Dailyhunt
Karimnagar Robbery: కరీంనగర్‌లో పట్టపగలే దోపిడీ.. జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన గ్యాంగ్

Karimnagar Robbery: కరీంనగర్‌లో పట్టపగలే దోపిడీ.. జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన గ్యాంగ్

ABP దేశం 1 week ago

రీంనగర్: కరీంనగర్ నగర నడిబొడ్డున పట్టపగలే ఓ గ్యాంగ్ కాల్పులు జరిపి, దోపిడీ చేయడం స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని జ్యోతినగర్లో ఉన్న ప్రముఖ పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు.

కస్టమర్ల ముసుగులో లోపలికి చొరబడ్డ ఐదుగురు సాయుధ దుండగులు ఒక్కసారిగా తుపాకులు తీసి అక్కడి సిబ్బందిని, కస్టమర్లను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన షోరూమ్ సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల ఘటనలో నలుగురు షోరూమ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆ గ్యాంగ్ షాపులో ప్రదర్శనకు ఉంచిన భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకుని రెండు బైకులపై అక్కడి నుంచి పరారయ్యారు. బుల్లెట్ గాయాలైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కరీంనగర్ నగరంలో ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించారు.

సిబ్బంది ఏం చెప్పారంటే..
పోలీసులకు ప్రత్యక్ష సాక్షులైన జ్యువెలరీ షాపు సిబ్బంది ఘటన జరిగిన తీరు వివరించారు. కస్టమర్ల లాగ మొదట ఓ వ్యక్తి షాపులోకి వచ్చాడు. ఆ వెంటనే మరో నలుగురు లోపలికి ప్రవేశించారు. తన ప్లాన్ ప్రకారం తుపాకులు తీసి సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారని సిబ్బంది తెలిపారు. కొందరు మహిళా సిబ్బంది బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కుని ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. వారిని సైతం దుండగులు బయటకు లాక్కొచ్చి తాళ్లతో కట్టేసి, బంగారు సంచులలో నింపుకుని అక్కడినుంచి దుండగులు పారిపోయారని పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆ ఆ షాపులో, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలు సేకరిస్తున్నారు. దోపిడీపై జ్యువెలరీ షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam