Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది.
ఈ రోజు(ఆగస్టు 1న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
విహారి తప్పు చేశాడు..శిక్షించండి..
విహారిని కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టు బోనులో విహారిని నిల్చొపెట్టిన అపోజిట్ లాయర్ కేసు గురించి చెప్పి విహారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు చూపించి సిరి చనిపోవడానికి కారణం అయ్యాడు.. కారుతో యాక్సిడెంట్‌ని గుద్దేశాడు.. విహారికి శిక్ష వేయాలని జడ్జికి చెప్తాడు. విహారి తరఫు లాయర్ ఎవరైనా ఉన్నారా అని జడ్జి అడిగితే ఇతను తప్పు చేశాడు అని అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఎవరూ కేసు తీసుకోవడం లేదు అని లాయర్ అంటాడు. లాయర్ జడ్జికి ఇచ్చిన సాక్ష్యాలు అన్నీ పరిశీలించి శిక్ష వేయమని కోరుతారు.
సిరితో మోజుతో ఇదంతా చేశాడు..
జేడీ, కేడీలు ఆటో డ్రైవర్‌ని కాపాడి అడ్డుకోవాలని చూసిన శకుంతల రౌడీలను చితక్కొడతారు. ఇంతలో మరోరౌడీ ఆటో డ్రైవర్‌ని పొడిచేస్తాడు. ఇక విహారికి శిక్ష పడాలి అని లాయర్ చాలా ప్రయత్నిస్తాడు. సీఐని పిలిచి విహారి గురించి చెప్పమని అంటాడు. దాంతో సీఐ విహారి ఆఫీస్ దగ్గర సిరి ఇంటి దగ్గర ఎంక్వైరీ చేశాను అని సిరి మీద ఈయన మోజు పడ్డాడు. మోజు తీర్చుకోవడానికి అర్ధరాత్రి చాలా సార్లు వెళ్లాడు. సిరి ఇంటి దగ్గర కూడా చాలా మంది చూశారు అని చెప్తారు. నేను వెళ్లిన ఉద్దేశం వేరు అని విహారి అరుస్తాడు. సిరి మీద మోజుతోనే పదేళ్ల నుంచి చేస్తున్న ఫుడ్ కాంట్రాక్ట్‌ని కూడా సిరికి ఇచ్చేశాడు.. సిరి గుట్టు తెలిసిపోతుందని కారుతో గుద్దించి గుర్తు పట్టలేనంతగా కాలిపోయేలా చేశాడు అని ఎస్‌ఐ చెప్పడంతో విహారి ఎస్‌ఐని కొట్టడానికి వెళ్తాడు. ఎవరి దగ్గర డబ్బు తీసుకొని ఇదంతా చేస్తున్నావ్ అని అరుస్తాడు. సీఐ విహారిని వదలొద్దు అని చెప్తాడు.
విహారికి యావజ్జీవ శిక్ష..
సిరి ఆటోని విహారి కారు ఢీ కొట్టినట్లు సీసీ టీవీ ఫుటేజ్ కూడా లాయర్ చూపిస్తాడు. విహారి లాంటి నయవంచకుడికి కఠిన శిక్ష పడాలి అని పీపీ లాయర్ అంటారు. జడ్జి అన్ని సాక్ష్యాలు పరిశీలించి విహారి సిరిని లోబరుచుకొని అక్రమ సంబంధం బయట పడుతుంది అని విహారినే సిరిని చంపాడు అని కోర్టు భావిస్తుందని అందుకు విహారి చేసిన నేరానికి యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇస్తారు. అందరూ షాక్ అయిపోతారు. అంబిక, సుభాష్ మాత్రం సంతోషపడతారు. ఇంతలో జేడీ, కేడీలు వచ్చి ఆపుతారు. నిర్దోషికి అన్యాయంగా శిక్ష పడకూడదు అందుకే మిమల్ని ఆపాను అని జేడీ అంటుంది. 5 నిమిషాలు టైం ఇస్తే విహారి ఏం తప్పు చేయలేదు అని నిరూపిస్తామని కోరుతారు. విహారి సిరిని కాపాడటానికి చాలా ప్రయత్నించారు.. ఈ కేసులో విహారి నిందితుడు కాదు బాధితుడు అని నిరూపించడానికి వచ్చాం అని జేడీ కేడీలు అంటారు. జడ్జికి ఓ పెన్ డ్రైవ్ ఇచ్చి చూడమని చెప్తారు. అందులో విహారి కారుని రౌడీలు కారు ఢీ కొట్టడం క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంత చిన్న సాక్ష్యంతో అంతకుడిని కాపాడాలి అనుకోవడం తప్పు అని పీపీ అంటే ఇంకో అసలైన సాక్ష్యం ఉందని జేడీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి. " href="https://telugu.abplive.com" target="_self">
Author : Jhanshi Balleda

