సిగరెట్లు తాగడం వల్ల స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. స్పెర్మ్ డీఎన్ఏ కూడా దెబ్బతినొచ్చు. కాబట్టి ఈ అలవాటు వీలైనంత త్వరగా మానేస్తే మంచిది.
ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల టెస్టోస్టెరోన్ స్థాయిలను ప్రభావితం అవుతాయి. ఇవి స్పెర్మ్ ఉత్పత్తిని, క్వాలిటీని తగ్గిస్తాయి.
తగినంత నిద్ర లేకపోవడం కూడా ఓ సమస్యే. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, తక్కువ నిద్ర టెస్టోస్టెరోన్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది.
ఒత్తిడి కూడా లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. క్రానిక్ స్ట్రెస్ వల్ల హార్మోన్ బ్యాలెన్స్ దెబ్బతిని స్పెర్మ్ నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది.
జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం. ప్రాసెస్డ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక చక్కెర ఉన్న ఆహారం స్పెర్మ్ ఆరోగ్యాన్ని దెబ్బతీయొచ్చు.
హాట్ బాత్స్, ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవడం, టైట్ అండర్‌వేర్ వంటివి టెస్టికల్స్ ఉష్ణోగ్రత పెంచి స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపించవచ్చు. ప్యాంట్ జేబులో ఫోన్ ఎక్కువసేపు పెట్టుకోవడం, గంటల తరబడి ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు దగ్గరగా ఉండడం ప్రభావం చూపొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
వ్యాయామం చేయకపోవడం. శారీరక శ్రమ లేకపోతే ఊబకాయం, హార్మోన్ అసమతుల్యత పెరిగి ఫెర్టిలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ రాకపోయినా తప్పు తమది కాదని టెస్ట్లు చేయించుకోకుండా ఆలస్యం చేయడం పెద్ద తప్పు. కొన్ని సమస్యలు త్వరగా గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

