Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Lokesh Kanagaraj : MCUలో లోకేశ్ కనగరాజ్ - కాటాలన్ క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్

Lokesh Kanagaraj : MCUలో లోకేశ్ కనగరాజ్ - కాటాలన్ క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్

ABP దేశం 2 weeks ago

Director Lokesh Kanagaraj Cameo Role In Kattalan Movie : కాటలాన్... ఏనుగు దంతాల స్మగ్లింగ్ ప్రధానాంశంగా రూపొందించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

పాల్ జార్జ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీలో ఆంటోని వర్గీస్ హీరోగా నటించారు. ఈ మూవీ క్లైమాక్స్లో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.

MCUలో లోకేశ్ కనగరాజ్

కాటాలన్ క్లైమాక్స్లో లోకేశ్ కనగరాజ్ అతిథి పాత్రలో కనిపించారు. లియో కార్టెల్ రోల్లో లెజెండ్ మార్కో అంటూ అనౌన్స్ చేశారు. దీంతో కాటాలన్ సీక్వెల్లో లోకేశ్ కీలక పాత్రలో నటించనున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. మార్కో సినిమాటిక్ యూనివర్స్లో లోకేశ్ భాగం కానున్నట్లు తెలుస్తుండగా... సర్ప్రైజ్ రోల్ క్యామియో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.

మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ సిల్వర్ స్క్రీన్పై బ్లడ్ బాత్ సృష్టించిన మూవీ మార్కో. క్యూబ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాత షరీప్ అహ్మదే... కాటాలన్ మూవీని కూడా నిర్మించారు. ఫ్యూచర్లో మార్కో సినిమాటిక్ యూనివర్స్లో లోకేశ్ కనగరాజ్ సహా ఇతర కొత్త పాత్రలను కూడా ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read : ఏపీలో పెద్ది టికెట్ ధరలు పెరిగాయ్ - అబ్బాయ్ సినిమాకు బాబాయ్ జీవో జారీ

లోకేశ్ కనగరాజ్ ఓ వైపు డైరెక్టర్గా బిజీగా ఉంటూనే మరోవైపు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తొలి డెబ్యూ తమిళంలో మూవీ ఉంటుందని భావించినా మలయాళంలో ఎంట్రీ ఇచ్చారు. ఆయన పూర్తి స్థాయిలో హీరోగా నటిస్తున్న తమిళ మూవీ డీసీ. ఇందులో దేవదాస్ అనే పవర్ ఫుల్ పాత్రలో లోకేశ్ కనిపించనున్నారు. బాలీవుడ్ నటి వామికా గబ్బీ హీరోయిన్గా నటించనున్నారు. 'కెప్టెన్ మిల్లర్' ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read : పెద్ది గురించి అడిగిన ప్రధాని - మోదీ చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీకి లింక్ ఏంటో చెప్పిన రామ్ చరణ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam