Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కృష్ణ ధర్మం సనాతనం:  ఆధునిక జీవితానికి మార్గదర్శి!

కృష్ణ ధర్మం సనాతనం: ఆధునిక జీవితానికి మార్గదర్శి!

ABP దేశం 2 weeks ago

Krishna Janmashtami 2026: కృష్ణః అంటే అపరిమిత ఆనంద స్వరూపం అని అర్థం.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

సాధు జన రక్షణ, దుష్టజన శిక్షణ, ధర్మ సంస్థాపనానికైతాను మళ్ళీమళ్ళీ అవతరిస్తాననిస్వయంగా ప్రకటించాడు శ్రీకృష్ణ భగవానుడు.

రామావతారంలో రాజుగా ఆర్తులను,దీనులను ఆదుకున్నా ప్రజలతో మమేకమై ఉండలేదు. కృష్ణావతారంలో బాల్యం నుంచి జనం మధ్యలోనే గడిపాడు. క్షత్రియవంశంలో జన్మించినా రేపల్లెలో పెరిగాడు, గోవులు - గోపాలురు - గోపికలతో కలసిమెలసి తిరిగాడు. ధర్మానికి హాని కలిగించే వారిని వధిస్తూ వచ్చాడు. కృష్ణావతారంలో ఆశ్రిత వాత్సల్యం, ఆశ్రిత పక్షపాతం, భక్తజన సౌలభ్యం అడుగడుగునా కనిపిస్తాయ్. పాండవులకు దూత, సారథిగా మారి అనుక్షణం అండగా నిలిచాడు. సారథిగా అర్జునుని గుర్రాల ఆలనాపాలనా చూసి, రధానికి ఉన్నదుమ్ము, దూళి తొలగించినట్లే మీ శరీరం, మనస్సులలో మలినాలను తొలగించి గమ్యానికి చేర్చే రథసారథిని నేను అనే సందేశం ఇచ్చాడు. ధుర్యోధనుడు విందుకు పిలిస్తే కాదని విదురుని ఇంట్లో భోజనం చేసి ఆశ్రిత పక్షపాతాన్ని చాటాడు. దేవతల ఆగ్రహానికి గురైన గోపాలురు, గోవులను అక్కున చేర్చుకున్న ధర్మ పక్షపాతి కృష్ణుడు. అందుకే కృష్ణ ధర్మం సనాతనం..

కృష్ణుడే సనాతన ధర్మ స్వరూపం
ధర్మం అనేది కాలంతో మారేది కాదు..అది శాశ్వతం. శ్రీ కృష్ణుడు ఆ ధర్మానికి మూర్తీభవించిన రూపం. ఆయనే ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పాడు

భగవద్గీతే ధర్మశాస్త్రం
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రతి మాటా ధర్మానికి మార్గదర్శకం. కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం..ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలే.

స్వధర్మం పాటించడమే కృష్ణార్పణం
స్వధర్మే నిధనం శ్రేయః - అంటే తన ధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మం పాటించడకన్నా..స్వధర్మంలో చనిపోవడమే మేలు. ఇది కృష్ణుడి ప్రధాన బోధ

ధర్మం అంటే ఆచారాలు కాదు జీవన విధానం
సత్యం, అహింస, దయ, సేవ, నిస్వార్థత..ఇవి కృష్ణ ధర్మం. బయటి ఆచారాలు కాదు అంతరంగ శుద్ధి ముఖ్యం

భక్తిద్వారా ధర్మం సులభం
కలియుగంలో కఠిన తపస్సు కన్నా భక్తి సులభమైన మార్గం. మన్మనాభవ మద్భక్తః - మీ మనస్సును శ్రీ కృష్ణుడిపై నిలిపితే ధర్మం సహజంగా అనుసరించినట్టే

అవతార ఉదేశం - ధర్మసంరక్షణం
ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు శ్రీ కృష్ణుడు అవతరిస్తాడు. ఇది సనాతన ధర్మం. ప్రతియుగంలోనూ ధర్మపరిరక్షణ ఇలానే జరుగుతోంది

కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయడం
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన..ఫలం మీద ఆశ లేకుండా కర్మ చేయడమే నిజమైన ధర్మం. ఇది శ్రీ కృష్ణుడి అత్యంత శక్తివంతమైన బోధ.

ఆత్మ స్వభావం ధర్మం
మనం శరీరం కాదు..ఆత్మ. ఆత్మ ధర్మం భగవంతుడి సేవ..కృష్ణ చైతన్యం అంటే ఆత్మ ధర్మాన్ని గుర్తిండమే

సమత్వం
సుఖదుఃఖాల్లో, లాభనష్టాల్లో సమత్వం ఉంచడం కృష్ణ ధర్మం. ఇది యోగం..ఇలా ఉన్నవాడే నిజమైన ధార్మికుడు

ఆధునిక జీవితంలో కృష్ణ ధర్మం
కాలం మారినా ధర్మం మారదు..ఇవాళ్టి ఒత్తిడి, అశాంతి, అసత్యం మధ్య కృష్ణుడి బోధలు మార్గదర్శకం. నిత్యం గీత చదవడం, నామస్మరణ, సత్సంగం ఇవన్నీ సనాతన ధర్మాన్ని జీవింపచేసేవే..

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

పండుగలు, తేదీలు, శుభాకాంక్షలు, పూజా విధానం, శ్లోకాలు, పరిహారాలు, గరుడ పురాణం, చాణక్య నీతి, మహాభారతం, రామాయణం సహా ఇతర ఆధ్యాత్మిక సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి " href="https://telugu.abplive.com/spirituality" target="_self">

Author : RAMA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam