Dailyhunt
Nagarjuna : పాతికేళ్ల యువకుడిగా నాగ్! - కింగ్ 100వ సినిమా స్టోరీ అదేనా?

Nagarjuna : పాతికేళ్ల యువకుడిగా నాగ్! - కింగ్ 100వ సినిమా స్టోరీ అదేనా?

ABP దేశం 1 week ago

Nagarjuna's King 100th Movie Story : కింగ్ నాగార్జున 100వ మూవీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన కెరీర్లోనే కీ మైల్ స్టోన్గా నిలవనున్న మూవీలో ఆయన స్పెషల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ ఆర్ఏ కార్తిక్ దర్శకత్వం వహిస్తుండగా... ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తైంది.

25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకూ...

'కింగ్ 100' వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ తెరకెక్కుతుండగా... ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ మూవీలో తాను 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకూ వివిధ దశల్లో, డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నట్లు చెప్పారు. పాతికేళ్ల యువకుడిగా కనిపించేందుకు డీ ఏజింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వయసులోనూ నాగ్ మన్మథుడిలా యంగ్ లుక్లో కనిపిస్తారు. ఇక ఈ సినిమాలో పాతికేళ్ల లుక్ అంటేనే హైప్ క్రియేట్ అవుతోంది. ఇది అక్కినేని ఫ్యాన్స్కు బిగ్ ట్రీట్ అనే చెప్పాలి. ఓ సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎదిగే ఓ వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్తో ఈ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. సెంటిమెంట్ ప్రధానాంశంగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా మూవీ రూపొందుతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల టాక్.

Also Read : మన రామయ్య వచ్చేశాడు - శ్రీరాముడుగా రణబీర్ కపూర్ లుక్ చూశారా!

ఈ మూవీలో ఓ హీరోయిన్గా టబు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగ్, టబులపై కీలక సీన్స్ కూడా షూట్ చేశారట. స్టోరీ పరంగా చూస్తే నాగ్ మూడు గెటప్స్లో కనిపిస్తారని... అందుకే ముగ్గురు హీరోయిన్స్ ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఇక మరో హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు స్క్రిప్ట్ వినిపించగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్లో భాగం కానున్నారట. మూడో రోల్ కోసం నాట్యం ఫేం సుస్మితా భట్ను ఎంపిక చేసినట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

టైటిల్ అదేనా!

ఈ మూవీకి కింగ్ 100, కింగ్ 100 నాటౌట్, లాటరీ కింగ్ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ దసరాకు సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నాగ్ కెరీర్లో ఈ వందో మూవీ సంథింగ్ స్పెషల్ కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ రానున్నాయి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam