Malavika Mohanan Maldives Trip Photos: ప్రభాస్ 'ది రాజా సాబ్', అంతకు ముందు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మూవీస్ కంటే గ్లామరస్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ఆమె స్టైల్.
ఈ మధ్య ఆవిడ మాల్దీవులు వెళ్లారు. ఆ ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
గ్లామరస్ బికినీ లుక్కులో మాళవిక మోహనన్ సందడి చేశారు. స్వచ్ఛమైన సముద్రపు నీరు, తెల్లటి ఇసుక బీచ్‌లలో మాళవిక దిగిన బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
మాల్దీవుల్లో బీచ్ విల్లా బయట షార్క్ (సొరచేప) ఈదడాన్ని గమనించినట్టు మాళవికా మోహనన్ తెలిపారు. ఉదయాన్నే నిద్రలేవగానే అటువంటి దృశ్యం కనిపించడం అదే మొదటిసారి అని ఆమె పేర్కొన్నారు. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
షార్క్‌ను చూసిన తర్వాత కొన్ని సెకన్లు ఎంతో భయపడినప్పటికీ... ఆ తర్వాత ఆ భయం ఆశ్చర్యంగా మారిందని, ఆ క్షణాలను ర్తిగా ఆస్వాదించానని మాళవికా మోహనన్ వెల్లడించారు. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
'ది రాజా సాబ్' బాక్సాఫీస్ రిజల్ట్ అంత గొప్పగా రాలేదు. దాంతో ఆ తర్వాత కొత్త తెలుగు సినిమాకు మాళవికా మోహనన్ సైన్ చేయలేదు. (Image Courtesy: malavikamohanan_ / Instagram)

