Dailyhunt
Lion Pride: నాన్నా పందులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్‌ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!

Lion Pride: నాన్నా పందులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్‌ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!

ABP దేశం 1 week ago

Lion Pride: శివాజీ సినిమాలో విలన్లను ఉద్దేశించి హీరో రజనీకాంత్ చెప్పే "నాన్నా పందులే గుంపులుగా వస్తాయి... సింహం సింగిల్గా వస్తుంది!" అని చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది.

ఆ సినిమా విడుదలైన సంవత్సరాలు అయిపోయినా సరే ఆ డైలాగ్ మాత్రం జనం నిత్యం ఏదో చోట వింటూనే ఉన్నారు. హీరో ఎలివేషన్ కోసం ఆ డైలాగ్ను రాశారు. కానీ వాస్తవంగా సింహం సింగిల్గా ఉండదని స్టడీస్ చూస్తే అర్థమవుతుంది. అందుకే ఇకపై ఆ డైలాగ్ చెప్పే ముందు ఒకసారి వాస్తవం తెలుసుకుంటే మంచిది.

అడవి అంటేనే ఒక పోరాటం, మనుగడ కోసం ప్రతి జీవి పోరాడుతుంది. ఆకలి తీర్చుకొని బతకడానికి, ప్రాణాలను కాపాడుకోవడానికి దేనికైనా పోరాటం తప్పదు. ఇలాంటి యుద్ధంలో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న జంతువు సింహం. సాధారణంగా అడవిలోని అన్ని జంతువులు కూడా ఒంటరిగానే వేట సాగిస్తాయి. కానీ సింహం మాత్రం పూర్తిగా భిన్నం. సింహాలు తమకంటూ ఒక సామాజిక నిర్మాణాన్ని, క్రమశిక్షణతో కూడిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. దీనినే ప్రైడ్ అంటారు.

ఇంతకీ ప్రైడ్ అంటే ఏంటీ? సింహాలు సింగిల్గా తిరుగుతాయా?

సింహాలు సాధారణంగా సింగిల్గా తిరగవు. అవి ఎప్పుడూ ఒక సమూహంగా ఉండటానికే ఇష్టపడాయి. ఈ సమూహాన్ని లయన్స్ ప్రైడ్ అంటారు. ఒక ప్రైడ్లో పది నుంచి 20 వరకు సింహాలు ఉంటాయి. ఈ సామాజిక నిర్మాణంలో సభ్యుల మ్య పనులు విభజించి ఉంటాయి. ఒక ప్రైడ్లో ప్రధానంగా ఒకరి నుంచి మూడు మగ సింహాలు ఉంటాయి. అవి ఆ గుంపునకు నాయకత్వం వహిస్తాయి. మిగిలిన వాటిలో ఎక్కువ భాగం ఆడ సింహాలు, వాటి పిల్లలు ఉంటాయి.

ఈ ప్రైడ్ వ్యవస్థ అనేది కేవలం కలిసి ఉండటం మాత్రమే కాదు. అది ఒక బలమైన రక్షణ కవచం. శత్రువుల నుంచి రక్షణ పొందడానికి, సమర్థవంతంగా వేటడటానికి ఈ వ్యవస్థ ఎంతో తోడ్పడుతుంది.

ఆడ సింహాలదే కీలక పాత్ర

ప్రైడ్లో అత్యంత కీలకం ఆడ సింహాలే. ఆహార సేకరణ, వేటాడటం, లాంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తాయి. తమ కంటే పరిమాణంలో పెద్దవైన జంతువులను లేదా బలహీనంగా ఉన్న జంతువులను వేటాడుతాయి.

మగ సింహాలు సెక్యూరిటీ గార్డులే

ప్రైడ్లో మగ సింహాల పాత్ర సెక్యూరిటీ గార్డులాంటింది. గుంపులోని మగ సింహాలు గుంపునకు రక్షణగా ఉంటాయి. ఇతర మగ సింహాల నుంచి, ఇతర క్రూర మృగాల నుంచి కాపాడటమే వీటి పని. కేవలం మగ సింహం తన గంభీరమైన గర్జనతో, శక్తితో తన ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది.

సింహాలు ఎక్కువగా గుంపులుగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి ఒంటరిగా కనిపిస్తాయి. ముఖ్యంగా మగ సింహాలు తమ యవ్వన దశలో ఉన్నప్పుడు లేదా కొత్త ప్రైడ్ కోసం వెతుక్కునే టైంలో ఒంటరిగా తిరుగుతాయి. తన పాత ప్రైడ్ నుంచి విడిపోయి కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించే వరకు ఇలా ఒంటరిగా తిరుగుతాయి.

ఇప్పుడు అర్థమైందా రాజా! ఇకపై నేను సింహాన్ని నేను ఒంటరిగా వస్తా అనే ఫోజులు కొట్టొద్దు. ప్రైడ్లో కూడా ఆడ సింహం వేటకు వెళ్లకపోతే మగ సింహ ఆకలితో పస్తులు ఉండి చావాల్సిందే. అందుకే వాస్తవాలు తెలుసుకోకుండా సినిమా డైలాగ్స్ చెప్పొద్దు.

Author : Khagesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam