Mahesh Babu's Trekking Training For Varanasi Project : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న విజువల్ వండర్ వారణాసి. ఈ ప్రాజెక్ట్ గురించి చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే ట్రెండ్ అవుతోంది.
టైటిల్ గ్లింప్స్ తర్వాత మూవీ నుంచి అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాలేదు. రీసెంట్‌గా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కాగా... కాస్త గ్యాప్ ఇచ్చారు.
అయితే, చిన్న విరామం దొరికినా మహేశ్ బాబు ఫ్యామిలీతో టూర్స్‌కు వెళ్తుంటారు. రీసెంట్‌గా ఆయన జర్మనీ వెళ్లడంతో పర్సనల్ టూర్ అని అంతా భావించారు. కానీ అది వారణాసి కోసమే అని తాజాగా క్లారిటీ వచ్చింది.
ట్రెక్కింగ్ ట్రైనింగ్ కోసం
'వారణాసి' మూవీ కోసం ట్రైనింగ్‌లో భాగంగా మహేశ్ జర్మనీ వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా ఇన్ స్టా వేదికగా ఆయన ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. జర్మనీ బ్లాక్ ఫారెస్ట్‌లో ఫిట్ నెస్, వెల్ నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో కఠినమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రెక్కింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటూ వారణాసి కోసం రెడీ అవుతున్నట్లు క్యాప్షన్ పెట్టారు. 'బ్లాక్ ఫారెస్ట్... ట్రెక్కింగ్... ట్రైనింగ్... పునరుజ్జీవం' అంటూ రాసుకొచ్చారు. వీటిని చూసిన ఫ్యాన్స్... సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
Also Read : 'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?
ఇంటర్నేషనల్ స్థాయిలో....
ఈ మూవీని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్‌ను తలపించగా... రీసెంట్‌గా మెక్సికోలోని కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్ (CCXP) ఈవెంట్‌లో వారణాసి గ్లింప్స్‌తో పాటు మేకింగ్ వీడియోను ప్రదర్శించారు. ఎక్స్‌క్లూజివ్‌గా ఆ వేడుక కోసమే స్పెషల్ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించడమే లక్ష్యంగా రాజమౌళి సైతం స్పీచ్ వీడియో ఇచ్చారు.
వారణాసి పుట్టుక నుంచి త్రేతా యుగంతో పాటు వివిధ కాలాల్లో హీరో సాహస అన్వేషణ బ్యాక్ డ్రాప్‌గా మూవీ తెరకెక్కుతోంది. పలు దేశాలతో కథ ముడిపడడం, వరల్డ్ టూర్ నేపథ్యం కావడంతో... దక్షిణ అమెరికా సహా లాటిన్ అమెరికా మార్కెట్లపై కూడా జక్కన్న అండ్ టీం ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే కెన్యా, ఒడిశాలతో పాటు విదేశాల్లో కీలక యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. హైదరాబాద్‌లో భారీ సెట్స్ రూపొందించారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మూవీలో రుద్రుడిగా, శ్రీరాముడిగా మహేశ్ బాబు కనిపించనున్నారు. అలాగే, మందాకిని పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ రణ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Author : Ganesh Guptha

