Konda Surekha Meet CM Revanth Reddy: తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్లో ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నేతలే దాడి చేయడం సంచలనంగా మారింది.
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన కామెంట్స్తో విషయం సీరియస్ అయ్యింది. కొండా సురేఖ ఆదేశాలు, ఆలోచనలు లేకుండా సుస్మిత ఇలాంటి కామెంట్స్ చేయబోరని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు కొందు మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్చ సాగుతుండగానే రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టేందుకు సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు కొండా సురేఖ. వారం పదిరోజుల నుంచి కొనసాగుతున్న వివాదం తర్వాత ఆమె తొలిసారి ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు.
Author : Khagesh

