Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mexico World Cup Magic:  మెక్సికో వీరవిహారం.. ఈక్వెడార్ ను క్రష్ చేస్తూ 40 ఏళ్ల తర్వాత నాకౌట్ లో గెలుపు, ఫ్యాన్స్ కు పూనకాలు!

Mexico World Cup Magic: మెక్సికో వీరవిహారం.. ఈక్వెడార్ ను క్రష్ చేస్తూ 40 ఏళ్ల తర్వాత నాకౌట్ లో గెలుపు, ఫ్యాన్స్ కు పూనకాలు!

ABP దేశం 1 month ago

Mexico Defeats Ecuador To Break Knockout Curse: ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్ లో కో-హోస్ట్ మెక్సికో సంచలన విజయం సాధించింది.

మంగళవారం తమ ఐకానిక్ అజ్టెకా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఈక్వెడార్ ను 2-0 తేడాతో ఊచకోత కోసింది. ఈ బిగ్ విక్టరీతో మెక్సికో ఏకంగా 40 ఏళ్ల నాకౌట్ శాపాన్ని బద్దలు కొట్టింది. లాస్ట్ టైమ్ మెక్సికో 1986 లో తాము వరల్డ్ కప్ ఆర్గనైజ్ చేసినప్పుడు మాత్రమే నాకౌట్ మ్యాచ్ లో గెలిచింది, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ మ్యాజిక్ రిపీట్ అయింది. తుఫాను వాతావరణం వల్ల మ్యాచ్ ఒక గంట లేట్ గా స్టార్ట్ అయినప్పటికీ హోమ్ టీమ్ ప్లేయర్లు గ్రౌండ్ లోకి రాగానే అటాకింగ్ గేమ్ తో ఈక్వెడార్ ను వణికించారు.

జూలియన్ సూపర్ గోల్.. రావుల్ జిమెనెజ్ రాకెట్ షాట్
మ్యాచ్ స్టార్టింగ్ నుంచే మెక్సికో ఫుల్ డామినేషన్ చూపించింది. 17 ఏళ్ల వండర్ కిడ్ గిల్బెర్టో మోరా ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్ లో ఛాన్స్ దక్కించుకుని, 1958 లో పీలే తర్వాత వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో ఆడిన సెకండ్ యంగెస్ట్ ప్లేయర్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. మ్యాచ్ 22వ నిమిషంలో రోబెర్టో అల్వరాడో ఇచ్చిన పాస్ ను అందుకున్న జూలియన్ క్వినోన్స్ లెఫ్ట్ వింగ్ నుంచి దూసుకెళ్లి ఈక్వెడార్ కీపర్ హెర్నాన్ గాలిండెజ్ ను దాటించి ఒక మైండ్ బ్లోయింగ్ గోల్ కొట్టాడు. దీంతో స్టేడియం అంతా ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తిపోయింది. ఆ తర్వాత 30వ నిమిషంలో జూలియన్ ఇచ్చిన అద్భుతమైన అసిస్ట్ తో ఫుల్హామ్ స్ట్రైకర్ రావుల్ జిమెనెజ్ బాల్ ను టాప్ కార్నర్ లోకి రాకెట్ లా పంపి మెక్సికోకు 2-0 లీడ్ ఇచ్చాడు.

FIFA Shootout Drama: ఫిఫా వరల్డ్ కప్లో పెనాల్టీల ఊచకోత.. పరాగ్వే చేతిలో జర్మనీ ఔట్, నెదర్లాండ్స్ ను దెబ్బకొట్టిన మొరాకో!

క్లీన్ షీట్ తో మెక్సికో సరికొత్త రికార్డ్
సెకండ్ హాఫ్ లో ఈక్వెడార్ కోచ్ సెబాస్టియన్ బెక్కాసెక్ చాలా చేంజెస్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మెక్సికో డిఫెండర్ సీజర్ మోంటెస్. ఈక్వెడార్ అటాక్ ను పక్కాగా బ్లాక్ చేశాడు. ఈక్వెడార్ ప్లేయర్ జాన్ యెబోవా కొట్టిన కొన్ని షాట్లను మెక్సికో కీపర్ రావుల్ రాంజెల్ సూపర్ సేవ్స్ తో అడ్డుకున్నాడు. ఈ టోర్నీలో ఫ్రాన్స్, అర్జెంటీనాలతో పాటు గ్రూప్ స్టేజ్ లో ఆడిన మూడు మ్యాచులూ గెలిచిన ఏకైక థర్డ్ టీమ్ మెక్సికో కావడం విశేషం, పైగా ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా సమర్పించుకోకుండా క్లీన్ షీట్ మెయింటైన్ చేస్తోంది. మ్యాచ్ లాస్ట్ మినిట్స్ లో ఈక్వెడార్ ప్లేయర్ పీరో హింకాపీ అంపైర్ తో గొడవపడి రెడ్ కార్డ్ తెచ్చుకోవడంతో వారి కథ కంప్లీట్గా ముగిసింది.

రౌండ్ ఆఫ్ 16 లో ఇంగ్లాండ్ తో ఫైట్.. క్వార్టర్స్ నుంచి అమెరికాలోనే మ్యాచ్ లు
అజ్టెకా స్టేడియంలో ఆడిన లాస్ట్ 10 వరల్ڈ కప్ మ్యాచుల్లో మెక్సికోకు ఇప్పటివరకు ఓటమనేదే లేదు. 1970, 1986 వరల్డ్ కప్ ఫైనల్స్ కు హోస్ట్ గా ఉన్న ఈ గ్రౌండ్ సెంటిమెంట్ ఆదివారం జరగబోయే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లోనూ తమను గెలిపిస్తుందని మెక్సికో ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నెక్స్ట్ రౌండ్ లో ఇంగ్లాండ్ లేదా డీఆర్ కాంగో టీమ్ తో మెక్సికో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్స్ నుంచి జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్ లన్నీ కంప్లీట్గా యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) లోనే జరగబోతున్నాయని, కాబట్టి హోమ్ గ్రౌండ్ లో ఆడే లాస్ట్ మ్యాచ్ లో ఈక్వెడార్ ను దెబ్బకొట్టడం చాలా హ్యాపీగా ఉందని మెక్సికో ఫ్యాన్స్ అంటున్నారు.

Author : Ayesha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam