Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Manchu Manoj Cleans Dasari Ghat: దాసరి ఘాట్ క్లీనింగ్... ఉదయం ఏడింటికి వెళ్లిన మంచు మనోజ్... దర్శకరత్నకు నివాళులు

Manchu Manoj Cleans Dasari Ghat: దాసరి ఘాట్ క్లీనింగ్... ఉదయం ఏడింటికి వెళ్లిన మంచు మనోజ్... దర్శకరత్నకు నివాళులు

ABP దేశం 5 months ago

తెలుగు చిత్రసీమకు ఎంతో సేవ చేసిన వ్యక్తి దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao). దర్శక నిర్మాతగా సినిమాలు చేయడమే కాదు... కార్మికుల శ్రేయస్సు కోసం పని చేసిన నాయకుడు ఆయన.

అటువంటి దర్శకరత్నను కనీసం వర్ధంతి నాడు కూడా ఎవరూ పట్టించుకోలేదు. 'దాసరి నారాయణరావు గారి సమాధి పరిస్థితి' అంటూ ఓ యాంకర్ వీడియో షేర్ చేశారు. 'దిక్కులేని దాసరి సమాధి... పట్టించుకునే నాథుడు ఎవరు?' అంటూ ప్రశ్నలు తలెత్తాయి. ఆ వీడియో మనోజ్ మంచు దృష్టికి వెళ్ళడంతో ఇవాళ ఉదయం ఏడు గంటలకు దాసరి ఘాట్ (సమాధి) దగ్గరకు చేరుకుని క్లీన్ చేశారు. అనంతరం నివాళులు అర్పించారు.

తెలుగు సినిమాకు ఎంతో చేసిన వ్యక్తి...
ఈ దుస్థితి చూసి నిజంగా చలించిపోయా
దాసరి సమాధి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా... 'రా కింగ్' మనోజ్ మంచు కామెంట్ చేశారు. ''దాసరి గారి ఘాట్ చుట్టూ ఉన్న పరిస్థితి చూసి నిజంగా చలించిపోయా. నాకు ఎంతో బాధ బాధ కలిగింది. తరతరాలకు స్ఫూర్తిని ఇచ్చిన వ్యక్తి దాసరి గారు. తెలుగు సినిమాకు ఆయన ఎంతో సేవ చేశారు. తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకు వచ్చినందుకు థాంక్స్. నా వంతు సాయం చేస్తానని హామీ ఇస్తున్నాను'' అని పేర్కొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్...
ఉదయం ఏడింటికి దాసరి సమాధి చెంతకు వెళ్లి!
దాసరి ఘాట్ గురించి శనివారం (మే 29న) మంచు మనోజ్ సోషల్ మీడియాలో స్పందించారు. దాసరి వర్ధంతి రోజైన ఆదివారం (మే 30న) ఉదయం ఏడు గంటలకు సమాధి చెంతకు చేరుకున్నారు. తన సినిమా చిత్రీకరణకు వెళ్ళడానికి ముందు క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టారు.

Also Read: Upcoming Telugu Movies In June 2026 - జూన్లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'

దాసరి ఘాట్ క్లీనింగ్ సందర్భంగా మనోజ్ మంచు మాట్లాడుతూ... ''నేను మూడు నాలుగేళ్ల క్రితం ఇక్కడకు వచ్చా. ఇప్పుడు ఇక్కడ ఇటువంటి పరిస్థితి చూసి చాలా బాధేసింది. ఇటీవల చిత్రపురి కాలనీ దాటుతున్న సమయంలో ఆయన విగ్రహం కనిపించింది. అప్పుడు నాకు దాసరి ఘాట్ గుర్తొచ్చింది. మా టీం నాకు వైరల్ వీడియో చూపించారు. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. షూటింగ్ కంటే ముందు ఇక్కడికి వచ్చి క్లీన్ చేశా'' అని చెప్పారు.

Also Read: Manchu Manoj At Dasari Ghat Photos - దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్... క్లీనింగ్ ఫోటోలు

మంచు మనోజ్ స్వయంగా తన టీంతో కలిసి సమాధి (ఘాట్) మీద, చుట్టుపక్కల పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, ఎండుటాకులు, చెత్తను తొలగించారు. ఆ పరిసర ప్రాంతాలు అన్నిటినీ శుభ్రం చేశారు. దాంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవల 'ఐక్య ధైర్య సేనా సమితి' సేవాసంస్థను స్థాపించిన మంచు మనోజ్... రక్తదాన శిబిరాలు నిర్వహించడం, సహాయ కార్యక్రమాలు చేపట్టడం, మాతృదేవోభవ అనాథాశ్రమానికి వెళ్లి రావడం వంటివి చేశారు.

Also Read: Upcoming OTT Releases In June 2026 - జూన్లో ఓటీటీ లవర్స్కు పండగ... ధురంధర్ 2 to కేడీ, పేట్రియాట్... స్ట్రీమింగ్ అయ్యే టైటిల్స్ లిస్ట్

Author : S Niharika

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam