Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kittu Pavan: హీరోగా ఫోక్ సాంగ్స్ స్టార్ కిట్టు పవన్... చంద్రబోస్ క్లాప్‌తో సినిమా షురూ

Kittu Pavan: హీరోగా ఫోక్ సాంగ్స్ స్టార్ కిట్టు పవన్... చంద్రబోస్ క్లాప్‌తో సినిమా షురూ

ABP దేశం 1 week ago

యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్కు మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. మన తెలుగు ప్రజల్లో జానపద గీతాలకు ఎటువంటి ఆదరణ దక్కుతోందనేది చెప్పడానికి ఆ వ్యూస్ ఓ ఉదాహరణ.

ఫోక్ సాంగ్స్ నుంచి సినిమాల్లోకి కథానాయికగా అడుగు పెట్టారు నాగదుర్గ. 'బిగ్ బాస్ 10'లో మాధురి రాథోడ్ అడుగు పెట్టవచ్చని టాక్. ఈ లిస్టులో మరో ఫోక్ సాంగ్స్ స్టార్ పేరు చేరింది. హీరోగా వస్తున్నారు కిట్టు పవన్ (Kittu Pavan).

కిట్టు పవన్ హీరోగా తెలంగాణ సినిమా
Kittu Pavan Super Hit Songs: 'అత్తగారి ఇంటికి...', 'మామిడాకులు...', 'సిత్తురాల సిత్తమ్మా...', 'నాలుగు గలే నవలేరి' వంటి జానపద గీతాలతో పాపులరైన యువకుడు కిట్టు పవన్. తెలంగాణ మట్టి వాసనలతో కూడిన పాటలు ఎక్కువ చేశారు. ఆయా గీతాలకు వందల మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు... కిట్టు పవన్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది.

కిట్టు పవన్ హీరోగా యంయస్ వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ముని శివ, శివ మల్లాల నిర్మాతలు. ఈ చిత్రానికి దిలీప్ సాయి నాయక్ దర్శకుడు. చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ గేయ రచయిత - ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ (Chandrabose) ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. మరో ముఖ్య అతిథి ఆర్ఫీ పట్నాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు దిలీప్కు నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా 'శతమానం భవతి' దర్శకుడు సతీష్ వేగేశ్న (Sathish Vegesna) స్కిప్ట్ అందజేశారు.

సతీష్ వేగేశ్న మాట్లాడుతూ... ''మంచి కథతో వచ్చిన దర్శకుడు దిలీప్కి నాకు ఎంతో సన్నిహితుడైన శివ మల్లాల, మరో నిర్మాత శివ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అని అన్నారు. ''ఈ చిత్ర నిర్మాతలు మంచి సినిమాలు చేసి పెద్ద నిర్మాతలుగా మారి పదుల కొద్దీ సినిమాలు తీయాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.

హీరో కిట్టు పవన్ మాట్లాడుతూ... ''నేను ఫోక్ సాంగ్స్ చేసేవాడిని. నేనొక చిన్న నటుడిని. అటువంటి నేను హీరోగా చేస్తున్న ఈ సినిమాకు పెద్ద పెద్ద వాళ్లు వచ్చి మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు మదిన్, ఛాయాగ్రాహకుడు జనతా బబ్లూ, నూతన దర్శకుడు కృష్ణకాంత్, ఫోక్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.

Author : S Niharika

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam