Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!

ABP దేశం 1 week ago

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode | బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్లు టర్న్లతో ఆసక్తికరంగా మారుతోంది.

ఈ రోజు(ఆగస్టు 4న) ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బావ నువ్వెక్కడికి వెళ్లొద్దు..

విహారి, సంధ్య శకుంతల దగ్గరకు వెళ్లాలని అనుకుంటారు. ఆ మాట విన్న అంబిక సుభాష్ అక్కడే ఉన్నాడు ఇప్పుడు వీళ్లు వెళ్తే దొరికిపోతాడు అని అనుకుంటుంది. విహారి, సంధ్య వెళ్తూ ఉంటే సహస్ర ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకు.. ప్రతీది మీకు చెప్పి చేయాలి అంటే కష్టం ఇప్పటి వరకు ఏం అడగని మీరు ఇప్పుడెందుకు అడుగుతున్నారు అని విహారి అడుగుతాడు. ఇప్పటి వరకు నువ్వు బయటకు వెళ్లి మందు తాగి వచ్చేవాడివి ఇప్పుడు ఊరి సమస్యల్లో దూరుతున్నావ్ కదా అని అంబిక అంటుంది. నేను నా ప్రాణాలు కాపాడిన సిరి సమస్య కోసం తిరుగుతున్నా అని విహారి అంటే దాని సమస్యలు నీ మీద వేసుకొని నువ్వు లేనిపోని సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని సహస్ర అంటుంది. ఎంత కావాలి అంటే అంత డబ్బు ఇచ్చి వెతికిద్దాం లేదు కాదు అంటే నేను ఐజీతో మాట్లాడుతా అని పద్మాక్షి అంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా విహారి మాత్రం వెనక్కి తగ్గడు నేనే కచ్చితంగా వెళ్లాల్సిందే అని సంధ్యని తీసుకొని శకుంతల వాళ్ల అడ్డాకి బయల్దేరుతాడు.

Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్కి ఎసరు వేస్తారా?

శకుంతల దగ్గరకు విహారి, సంధ్య..

సంధ్య, విహారి శకుంతల దగ్గర సుభాష్ని పట్టుకుంటే నేను దొరికిపోతాను ఏదో ఒకటి చేయాలి అని అంబిక అనుకుంటుంది. ఇక సుభాష్ శకుంతలని కలిసి ఆటో డ్రైవర్ తప్పించుకున్నందుకు శకుంతల వాళ్లని తిడతాడు. అంబిక చాలా టెన్షన్ పడుతూ సుభాష్కి కాల్ చేస్తూనే ఉంటుంది. కానీ ఫోన్ కలవదు.. సుభాష్ దొరికిపోతే నేను బుక్ అయిపోతా అని అంబిక టెన్షన్ పడుతూ సుభాష్కి కాల్ చేస్తూనే ఉంటుంది. సుభాష్ శకుంతల్ని తిడుతూ ఉంటాడు. ఇక విహారి వాళ్లు శకుంతల ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే సుభాష్ ఫోన్ కలుస్తుంది. అంబిక సుభాష్తో విహారి వాళ్లు అక్కడికి వచ్చేస్తున్నారు.. వెంటనే పారిపో అని చెప్తుంది. సుభాష్ పారిపోవాలని వెళ్లేలోపు విహారి, సంధ్య వచ్చేయడంతో సుభాష్ అక్కడే దాక్కుంటాడు.

విహారికి దొరికిపోతావ్..

విహారి ఎదురు వచ్చిన రౌడీలను కొడతాడు. సిరి విషయంలో మర్యాదగా నిజం చెప్తావా.. లేదా.. ఆటో డ్రైవర్ని దాచి పెట్టినట్లే సిరిని కూడా దాచేసుంటావ్. మర్యాదగా నిజం చెప్పు అని విహారి, సంధ్య ఇద్దరూ శకుంతలని నిలదీస్తారు. సిరి కనిపించకుండా పోతే మీరు కాంట్రాక్ట్ నాకు ఇస్తారని సిరిని కిడ్నాప్ చేశాం కానీ తను తప్పించుకొని పారిపోయింది.. అనుకోకుండా ఆ ఆటోకి యాక్సిడెంట్ అయింది.. ఏమైందా అని మా వాళ్లు వెళ్లే చూసే సరికి లోయలో ఎవరూ లేరు.. రెండు అనాథ శవాలను అక్కడ వేసేస్తే తను చనిపోయింది అని మీరు అనుకుంటారు అని తనే చనిపోయింది అని చెప్పాం.. కానీ ఆటో డ్రైవర్ తప్పించుకుంటే ఎక్కడ నిజం చెప్తాడా అని వాడిని దాచిపెట్టాం.. అని చెప్తుంది. డ్రైవర్ని దాచినట్లే సిరిని కూడా దాచుంటావ్ అని సంధ్య అంటే నాకు తెలీదు తెలీదు.. కంపెనీ కాంట్రాక్ట్ కోసమే ఇలా చేశా అని శకుంతల అంటుంది. అనాథ శవాలను మార్చే అంత సీన్ నీకు లేదు కానీ నీ వెనక ఎవరు ఉన్నారో చెప్పు అని విహారి అడిగితే నాకు తెలీదు ఎవరూ లేరు.. కేవలం కాంట్రాక్ట్ కోసమే ఇలా చేశా అని శకుంతల అంటుంది. సహనం నశించిపోయి నిజం చెప్పమని సంధ్య, విహారి రౌడీలు, శకుంతల్ని కొడతారు. నా మీదే చేయి వేశావ్ కదా సంధ్య త్వరలోనే మీ అంతు చూస్తా అని శకుంతల అంటుంది. నువ్వు కాదు మేమే త్వరలో నీ అంతు చూస్తాం అని విహారి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

మీ అమ్మని నేను తీసుకొస్తా..

హరికృష్ణ తన తల్లిని వెతుక్కోవాలని బయటకు వెళ్తుంటే సిరి, యమున ఆపుతారు. మీ అమ్మని విహారి వెతికి పట్టుకుంటాడు.. నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు అని యమున అంటుంది. మా అమ్మ బతికే ఉందని తెలిసిన తర్వాత నేను ఇలా ఉండలేను.. అమ్మ ఎక్కడున్నా నేను వెతుకుతా అని క్రిష్ అంటే అందరూ అదే పనిలో ఉన్నారురా.. పోలీసులు కూడా వెతుకుతున్నారు.. అందరూ మీ అమ్మని వెతికి తీసుకొస్తారు అని యమున అంటుంది. సిరి కూడా క్రిష్తో మా నాన్న మీ అమ్మని వెతికి తీసుకొస్తారు అని చెప్తుంది. ఇంతలో విహారి రావడంతో క్రిష్ విహారిని పట్టుకొని ఏడ్చి మా అమ్మ బతికే ఉంది కదా అమ్మని చూడాలని ఉంది.. ఎలా అయినా వెతికి తీసుకురా బ్యాట్మెన్ అని బతిమాలుతాడు. ఎక్కడున్నా మీ అమ్మని వెతికి తెచ్చే బాధ్యత నాదేరా అని విహారి అంటాడు. తర్వాత సిరి పాప క్రిష్ని దేవుడి దగ్గరకు తీసుకెళ్లి ఈ స్వామిని దండం పెట్టుకో అని చెప్తుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్తో పాటు తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.

Author : Jhanshi Balleda

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam