Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Krishnudu: బిగ్ బాస్ 10లోకి సినీ నటుడు కృష్ణుడు.. రియల్ లైఫ్, సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

Krishnudu: బిగ్ బాస్ 10లోకి సినీ నటుడు కృష్ణుడు.. రియల్ లైఫ్, సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

ABP దేశం 2 weeks ago

Krishnudu: తెలుగు చిత్రసీమలో తనదైన సహజమైన నటన, అమాయకత్వంతో కూడిన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణుడు. ఈయన బిగ్ బాస్ ఎంట్రీపై జోరుగా ప్రచారం జరుగుతోంది.

అతడి రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం.

రియల్ లైఫ్

కృష్ణుడు అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఈయన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి అనే గ్రామంలో ఒక జమీందారీ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి అల్లూరి సీతారామరాజు, తల్లి సావిత్రి దేవి. ఈయన ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు చిన్నచింతనడ జమీందార్గా ఉండేవారు. బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశాడు.

సినీ కెరీర్

సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చి, స్టార్టింగ్లో ఫోటోగ్రఫీ స్టూడియో నడపడంతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. మొదట్లో హ్యాపీ డేస్, పోకిరి, షాక్, వానా, యువత, ఓయ్! వంటి చిత్రాలలో కామేడీ పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. వినాయకుడు (2008) సినిమాతో హీరోగా మారి బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత విలేజ్లో వినాయకుడు, స్నేహగీతం, పప్పు వంటి చిత్రాల్లో లీడ్ రోల్స్ చేశారు. ఆర్య 2, ఏ మాయ చేశావే, మిస్టర్ పర్ఫెక్ట్, ఏటో వెళ్లిపోయింది మనసు, మనం, గోపాల గోపాల తదితర చిత్రాలలో నటించాడు.

సోషల్ మీడియా

కృష్ణుడు సోషల్ మీడియాలో వ్యక్తిగత అప్డేట్స్, పాత సినిమాల జ్ఞాపకాలు, సామాజిక విషయాలపై అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాడు.

బిగ్ బాస్లోకి మరో రైతు బిడ్డ!.. అగ్నిపరీక్ష టాస్క్లో గట్టి పోటీ.. సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ విశేషాలు

ఆసక్తికర విషయాలు

1970లలో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల వీరి కుటుంబం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా సుమారు 4,500 ఎకరాల భూమిని కోల్పోయింది. ప్రారంభంలో సాధారణంగానే ఉన్నప్పటికీ, ఒక కాలు గాయం వల్ల రెండేళ్ల పాటు నడవలేక ఇంటికే పరిమితమవ్వడంతో బరువు పెరిగాడు కృష్ణుడు. అయితే అదే బొద్దుగా ఉండే రూపం ఆయనకు 'వినాయకుడు' సినిమాలో హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. హైదరాబాద్ రాకముందు ముంబైలో ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ సుబీ శామ్యూల్ వద్ద అసిస్టెంట్గా పనిచేసి, సొంతంగా 'ది ఫేసెస్' అనే ఫోటో స్టూడియో కూడా నడిపాడు.

'బిగ్ బాస్ 10'లోకి బెంగాలీ భామ... తెలుగులో ఏయే సీరియల్స్ చేసిందంటే?

బిగ్ బాస్ 10 తెలుగు ఎంట్రీ రూమర్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సంబంధించి సెలబ్రిటీల ఎంట్రీపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, రూమర్లు ప్రచారంలోకి వస్తుంటాయి. గతంలోనూ కొన్ని సీజన్లకు కృష్ణుడి పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, బిగ్ బాస్ 10 హౌస్లోకి ఆయన అడుగుపెడుతున్నారా లేదా అనేది అధికారికంగా షో నిర్వాహకులు ధృవీకరించాల్సి ఉంది.

రియల్ లైఫ్లో కూల్.. అగ్నిపరీక్షలో హాట్!.. ఎవరీ 'కామనర్' రోహిత్ నాయుడు?

Author : Satyaprasad Bandaru

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam