Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌

KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌

ABP దేశం 2 weeks ago

KTR Latest News: తెలంగాణ అప్పులు, అవినీతి అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న సవాళ్ల రాజకీయం ఇంకా సద్దుమణగలేదు. చాలా సార్లు ఇలాంటి సవాళ్లు చేసి తప్పించుకొని పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సవాళ్లు చేసి పోరిపోయిన ప్రభుత్వం దీన్నిపై అసెంబ్లీలోనైనా చర్చించాలని డిమాండ్ చేశారు. అక్కడైతే స్పీకర్ వాళ్లకు రక్షణగా ఉంటారని అన్నారు. తమకు ఎలాంటి అడ్డంకులు లేకుండా గంట మైకు ఇచ్చి వారు ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చని అన్నారు. సవాల్ చేసింది వారేనని, పారిపోయంది కూడా వారేనని అన్నారు.

తెలంగాణను అప్పుల్లో ముంచి ప్రభుత్వాన్ని అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఎక్కడైనా చర్చకు కేసీఆర్ వస్తే సిద్ధమని సవాల్ చేశారు. దీనిపై రియాక్ట్ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము కూడా సిద్ధమని ప్రకటించారు. టైం, ప్లేస్ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో తాము చేసినవి, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవి చర్చిద్దామని అన్నారు. అయితే దీనికి స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, కేటీఆర్తో చర్చించేందుకు తాను సిద్ధమని వెల్లడించారు. ఎక్కడో ఎందుకు తెలంగాణ భవన్కే వస్తానని కూడా ప్రకటించారు. గురువారం ఉదయం 11 గంటలకు చర్చిద్దామని అన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ను సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయమే కేటీఆర్, హరీష్రావు లెక్కలతో తెలంగాణ భవన్కు వచ్చారు. ఇంతలో గన్పార్క్ వద్దకు చర్చకు రమ్మని మంత్రులు పిలవడంతో హరీష్రావు అక్కడకు వెళ్లారు. కానీ కేటీఆర్ మాత్రం జూపల్లి కోసం ఎదురు చూశారు.

పన్నెండున్నర దాటిన జూపల్లి రాకపోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ మీడయా ముందుకు వచ్చారు. మంత్రి కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసి శాలువా కూడా రెడీ చేశామని, యినా ఆయన రాలేదని ఎద్దేవా చేశారు. అప్పులు అభివృద్ధిపై చర్చిద్దామని సవాల్ చేసి వస్తానని చెప్పిన మంత్రి పారిపోయారని అన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులకు, ముఖ్యమంత్రికి ఇదొక అలవాటుగా మారిందన్నారు.

రేవంత్ రెడ్డి చేసిన సవాల్కు తాము స్పందిస్తే మధ్యలో మంత్రి జూపల్లి జోక్యం చేసుకున్నారని, సరే ఆయనైనా వస్తారని అనుకుంటే తోకముడిచారని కేటీఆర్ మండిపడ్డారు. తనకు తానుగానే తెలంగాణ భవన్కు వస్తానని చెప్పారని, ఇప్పుడు గన్ పార్క్ అంటూ మాట మార్చారని చెప్పారు. అక్కడకు వెళ్తే చార్మినార్ అంటారని ఎద్దేవా చేశారు. ఎక్కడికైనా తాము బయల్దేరితే తెలంగాణ భవన్ దాటక ముందే అరెస్టు చేస్తున్నారని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జూపల్లికి తన శాఖలో ఏ జరుగుతుందో తెలియదని, ముఖ్యమంత్రి, ఆయన మధ్య జరిగిన పంచాయితీకి ఒక అధికారి ఉద్యోగం వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చర్చకు వస్తానని చెప్పి పారిపోయారని అన్నారు. అసమర్థుడి జీవన యాత్రలా సీఎం రేవంత్ పాలన ఉందని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లో లక్ష ఇళ్ల నిర్మించామని, దాని కంటే ఒక్క ఇంటినైనా నిర్మిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు.

Author : Khagesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam