Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mirror Superstition: పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!

Mirror Superstition: పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!

ABP దేశం 3 days ago

Children Mirror: చిన్న పిల్లలకు అద్దం చూపించకూడదని పెద్దవాళ్లు చెబుతుంటారు. ఎందుకు అని అడిగితే మాటలు రావంటారు, ఎత్తు పళ్లు వస్తాయని, మోషన్స్ అవుతాయని..

ఇలా చాలా చెబుతారు. ఇవన్నీ నిజమో కాదో తెలియకపోయినా ఇప్పటికీ దీన్ని అనుసరిస్తున్నవారెందరో ఉన్నారు. ఇంతకీ నిజంగా చిన్నారులకు అద్దం చూపించకూడదా? ఇది మూఢనమ్మకమా? దీనివెనుక శాస్త్రీయకారణం ఉందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉంటే పిల్లలు బుద్ధి, చదువు, మాటలపై తీవ్ర ప్రభావం ఉంటుందా? పరిహారాలేంటి?

సైన్స్ ఏం చెబుతోందంటే...

నవజాత శిశువుల్లో తనను తాను గుర్తించడం అనే సామర్థ్యం పూర్తిగా ఏర్పడదు. కనీసం 18 నెలలు..అంటే ఏడాదిన్నర గడిచిన తర్వాత తమని తాము అద్దంలో గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ లోగా అద్దం చూపిస్తే ఆ ప్రతిబింబాన్ని వేరొక బేబీగా భావిస్తారు. అలాంటప్పుడు గందరగోళం, భయం కలిగే అవకాశం ఉంది. ఆ సమయంలో చిన్నారులు భయపడితే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అతిగా అద్దం చూపిస్తే నిద్ర సమస్యలు, ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది. ఆధునిక శిశు మనస్తత్వం శాస్త్రం కూడా ఈ వయసులో అధిక స్టిములేషన్ నివారించాలనే సూచిస్తోంది.

చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?

ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు..

ఆరోగ్యపరంగా చూస్తే చిన్నారుల కళ్లు, మెదడు అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటాయి. అద్దంలో కనిపించే ప్రతిబింబం కళ్లపై అనవసర ఒత్తిడి తీసుకొచ్చి అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. చిన్నారుల చేతిలో అద్దం ఉంటే..పొరపాటున పగిలితే గాయాలవడం లాంటి రిస్క్ కూడా ఉంది. అందుకే చిన్నారులకు అమ్మ, నాన్న, మామ, అక్క, అన్నయ్య అని నేరుగా ముఖాలు పరిచయం కావడమే ఆరోగ్యకరం. ఇది భావోద్వేగ అభివృద్ధికి, బంధం బలపడేందుకు సహాయపడుతుంది.

అద్దం చూపిస్తే ఏమవుతుంది? ఆధ్యాత్మిక రహస్యం

హిందూ ధర్మం, నమ్మకాల ప్రకారం..అద్దంలో కనిపించే ప్రతిబింబం పూర్వజన్మ స్మృతులను రేకెత్తించి..మనసుని అస్థిర పరుస్తుందని నమ్మకం. అద్దంలో కనిపించే ప్రతిబింబం..ఆత్మిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. అప్పుడప్పుడే బాహ్య ప్రపంచానికి అలవాటు పడుతున్న చిన్నారి భావోద్వేగాలపై అద్దం ప్రభావం ఉంటుందట. పైగా అద్దాన్ని దృష్టి దోషానికి ద్వారంగా భావిస్తారు. శిశువు ఆరా చాలా సున్నితంగా ఉండడం వల్ల..బాహ్య ప్రభావాల నుంచి రక్షించేందుకు ఈ నియమాన్ని విధించారు పెద్దలు. కాటుక పెట్టడం, దిష్టి పూసలు కట్టడం కూడా సంప్రదాయ రక్షణలో భాగమే. దీనికి బదులుగా తల్లి కళ్లలోకి చూడడం, సహజ వెలుగును చూపించడం, ప్రకృతిలో ఎక్కువ సేపు ఉంచేలా చేయడం ద్వారా శిశువు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు.

నమ్మకాల పేరుతో ఇప్పటికీ పాటిస్తున్న ఎన్నో అలవాట్లు..సైన్స్ తో ముడిపడి ఉన్నవే. అయితే అందుకు స్పష్టమైన కారణాలపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల అవి నమ్మకాలుగా మిగిలిపోయాయి. చిన్నారులకు అద్దం చూపించాలి అనుకుంటే 18 నెలల తర్వాత ప్రయత్నించండి.

హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Author : RAMA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam