Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Lakshimi Raave Maa Intiki  Serial Today May18th: ప్రియంవద గురించి శ్రీలక్ష్మీకి తెలిసిన నిజం ఏంటి..? ఇందిరను లక్ష్మీ ఏం అడగాలనుకుంటుంది..?

Lakshimi Raave Maa Intiki Serial Today May18th: ప్రియంవద గురించి శ్రీలక్ష్మీకి తెలిసిన నిజం ఏంటి..? ఇందిరను లక్ష్మీ ఏం అడగాలనుకుంటుంది..?

ABP దేశం 1 week ago

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: ప్రియంవద భర్తకు మెలకువ వచ్చి గొడవచేస్తుండటంతో రౌడీలు ఆమెకు ఫోన్ చేసి చెబుతారు.నేను వచ్చే వరకు అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ప్రియంవద అక్కడికి బయలుదేరుతుంది.

ఎక్కడికి వెళ్తున్నారని లక్ష్మీ, ఐష్అడగ్గా....మదర్స్డే కోసం లక్ష్మీ సర్ఫ్రైజ్ ప్లాన్ చేస్తుంది కదా....కేక్ తీసుకురావడానికి అని అబద్ధం చెప్పి వెళ్లిపోతుంది. లక్ష్మీ కూడా మధుబాబుకు కొత్త బట్టలు కొనుక్కుని వస్తానని చెప్పి ప్రియంవద వెనకే వెళ్లిపోతుంది.

భర్తను బంధించిన చోటుకు వెళ్లిన ప్రియంవద....అతనికి వార్నింగ్ ఇస్తుంది. నిన్ను నా జీవితంలోకి మళ్లీ రావొద్దని చెప్పినా పదేపదే ఎందుకు వస్తున్నావని నిలదీస్తుంది. జైలులోనే మగ్గి చనిపోతావు అనుకున్నానని బయటకు ఎందుకు వచ్చావని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నాకు నాకూతురిని ఇస్తే వెళ్లిపోతానని...ఈదేశం విడిచే వెళ్లిపోతానని మళ్లీ జన్మలో నీకు కనిపించనని చెబుతాడు. నీ కూతురుని నువ్వే కిడ్నాప్ చేశావనే కదా నిన్ను జైలులో పెట్టింది మళ్లీ నన్ను అడుగుతున్నావేంటని నిలదీస్తుంది. అదంతా అబద్ధమని నీకు కూడా తెలుసునని అంటాడు. నా నీడ కూడా కూతురు మీద పడకుండా ఉండాలనే నువ్వే ఆరోజు కూతురుని దాచేశావని అంటాడు.కనీసం ఆమె నీ దగ్గర సుఖంగా ఉందని చెప్పు చాలని అంటాడు. నీకు వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదని....నీ జీవితం ఈ చీకటి గదిలోనే మగ్గిపోవాలని చెప్పి వెళ్లిపోతుంది.

మధుబాబుకు డ్రెస్ కొని తిరిగివస్తున్న లక్ష్మీకి నర్సు రోడ్డుపై కనిపిస్తుంది. ప్రియంవదను చాటుగా కలిసి డబ్బులు తీసుకుంటుంది ఈమేనని గుర్తించిన లక్ష్మీ పరుగెత్తుకుంటూ వెళ్లి నర్సును నిలదీస్తుంది.అసలు ప్రియంవద అమ్మగారికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటని అడుగుతుంది. ఎందుకు నువ్వు ఆమెను చాటుగా కలిసి డబ్బులు తీసుకుంటున్నావని నిలదీస్తుంది. ఇదంతా అడగడానికి నువ్వు ఎవరని దబాయించగా...నేను ఆ ఇంటికోడలినని అంటుంది. మర్యాదగా నువ్వు చెబుతావా లేక పెద్దయ్యగారికి చెప్పి పోలీసులకు పట్టించమంటావా అని అంటుంది.దీంతో భయపడిపోయిన నర్సు...అది ఓ చిన్న పాప గురించి అని మాత్రం చెబుతుంది. చిన్నపాపకు మా అమ్మగారికి సంబంధం ఏంటని అడుగుతుంది. దీంతో భయపడిపోయిన నర్సు...చెప్పకపోతే ఈమె పోలీసులకు పట్టిస్తానంటోంది..చెబితే ప్రియంవద చంపేస్తుందని భయపడిపోతుంది.ఇక్కడి నుంచి తప్పించుకుంటే చాలని....లక్ష్మీని నెట్టేసి పారిపోతుంది.శ్రీలక్ష్మీ వెంటపడినా కనిపించకుండా మాయమవుతుంది.

అసలు చిన్నపాపకు ప్రియంవదకు మధ్య ఉన్న సంబంధం తెలియాలంటే ముందు ప్రియంవద జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని లక్ష్మీ అనుకుంటుంది. ఇది పెద్దమ్మగారిని అడిగితేనే తెలుస్తుందని అనుకుంటూ ఇంటికి బయలుదేరగా మార్గమధ్యలో ఐష్ వాళ్ల అన్న నెక్లెస్ తీసుకొచ్చి ఫ్రెండ్కు ఇవ్వడం చూస్తుంది.వీడేంటి నెక్లెస్ తీసుకొచ్చాడని చూస్తుంది. క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని వాటిని తిరిగి ఇవ్వడం కోసమే ఇంట్లో దొంగతనం చేసి నగలు తీసుకొచ్చాడని తెలుసుకుంటుంది. ఐష్వాళ్ల అన్నయ్య వెళ్లిపోగానే వాడి ఫ్రెండ్ను బెదిరించి ఆ నెక్లెస్ తీసుకుని లక్ష్మీ ఇంటికి వెళ్లిపోతుంది. ఇంట్లో మదర్స్ డే సెలబ్రేషన్లు జరుగుతుండగా....లక్ష్మీ పెద్దమ్మగారి దగ్గరకు వెళ్లి మిమ్మల్ని ఓ విషయం అడగాలనుకుంటున్నానని అడగడంతో ఈరోజు ఏపీసోడ్ ముగిసిపోతుంది.

Author : Ajay Kumar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam