Kalavari kodalu kanaka Mahalakshmi serial today episode విహారి లక్ష్మీని మర్చిపోవాలని తాగుతూ ఉంటాడు. తాగుతూ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఎంత తాగుతూ ఉన్న నిన్ను మర్చిపోలేకపోతున్నా అని అనుకుంటాడు.
మందు అయిపోయి ఓ చోట ఆగి మందు కొనుక్కుంటాడు. తాగుతూ కొందరు రౌడీల కారుని ఆపేస్తాడు. ఆ రౌడీలు భుజంగం పని మీద వెళ్తూ ఉంటారు. విహారి కూడా కిడ్నాప్ చేస్తే కలిసొస్తుందని అనుకుంటారు.
బామ్మ హాస్పిటల్లో లక్ష్మీ కనిపించడం లేదని అనుకుంటుంది. బామ్మ డాక్టర్ని పిలిచి గొడవ చేస్తుంది. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు.. ఏం చేస్తారో నాకు తెలీదు నా మనవరాలు ఇక్కడ ఉండాలి.. లేదంటే ఒక్కొక్కరి పని అయిపోతుందని వార్నింగ్ ఇస్తుంది. హాస్పిటల్ ఓనర్ ఎవరు.. ఆయన ఇక్కడికి రావాలి అని అంటుంది. డాక్టర్ బామ్మతో మా సెక్యూరిటీ వాళ్లు వెతుకుతున్నారు.. మీ మనవరాలికి రెండు గంటల్లో ఈ ట్యాబ్లెట్ వేయకపోతే కడుపులో బిడ్డకి ప్రమాదం అని అంటుంది. అయ్యో దేవుడా ఇప్పుడు నేను నా మనవరాలిని దాని కడుపులో ఉన్న బిడ్డని ఎలా కాపాడుకోవాలి అని డాక్టర్కి వార్నింగ్ ఇచ్చి ట్యాబ్లెట్ పట్టుకొని లక్ష్మీని వెతకడానికి వెళ్తుంది.
రౌడీలు విహారిని తీసుకొచ్చి లక్ష్మీని ఉంచిన గది పక్కనే ఉంచుతారు. విహారి మాటలు విని లక్ష్మీ వీళ్లు విహారి గారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఉన్నారు అని అనుకుంటుంది. ఆయన్ను ఎందుకు తీసుకొచ్చారు.. అసలు ఎవరు వీళ్లంతా అని అనుకుంటుంది. మరోవైపు పద్మాక్షి డాక్టర్కి కాల్ చేసి లక్ష్మీ గురించి అడుగుతుంది. డాక్టర్కి లక్ష్మీ కనిపించడం లేదని విషయం తెలుస్తుంది. వెంటనే పద్మాక్షికి కాల్ చేసి ఆ లక్ష్మీ ఇక్కడ లేదు.. ఇక్కడి నుంచి వెళ్లిపోయింటుందని అంటుంది. లక్ష్మీతో పాటు ఓ పెద్దావిడ ఉంది.. ఆవిడను పట్టుకుంటే లక్ష్మీ గురించి తెలుస్తుందని డాక్టర్ అంటుంది.
శోభ, రౌడీ లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఏమైనా తినాలి అని కానీ తాగాలి అని అనిపిస్తుందా అని అంటే లేదు అని లక్ష్మీ అంటుంది. అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు అని జాలి పడి అడుగుతున్నా అని శోభ అంటుంది. కాసేపట్లో మా బాస్ వస్తాడు. ఆయన వచ్చి ఆయన చేతులతో నిన్ను చంపేస్తాడు.. నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు తీర్చుతా అని రౌడీ అంటాడు. విహారికి ఆ మాటలు వినిపిస్తాయి. పక్క గదిలో ఎవరో అమ్మాయి ఉందని అనుకొని ఎవరు.. పక్క రూంలో ఎవరు ఉన్నారు.. కడుపుతో ఉన్న మిమల్ని వీళ్లు ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు. విహారి మాటలకు లక్ష్మీ ఏడుస్తుంది. వీళ్లు ఎవరో నాకు తెలీదండీ అని లక్ష్మీ అంటుంది. నాకు తెలీదు.. చిన్నిగొడవ తీసుకొచ్చేశారు అని అంటాడు. మిమల్ని వీళ్లు తీసుకొస్తుంటే మీ పక్కనే ఎవరూ లేరా అని విహారి అంటాడు. నా పక్కన ఎవరూ లేరు అని లక్ష్మీ అంటే మీరు ప్రెగ్నెంట్ అంటున్నారు.. పక్కన ఎవరూ లేరు అంటున్నారు.. అసలు మీ భర్త అయినా ఉండాలి కదా.. లేడు అంటే మీ భర్త మిమల్ని వదిలేసి వెళ్లిపోయాడు కదా అని అంటాడు. నేను అడిగే ప్రతీ దానికి మీ నిశబ్ధమే కారణం అయితే అందులో భరించలేని బాధ ఉంటుంది.. నేను అది భరిస్తున్నా.. నన్నూ నా భార్య వదిలేసి వెళ్లిపోయింది.. నా చుట్టూ అందరూ ఉన్నా నేను మాత్రం ఒంటరి వాడిని అని అంటాడు.
లక్ష్మీ చాలా ఏడుస్తుంది. మనం ఎంత బాధ పడినా మమల్ని నమ్ముకున్న వాళ్లు ఉంటారు కదా.. వాళ్ల కోసం అయినా మనం తిరిగి మామూలుగా మారాలి.. మిమల్ని వదిలేసి వెళ్లిపోయిన అమ్మాయి గురించి ఎందుకు బాధ పడతారు. మీ లాంటి మంచివాళ్లని వదిలేసి వెళ్లిపోయిన ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు అని లక్ష్మీ అంటుంది. నీ పేరు ఏంటి అని విహారి అడిగితే సిరి అని లక్ష్మీ అంటుంది. చూడు సిరి నువ్వు చెప్పే అన్నీ వినడానికి బాగుంటాయి. కానీ మనసు అడిగే ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఈ జీవితం ఎందుకు ఈ జన్మ ఎందుకు అని అనిపిస్తుందని అంటాడు. మంచితనం ఉండటం మంచిది కాదు.. నా భార్యలో ఏ స్వార్థం లేకపోవడం వల్లే ఇలా నన్ను వదిలేసి వెళ్లిపోయింది.. నీ భర్త నిన్ను వదిలేసినా నువ్వు మాత్రం వెళ్లి నువ్వు నా భర్తవి నేను నీ భార్యని.. ఈ జన్మకి ఇంతే.. నువ్వు నాకు కావాలి అని చెప్పు అని అంటాడు. నా ప్రేమ ఎలాగూ పోయింది.. నీ ప్రేమని గెలిపిస్తా.. నిన్ను ఇక్కడి నుంచి నేను కాపాడతా.. నిన్ను ఎవరూ ఏం చేయలేరు.. నేను నిన్ను రక్షిస్తాను అని విహారి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Author : Jhanshi Balleda

