Madurai Temple Architecture in Telugu: మధురై మీనాక్షి అమ్మవారి మూల విగ్రహం మరకత శిలతో చెక్కినది. ఇదిగ్రీన్-బ్లూ కలర్స్ మిక్స్ చేసిన మరకత శిల ..
ఆకుపచ్చ కాంతిని వెలువరిస్తుంది..అందుకే అమ్మవారిని మరకతాంబిక అని కూడా పిలుస్తారు. పచ్చ రంగు వృద్ధి, శాంతి ,సమృద్ధికి సంకేతం. జగన్మాత అయిన మీనాక్షి అమ్మ తన భక్తుల దారిద్ర్యాన్ని తొలగించి వారికి సంపద, మనశ్శాంతిని, వ్యవసాయ సమృద్ధిని ప్రసాదిస్తుంది. ఆమె పచ్చని వర్ణం ప్రకృతికి ప్రతీక అని, ప్రపంచాన్ని సుభిక్షం చేసే ఆమె కరుణకు ప్రతీక అని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. పురాణాల ప్రకారం మీనాక్షి అమ్మవారు మహావిష్ణువుకు సోదరి. విష్ణువు వర్ణం కారుమేఘ శ్యామలం. అన సోదరుడి రంగునే తాను కూడా ధిరించి నారాయణిగా కొలువై ఉందని భావించేందుకే ఈ రూపం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి సంబంధించినది. బుధుడు బుద్ధి, విద్య, వాక్చాతుర్యం, కళలకు అధిపతి. మధురైని పాలించే మీనాక్షి అమ్మవారు సకల కళల నిలయం, జ్ఞాన స్వరూపిణి. మీనాక్షిని పూజిస్తే విద్య, బుద్ధి కుశలతలో రాణిస్తారని నమ్మకం.
ఆధ్యాత్మిక తత్వంలో చెప్పుకుంటే.. పరాశక్తి దశ మహావిద్యలలో ఓ రూపం అయిన మాతంగి ( రాజ శ్యామల) దేవి ఈ రంగు ఆకుపచ్చ. శ్యామల అంటే పచ్చని రంగు అని అర్థం. సంగీతం, కళలు, వాక్పటిమకు అధిదేవత రాజశ్యామల దేవి..మధురైలో మీనాక్షిగా రాజ్యమేలుతోంది.
అమ్మవారి పచ్చని రూపం అందం మాత్రమే కాదు..మనసుకి ప్రశాంతత, జీవితానికి అవసరమైన జ్ఞనాన్ని అందించే దైవిక సంకేతం.
మధురై ఆలయం వాస్తు పురుష మండలం ప్రకారం రూపొందించారు. ఇది కాస్మిక్ గ్రిడ్ లాండిది. దైవిక శక్తి కేంద్రంగా ఉంటూ పంచభూతాలను సమతుల్యం చేస్తోంది. ప్రధాన ద్వారం తూర్పు ముఖంగా ఉండి సూర్యోదయ కిరణాలు గర్భగుడిని తాకేలా డిజైన్ చేశారు. ఇది ఆధ్యాత్మిక జాగృతి , శక్తి ప్రవాహానికి సంకేతం. మీనాక్షి, సుందరేశ్వరుడు గర్భగుడులు కేంద్రంలో ఉంటాయి. చుట్టూ సమకేంద్రంలో ప్రాకారాలు కనిపిస్తాయి.. ఇవి రక్షణ, శక్తి వృద్ధికి ఉపయోగపడతాయి

అయోధ్య ఆలయంలో 40 రోజుల్లో 70 సార్లు చోరీ - ప్రాచీన భారతంలో ఆలయ చోరులకు ఎలాంటి శిక్షలు విధించేవారు?
ఆలయానికి మొత్తం 14 గోపురాలున్నాయి. 4 రాజగోపురాలు నాలుగు దిక్కుల్లో 150 నుంచి 170 అడుగుల ఎత్తులో ఉంటాయి. మొత్తం 985 స్తంభాలున్నాయి..ప్రతి స్తంభం మీద దేవతా శిల్పాలు దర్శించుకోవచ్చు. మొత్తం 33 వేలకు పైగా శిల్పాలున్నాయి. పురాణకథలు, దేవతలు , జంతువుల బొమ్మలు అన్నీ ద్రవిడ శైలిలో ఆకట్టుకునేలా ఉంటాయ్.
మధురై మీనాక్షి ఆలయం కేవలం ఆరాధనా స్థలం మాత్రమే కాదు.. వాస్తు-ఇంజనీరింగ్, కళ, ఆధ్యాత్మికతల సమ్మేళనం.
మహిళలు చేతులకు గాజులు ధరించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? భారతీయ సంస్కృతిలో వాటి లోతైన చరిత్ర!
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు
Author : RAMA

