Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kotamreddy On Vijayasai Reddy Sajjala Issue: చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kotamreddy On Vijayasai Reddy Sajjala Issue: చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABP దేశం 1 week ago

Kotamreddy On Vijayasai Reddy Sajjala Issue: మంగళగిరిలో 2022లో జరిగిన వైసీపీ ప్లీనరీలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తనపై నేరుగా భౌతికంగా దాడి చేశారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

ఈ విషయం వైసీపీ అధినేత వైఎస్ జగన్కు తెలిసినా ప్రేక్షకపాత్ర వహించారని విజయసాయి రెడ్డి ఓ లేఖ విడుదల చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో నడిచింది. ఈ నేపథ్యంలో 2022 వైసీపీ ప్లీనరీ సభా వేదికపై ఎవరెవరు కూర్చోవాలనే ప్రొటోకాల్ వ్యవహారంలో వీరి మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా.. విజయసాయిరెడ్డిపైకి సజ్జల దూసుకెళ్లి దాడి చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా విజయసాయిరెడ్డి రాసిన లేఖతో ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం స్పందించారు.

కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు

చొక్కా పట్టుకుని కొట్టారు - కోటంరెడ్డి

విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేసినప్పుడు తనపై ఎంత నీచంగా, ఘోరంగా మాట్లాడారో అందరికీ తెలుసని కోటంరెడ్డి అన్నారు. తన సొంత ఊరిలో కూడా సభపెట్టారన్నారు. తనకు విజయసాయిరెడ్డి, సజ్జలపై ఏం ద్వేషం లేదన్నారు. కానీ వాస్తవం అందరికీ తెలియాలన్నారు. విజయసాయిని సజ్జల కొట్టింది నిజమేనని చెప్పారు. మంగళగిరిలో ప్లీనరీ జరిగేటప్పుడు వేదికపై ఎవరితో మాట్లాడించాలనే దానిపై విజయసాయి, సజ్జల మధ్య వివాదం తలెత్తిదన్నారు. మాటామాటా పెరగడంతో.. సజ్జల.. విజయసాయిరెడ్డి చొక్కా పట్టున్నారన్నారు. విజయసాయిరెడ్డి 72 అవమానాలు జరిగాయని చెప్పారని, తనకు ఒక్కడికే తెలిసిన మరో ఘోర అవమానం ఉందన్నారు. తన సొంతూరైన తాళ్లపూడికి వచ్చినప్పుడు కాకుపల్లి సెంటర్లో విజయసాయికి వంద వెహికల్స్తో ఘన స్వాగతం పలికారన్నారు. దానిపై విజయసాయిని సజ్జల నీచాతినీచంగా దూషించారన్నారు. ఆ మాటలు తన నోటితో చెప్పలేనని కోటంరెడ్డి తెలిపారు.

క్యాడర్ అంచనాలు ఆకాశంలో - స్థానిక ఎన్నికల్లో జనసేనకు లిట్మస్ టెస్ట్ !

వైసీపీ క్రెడిట్ చోరీ

కూటమి ప్రభుత్వ ఘనవిజయం ఒకచరిత్ర, వైసీపీ ఘోర పరాజయం కూడా చారిత్రక ఘట్టమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ వైసీపీ వికృత రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. హిందు మతానికి ఘోర అపచారం జరిగిందని ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆలయాల్లో రథాలు తగలబడినప్పుడు, విగ్రహాల తలలు తెగ్గొట్టినప్పుడు, సింహాలు చోరీకి గురైనప్పుడు వైసీపీ నేతల నోళ్లు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు రాకూడదని వైసీపీ ఫేక్ వీడియోలతో ప్రచారాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీ క్రెడిట్ చోరీ చూస్తుంటే నాగార్జునసాగర్, సోమశిల, తెలుగు గంగ ప్రాజెక్టులు కట్టింది కూడా జగన్ అని చెప్పేట్లు ఉన్నారని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు.

ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. వినూత్న ప్రయోగానికి ఆర్టీసీ నిర్ణయం

Author : Satyaprasad Bandaru

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam