Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karuppu OTT : సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

Karuppu OTT : సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

ABP దేశం 4 months ago

Suriya's Karuppu Movie OTT Release : కోలీవుడ్ స్టార్ సూర్య, సౌత్ క్వీన్ త్రిష రీసెంట్ బ్లాక్ బస్టర్ కరుప్పు (తెలుగు వీరభద్రుడు). ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 15 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

ఈ మూవీ ఓటీటీ రిలీజ్పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

కరుప్పు డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా జూన్ మూడు లేదా నాలుగో వారంలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. నాలుగు నుంచి ఆరు వారాల థియేట్రికల్ రన్ తర్వాత మూవీ డిజిటల్గా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సూర్య, త్రిషలతో పాటు ఇంద్రాస్, నట్టి సుబ్రమణియన్, అనఘ మాయ రవి, సుప్రీత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆర్జే బాలాజీ విలన్ రోల్ చేశారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు.

Also Read : Peddi Ticket Rates : తెలంగాణలో పెద్ది టికెట్ రేట్స్ పెంపు లేనట్లే - మరి ప్రీమియర్ షోస్... మేకర్స్ డెసిషన్ ఏంటంటే?

స్టోరీ ఏంటంటే?

అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెకు (అనఘా మాయా రవి) లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయడం కోసం హైదరాబాద్ తీసుకొస్తాడు ఓ తండ్రి (ఇంద్రాస్). తన వద్ద ఉన్న బంగారం అమ్మి కూతురికి ఆపరేషన్ చేయించాలని అనుకుంటాడు. వీరు నాంపల్లి రైల్వే స్టేషన్లో దిగగానే దొంగలు దాడి చేసి 60 సవర్ల గోల్డ్ దోచేస్తారు. పోలీస్ స్టేషన్కు వెళ్తే 45 సవర్ల బంగారం రికవరీ చేస్తారు. అది కూడా కోర్టు ద్వారా తీసుకోవాలని చెబుతారు.

కోర్టులో ఏ పని కావాలన్నా లాయర్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) దగ్గరకు వెళ్లాల్సిందే. ప్యూన్ దగ్గర నుంచీ లాయర్స్, జడ్జ్ వరకూ అందరూ అతని కనుసన్నల్లోనే నడుస్తారు. బంగారం కోసం తండ్రీ కూతుళ్ల బేబీ కృష్ణను సంప్రదిస్తే డబ్బు కోసం కావాలనే కేసు వాయిదా వేస్తుంటాడు. ఇది గ్రహించిన తండ్రి ఎదురు తిరిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటాడు బేబీ కృష్ణ. బంగారం కనీసం దక్కకుండా చేస్తానని బెదిరిస్తాడు. దీంతో కోర్టు ఆవరణలోనే ఉన్న వీరభద్రుడి ఆలయానికి వెళ్లిన తండ్రి అక్కడ విగ్రహానికి కారం పూసి తన కష్టాన్ని తీర్చాలని వేడుకుంటాడు. క్షేత్ర పాలకుడు భూమ్మీదకు వచ్చాక ఏం జరిగింది? తండ్రీ కూతుళ్లకు న్యాయం చేశాడా? తమ స్వార్థం కోసం కొందరు కోర్టులను ఎలా వాడుతున్నారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Brown Series OTT : అమ్మాయిలే సైకో కిల్లర్ టార్గెట్ - ఓటీటీలోకి కరిష్మా కపూర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam