Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karthika Deepam 2 Serial Today May 29th: కార్తీకదీపం సీరియల్: జ్యోత్స్న పొగరు అణిచే కండీషన్ పెట్టిన సూరజ్! ఫ్లెక్సీలతో పాట్లు తప్పవా!

Karthika Deepam 2 Serial Today May 29th: కార్తీకదీపం సీరియల్: జ్యోత్స్న పొగరు అణిచే కండీషన్ పెట్టిన సూరజ్! ఫ్లెక్సీలతో పాట్లు తప్పవా!

ABP దేశం 2 weeks ago

Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్లు టర్న్లతో ఆసక్తికరంగా మారుతోంది.

ఈ రోజు(మే 29న) ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నా పరువు పోయింది..

జ్యోత్స్న తన స్టాల్ని కూల్చేసిన వీడియోని సూరజ్ జ్యోత్స్న ఇంట్లో అందరికీ చూపిస్తాడు. కామెంట్స్ కూడా కార్తీక్ చదవడంతో అందరూ షాక్ అయిపోతారు. అందరూ నీకు అనుకూలంగా కామెంట్స్ చేశారు కదా.. ఇందులో మీ పరువు పోవడం ఏంటి అని పారు అంటే తర్వాత కామెంట్స్ చదువు బ్రో అని సూరజ్ చెప్పడం.. కల్తీ ఫుడ్ పెట్టడం వల్లే మూయించేసి ఉంటారు అని కామెంట్స్ రావడంతో ఇది నష్టమే కదా అని సూరజ్ అంటాడు.

నాకు న్యాయం కావాలి..

మీ మనవరాలి వల్ల నాకు చాలా నష్టం జరిగింది.. నాకు న్యాయం కావాలి.. సరైన సమాధానం కావాలి.. అన్నీ సాయంత్రం లోపు కావాలి అని అంటాడు. వాడి మాటలు నమ్మొద్దు తాత బావ ఎప్పుడూ బయట వాళ్లకే సపోర్టు చేస్తున్నాడు.. అసలు వాడు ఒక వేస్ట్ ఫెల్ తాత అని జ్యోత్స్న వెళ్లిపోతుంది.

నువ్వే ఏదో చేసుంటావే..

జ్యోత్స్న దగ్గరకు పారు వచ్చి వాడు ఇంటికి వచ్చి అంత గొడవ చేశాడు అంటే నువ్వు ఏదో చేసుంటావ్ అని పారు అంటుంది. వాడో వేస్ట్ ఫెలో అని జ్యోత్స్న అంటుంది. ఇంతలో శివనారయణ పిలవడంతో మీ తాత పిలుస్తున్నాడు సారీ చెప్పేయవే అని పారు అంటే చచ్చినా చెప్పను అని జ్యోత్స్న అంటుంది.

Also Read : ఏపీలో పెద్ది టికెట్ ధరలు పెరిగాయ్ - అబ్బాయ్ సినిమాకు బాబాయ్ జీవో జారీ

నీకు తనకి గొడవ ఏంటి..

జ్యోత్స్నని దశరథ్ వాళ్లు పిలిచి నీకు ఆ అబ్బాయికి గొడవ ఎందుకు అయింది.. తప్పు నీదే అని బావ కూడా అంటున్నాడు అని అందరూ అంటారు. అసలు నీకు ఆ అబ్బాయికి పరిచయం ఎలా అయింది అని తాత అడుగుతాడు. ఏం జరిగిందో మొత్తం చెప్పు అని కార్తీక్ అడిగితే మొత్తం కార్తీక్ చెప్తాడు. అందరూ జ్యోత్స్నని తిడతారు. తప్పు నీదే అని అర్థమవుతుంది.. నువ్వు అడిగింది ఇచ్చేయాలా.. అని సుమిత్ర అంటుంది. దశరథ్ సూరజ్ని పిలిపించమని పెద్దాయన అంటాడు.

కాళ్లు పట్టుకో..

దీప జ్యోత్స్న దగ్గరకు వెళ్లి సూరజ్ కాళ్లు పట్టుకో అని అంటుంది. ఆ సూరజ్ నాకు నచ్చలేదు.. వాడికి బాగా పొగరు అని జ్యోత్స్న అంటుంది. నువ్వు వీలు అయినంత త్వరగా సూరజ్ కాళ్లు పట్టుకొని సారీ చెప్పకపోతే వాడు నీ జుట్టు పట్టుకుంటాడు అని దీప అంటుంది. నా జుట్టు పట్టుకునేంత వాడు ఎవడూ ఇంకా పుట్టలేదు అని జ్యోత్స్న అంటే పుట్టాడు అనిపిస్తుంది అని దీప అంటుంది.

నిన్ను తక్కువ చేయలేం..

సూరజ్ ఇంటికి రాగానే పెద్దాయన సూరజ్తో నష్టపరిహారంగా నీకు ఎంత డబ్బు కావాలో అని అడిగి నిన్ను తక్కువ చేయలేం అని అంటాడు. అందుకు 5 లక్షలు పెద్దాయన ఇస్తాడు. ఇవి సరిపోవు సార్ అని సూరజ్ అంటాడు. చెప్పాను కదా వీడు డబ్బు మనిషి అని జ్యోత్స్న అంటుంది. ఇంకో 5 లక్షలు ఇస్తామని పెద్దాయన అంటే సరిపోదు అని సూరజ్ అంటాడు.

Also Read : పెద్ది గురించి అడిగిన ప్రధాని - మోదీ చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీకి లింక్ ఏంటో చెప్పిన రామ్ చరణ్

నాకు డబ్బు అవసరం లేదు..

నష్టపరిహారంగా ఏం కావాలో అడుగు అని పెద్దాయన అంటే నాకు డబ్బు అవసరం లేదు.. నాకు నష్టపరిహారంగా పోయిన నా మర్యాద నాకు ఇప్పించండి అని అంటాడు. అలా ఎలా ఇస్తాం అని అందరూ అంటే నమ్మకం పోయిన చోట నమ్మకం, గౌరవం పోయిన చోట గౌరవం, అన్నీ నాకు కావాలి అని అంటాడు. ఏం అర్థం కావడం లేదు అని అందరూ అంటే నాకు అర్థమైంది.. నాతో సారీ చెప్పించాలి అనుకుంటున్నాడు అని అంటుంది. సూరజ్ విషయంలో తప్పు చేశా క్షమించండి అని షాప్ ముందు ఫ్లెక్సీ పెట్టమని అంటావా.. కార్తీక్ అంటే అవును అదే కావాలి అని సూరజ్ అంటాడు. ఇలా వదిలేస్తే జ్యోత్స్నతో జ్యూస్లు కలిపించేలా ఉన్నావని పారు అంటుంది. జ్యోత్స్న షాక్ అయిపోతుంది. మీరు చెప్పింది కూడా నాకు న్యాయంగానే ఉందని సూరజ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

సూరజ్ తనకు న్యాయం కావాలి అని జ్యోత్స్న పొగరు అణిచేలా ఫ్లెక్సీలు ఫొటోలు ఏర్పాటు చేయమని చెప్పడం ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.

Author : Jhanshi Balleda

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam