Manchu Manoj cleans Dasari Narayana Rao Memorial: దాసరి నారాయణ రావు వర్ధంతి మే 30న. ఈ సందర్భంగా మొయినాబాద్ ప్రాంతంలోని ఆయన సమాధి దగ్గరకు వెళ్లిన కొందరు పరిస్థితి చూసి చలించిపోయారు.
పిచ్చిమొక్కలు, చెత్తతో నిండిన సమాధి వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది మనోజ్ మంచు కంట పడింది. హుటాహుటిన స్పందించి శుభ్రం చేశారు. 
దాసరి నారాయణ రావు సమాధి (ఘాట్) దగ్గరకు స్వయంగా వెళ్లిన మంచు మనోజ్ 'శుభ్రత పరిశుభ్రత' కార్యక్రమం చేపట్టారు. దాసరి ఘాట్ పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు. 
దాసరి వర్ధంతి నాడు ఉదయం ఏడు గంటలకు మొయినాబాద్ వెళ్లారు మంచు మనోజ్. తన టీంతో కలిసి క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు. ఆ తర్వాత దాసరికి నివాళులు అర్పించారు.
దాసరి విగ్రహానికి మంచు మనోజ్, ఇతరులు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న ఫోటో.
దాసరిని, ఆయన సమాధి (ఘాట్)ని ఇండస్ట్రీ మర్చిపోయినా... గుర్తు పెట్టుకుని మరీ మనోజ్ వెళ్లి క్లీనింగ్ చేసి నివాళులు అర్పించడంతో సర్వత్రా ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

