గౌరమ్మ, పార్వతి దేవి తల్లి మొదటి ముద్దలు తీసి దుర్గమ్మకి ఇస్తే దుర్గమ్మ వాటిని తీసుకొని కనకమహాలక్ష్మీ ఇటు రామ్మా.. పూజలో పడి తిన్నావో లేదో ఈ ముద్ద తినమ్మా అని అంటారు. అది విన్ని సహస్ర ముత్తయిదువులు చనిపోతారు అనుకంటే నా శత్రువే చస్తుంది.. ఈ దెబ్బతో లక్ష్మీ పీడ పోతుందని అనుకుంటుంది. అమ్మవారు లక్ష్మీకి ముద్ద తినిపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Author : Jhanshi Balleda

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam