Loan Trap Problems: నేటి రోజుల్లో లోన్ తీసుకోవడం చాలా తేలిక అయింది. మొబైల్లో ఒక్క క్లిక్తో పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, వెహికల్ లోన్, కొన్ని నిమిషాల్లోనే ఎడ్యుకేషన్ లోన్, డాక్యుమెంట్లు ఇస్తే పెళ్లికి కూడా లోన్ లభిస్తుంది.
కానీ ఈ ప్రక్రియ ఇప్పుడు చాలా మందికి భరించలేని ఆర్థిక సమస్యగా మారింది. చిన్న చిన్న విషయాలకు కూడా లోన్ తీసుకోవడం, మీ మనశ్శాంతిని పాడుచేస్తోంది. సాధారణంగా ప్రతి నెలా వచ్చే EMI జీతంలో అధిక భాగాన్ని మింగేసినప్పుడు, లోన్ తీర్చడానికి మరొక లోన్ తీసుకుంటున్నారు. అవసరం కోసం తీసుకున్న లోన్ ఎప్పుడు అప్పుల వలగా మారుతుందో, భారత్లో డిజిటల్ లెండింగ్ వేగంగా పెరగడం వల్ల ప్రజలు సులువుగా లోన్ తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేక జట్టు పీక్కుంటున్నారు.
లోన్ ఎందుకు పెరుగుతోంది?
ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్య, వైద్యం ఖర్చులు, ఇతరత్రా అవసరాలు ప్రజలను లోన్ల వైపు నెడుతున్నాయి. చదువు కోసం 4 నుండి 20 లక్షల రూపాయల వరకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారు. పెళ్లి, ఇంటి మరమ్మతులు, విదేశీ ప్రయాణం లేదా ఇతర పెద్ద ఖర్చుల కోసం ప్రజలు పర్సనల్ లోన్లు తీసుకుంటున్నారు. తమ జీతంలో ఎక్కువ లోన్ కోసం వెళ్లినప్పుడు సమస్య పెరుగుతుంది.

ఉదాహరణకు, ఒకరు చదువు కోసం 4 లక్షల ఎడ్యుకేషన్, ఉద్యోగం వచ్చిన తర్వాత అతని EMI ప్రారంభమవుతుంది. కొంతకాలం తర్వాత పెళ్లి కోసం 10 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఆ తర్వాత కారు కొనడానికి లోన్, రోజువారీ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డ్ వాడకం పెరిగింది. ప్రతి నెలా వేర్వేరు EMIలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు కలిపి సంపాదనలో ఎక్కువ భాగం ఖర్చవుతున్నాయి. ఉద్యోగం పోయినా, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా లేదా జీతం తగ్గినా ఈఎమ్ఐ చెల్లించడం కష్టమవుతుంది. అలాంటి పరిస్థితిలో చాలా మంది పాత లోన్ తీర్చడానికి కొత్త లోన్ తీసుకుంటున్నారు. ఇక్కడే ట్రాప్లో పడతారు.
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్లో మరింత పొదుపు చేయవచ్చు
మొత్తం ఈఎంఐ విలువ సంపాదనలో ఎంత వరకు ఉండాలి
మీ మొత్తం EMI విలువ మీ నెలవారీ జీతంలో 35 శాతం నుంచి 40 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ మీ జీతంలో సగానికి పైగా భాగం EMIకే పోతుంటే, అది చాలా ప్రమాదకరం. పర్సనల్ లోన్ అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే పర్సనల్ లోన్ వడ్డీ రేటు, హోమ్ లేదా ఎడ్యుకేషన్ లోన్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.
అప్పుల ఊబి నుండి తప్పించుకోవడానికి మార్గాలివే..
1. అవసరం, కోరిక మధ్య వ్యత్యాసం
ప్రతి ఖర్చునూ లోన్ తీసుకుని చేయాల్సిన అవసరం లేదు. ముందుగా నిజంగా అవసరమా లేదా దాన్ని కొంతకాలం వాయిదా వేయవచ్చా అనేది ఆలోచించుకోవాలి. అత్యవసరమైతే ఖర్చు చేయడంలో తప్పులేదు.
2. EMI బడ్జెట్
లోన్ తీసుకునే ముందు మీ సంపాదన, ఖర్చుల పూర్తి లెక్కలు వేసుకోండి. మొత్తం EMI మీ నెలవారీ జీతంలో 40 శాతం కంటే తక్కువగా ఉండటానికి ప్రయత్నించండి.
3. ఎమర్జెన్సీ ఫండ్
మీ వద్ద కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు విడిగా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. దీనివల్ల హఠాత్తుగా వచ్చిన కష్టాలకు కొత్త లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
4. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు
ప్రతి నెలా క్రెడిట్ కార్డ్ పూర్తి బిల్లు చెల్లించడానికి ప్రయత్నించాలి. కేవలం మినిమమ్ డ్యూ మాత్రమే చెల్లించడం ద్వారా వడ్డీ వేగంగా పెరిగి, మీరు తిరిగి చెల్లించని స్థాయికి చేరుతుంది.
5. తక్కువ వడ్డీ
ఒకవేళ లోన్ తీసుకోవాల్సి వస్తే, వేర్వేరు బ్యాంకులు, NBFCల వడ్డీ రేట్లను పోల్చి చూడాలి. త్వరగా డబ్బు వస్తుందనే తొందరలో ఎక్కువ వడ్డీ ఉన్న లోన్ తీసుకుని ఇబ్బంది పడవద్దు.
6. సలహా తీసుకోండి
EMI చెల్లించడంలో ఇబ్బంది ఉంటే, బ్యాంకుతో మాట్లాడి లోన్ రీస్ట్రక్చరింగ్ లేదా టర్మ్ పెంచి, ఈఎంఐ తగ్గించుకునే ఆప్షన్ల గురించి చర్చించాలి. ఈఎంఐ తక్కువ అయినా సరే పూర్తిగా కడితే ఎలాంటి పెనాల్టీలు, అధిక వడ్డీ జరిమానాలు పడవు.
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్ ఎలా మారుతుంది?
సామాన్యులకు, మధ్యతరగతి వారికి లోన్ అనేది వరం లాంటిది. అయితే సరైన కారణంతో, సరైన అవసరాలకు లోన్ తీసుకుని సకాలంలో చెల్లించేలా చూసుకోవాలి. విద్య, వైద్యం, పెళ్లి, ఇంటి నిర్మాణం లాంటి పలు అవసరాలకు లోన్ తీసుకుంటారు. కానీ వడ్డీ రేట్లు తెలుసుకుని, నెలవారీ ఈఎంఐ మీ సంపాదనలో 40 శాతానికి మించకుండా చూసుకుంటే సరిపోతుంది.
Author : Shankar Dukanam

