Dhanush Kara Movie Review In Telugu: డిఫరెంట్ కథలు, క్యారెక్టర్లలో నటిస్తున్న కథానాయకుడు ధనుష్. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా కర. ఇందులో ప్రేమలు, డ్యూడ్ ఫేమ్ మమితా బైజు హీరోయిన్.
కేఎస్ రవికుమార్, కరుణాస్, జయరామ్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించారు. పోర్ తొళిల్ ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 30న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Kara Movie Story): కర… కర స్వామి ఓ దొంగ. అడిగితే డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర కొట్టేస్తాడు. పదహారేళ్లుగా ఇంటికి వెళ్లడు. దొంగతనాలు చేస్తూ జీవిస్తాడు. అవి మానేసి హోటల్ పెట్టుకోవాలని లోన్ కోసం ప్రయత్నిస్తే… బ్యాంకులో పని అవ్వదు. తండ్రిని డబ్బులు అడగాలని లేదా పొలం అమ్మేయాలని ఊరు వెళతాడు. అక్కడ పరిస్థితులు చూసి కర స్వామి చలించిపోతాడు.
తండ్రి మరణంతో కర స్వామి మళ్లీ దొంగతనాలు మొదలు పెడతాడు. ఎందుకు? అదీ పంచవన్ బ్యాంకు బ్రాంచుల్లో ఎందుకు దొంగతనం చేస్తున్నాడు? ఆ బ్యాంకు మేనేజర్ ముత్తు సెల్వన్ (జయరామ్) ఏం చేశారు? డీఎస్పీ భరతన్ (సూరజ్ వెంజరమూడు) ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు? కర స్వామికి, ఆయనకు మధ్య పాత గొడవ ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Kara Review Telugu): 'కర' గురించి క్లుప్తంగా చెప్పాలంటే... గొంగళి పురుగు సీతాకోక చిలుకలా ఎలా మారినట్టు, తండ్రి కోసం మంచోడిగా మారిన ఓ దొంగ కథ ఇది. దర్శకుడు విఘ్నేష్ రాజా 90లలో పల్లెటూరి బ్యాక్డ్రాప్ ఎంపిక చేసుకోవడం వల్ల లాజిక్కులతో పని లేకుండా పోయింది.
బ్యాంకు రాబరీ నేపథ్యంలో తండ్రీ కొడుకుల మధ్య బలమైన ఎమోషన్స్ ఉన్న కథ రాసుకున్నారు విఘ్నేష్ రాజా. కథలో ఆ కాలంలో రైతులు పడిన కష్టాలకూ చోటు కల్పించారు. కథను ఒక్క ఫ్యామిలీ నుంచి బ్యాంకుల వల్ల ఊరంతా పడిన కష్టాలు చూపించడంతో దొంగతనాలు చేసే హీరోని సపోర్ట్ చేయాలని ప్రేక్షకులకు అనిపిస్తుంది. అతను దొరకకుండా ఉండాలని కోరుకునేలా సన్నివేశాలు తీశారు. ఈ కథలో సమస్య ఏమిటంటే? కథా నేపథ్యాలు వేరు అయినప్పటికీ... ఇంతకు ముందు ఇటువంటి తండ్రి తనయుల ఎమోషనల్ సన్నివేశాలు ధనుష్ చేశారు. అందువల్ల, ప్రేక్షకులు కొందరికి ఆ సన్నివేశాలు రొటీన్ అనిపించవచ్చు. కానీ, బ్యాంకు రాబరీ యాక్షన్ సీన్లు బాగా రాశారు. ఎగ్జిక్యూట్ చేశారు. నేచురల్ యాక్షన్ సీక్వెన్సులు, అందులో ధనుష్ నటన థ్రిల్ ఇస్తాయి. ప్రజెంట్ పెట్రోల్, డీజిల్ కొరత గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. 90లలో గల్ఫ్ వార్ టైంలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయని సినిమాలో చూపించారు. ఆ అంశాన్ని కొందరు రిలేట్ చేసుకునే అవకాశం ఉంది.

