Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Meghasandesam Serial Today May 29th: 'మేఘసందేశం' సీరియల్‌: భూమికి నిజం చెప్పొద్దన్న గగన్‌ - సంతోషంలో తార

Meghasandesam Serial Today May 29th: 'మేఘసందేశం' సీరియల్‌: భూమికి నిజం చెప్పొద్దన్న గగన్‌ - సంతోషంలో తార

ABP దేశం 2 weeks ago

MeghasandesamSerial Today Episode: గగన్‌ ఎమోషనల్ అవుతూ తన ప్రేమ విషయం ఎప్పటికీ భూమికి తెలియకూడదని శారదతో మాట తీసుకుంటాడు. దీంతో మేఘసందేశం చాలా ఆసక్తిగా జరుగుతుంది.

పెళ్లి మండపానికి వెళ్లడానికి రెడీ అవుతున్న పూరి తన నగలు కనిపిచడం లేదని శారదను పిలిచి అడుగుతుంది. అన్నయ్య ఇంకా రాలేదని ఏమైందని కూడా అడగడంతో శారద వస్తాడులే నువ్వైతే రెడీ అవ్వు అంటూ చెప్తుండగానే.. అప్పుడే తార వస్తుంది. అత్తయ్య, పూరి అంటూ పేపర్స్‌ చూపిస్తూ.. భూమి సంతకం పెట్టేసింది పూరి అని చెప్పగానే.. పూరి నిజంగా పెట్టిందా అని అడుగుతుంది. దీంతో నిజంగానే పెట్టింది. ఇప్పుడు నా గుండెల్లో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. అత్తయ్యా ఇప్పుడైనా నన్ను మీ కోడలిగా ఒప్పుకుంటారు కదా..? అని అడుగుతుంది.

గగన్‌ కూడా మార్చేస్తానన్న తార

ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

అప్పుడే గగన్‌ వస్తాడు. గగన్‌ను చూసిన తార గగన్‌ గారు మీరు ఇంకా ఇలా డల్లుగా ఉంటే ఎలా..? సరే మీరు ఇంకా ఎమోషనల్‌ లో ఉన్నారు అనుకుంటాను. ఒక్కసారి పెళ్లి అయిపోనివ్వండి.. మీ ముఖంలో ఈ డల్‌ నెస్‌ పోయేలా చేస్తాను అంటూ గగన్‌ను హగ్ చేసుకుంటుంది తార. గగన్ మాత్రం బాధగా అలాగే చూస్తుంటాడు. అప్పుడే తారకు ఫోన్‌ వస్తుంది. దీంతో తార సరే అత్తయ్యా మా అన్నయ్య కాల్ చేస్తున్నారు. మీరు త్వరగా రండి మనం మండపంలో కలుద్దాం అంటూ తార వెళ్లిపోతుంది. తార వెళ్లిపోయాక పూరి అమ్మా నా పెళ్లి చీర ఎక్కడుంది అని అడగ్గానే.. లోపల ర్యాక్‌లో ఉందని శారద చెప్తుంది. చీర కోసం పూరి లోపలికి వెళ్లిపోతుంది.

భూమికి నిజం చెప్పొద్దన్న గగన్

ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

శారద ఏడుస్తూ.. అరేయ్‌ గగన్‌ ఏంట్రా ఇది.. భూమి ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టినప్పటి నుంచి నీ జీవితం అంతా భూమే అన్నట్టుగా ఉండేవాడివి.. మీరిద్దరూ ఎంత గొడవ పడ్డా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అనుకున్నాను. కానీ ఈరోజు మీరు కాగితాల మీద సంతకాలు పెట్టుకునే వరకు వచ్చారు అంటూ ఏడుస్తుంటే.. గగన్‌ కూడా బాధగా నేను కూడా ఇంత వరకు వస్తుంది అనుకోలేదమ్మా అంటాడు. దీంతో శారద మరి ఎందుకు రా భూమితో నిజం చెప్పలేదా..? నాకు నువ్వే కావాలి భూమి అని చెప్పలేకపోయావా..? అని అడగ్గానే.. గగన్‌ ఏడుస్తూ.. ఈరోజు చెప్పాలి అనుకున్నానమ్మ.. భూమి నువ్వు లేకపోతే ఈ గగన్‌ లేడు అని చెప్పాలి అనిపించింది. కానీ పూరి పెళ్లి గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత నేను ఏం మాట్లాడలేకపోయాను అమ్మ అని చెప్పగానే.. శారద బాధగా గగన్‌ మరి నీ జీవితం నీ మనసు వాటికి విలువ లేదా..? అని అడగ్గానే.. గగన్‌ బాధగా కొన్నిసార్లు మనసు కంటే బాధ్యత పెద్దద అమ్మ.

నిజం చెప్పాలంటే ఇప్పుడు కాదు నేను ఎప్పుడో ఓడిపోయాను. అందుకే ఇప్పుడు మౌనంగా ఉండిపోయాను.. అని చెప్పగానే.. శారద అలా అనకురా.. అంటూ ఏడుస్తుంటే.. నిజం అమ్మా భూమి కూడా అంత ఈజీగా సంతకం పెట్టేస్తుంది అనుకోలేదు.. అపూర్వ అడగ్గానే.. సంతకం పెట్టేసింది. తను కూడా నన్ను వదులుకోవడానికి సిద్దపడినట్టేనా..? అమ్మ అని అడగ్గానే.. శారద ఏడుస్తూ.. లేదురా..? నా కోడలు అంత ఈజీగా నిన్ను వదులుకోవడానికి ఇష్టపడదు. ఏదో బాధలో ఏదో అపార్థంలో సంతకం పెట్టి ఉంటుంది. ఏదో కారణం అయ్యి ఉండొచ్చు.. అని చెప్పగానే.. గగన్ బాధగా అమ్మ ఆనాకు ఒక మాట ఇస్తావా..? అని అడగ్గానే.. శారద ఏంటి నాన్న అని అడగ్గానే.. గగన్‌ తనకు భూమి మీద ప్రేమ ఉందని.. నేను తనను ఎప్పటికీ మర్చిపోలేదని నువ్వు తనకు చెప్పకూడదు.. అంటూ గగన్‌ చెప్పగానే.. శారద షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

Author : Sudhakar Mansetty

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam