మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా చేయాల్సిన 'దేవర' సీక్వెల్ 'దేవర 2' ఆలస్యం కావడంతో... అబ్బాయ్ బదులు బాబాయ్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో ఒక భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మాస్ కమర్షియల్ దర్శకుడు కొరటాల శివ.
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కాన్సెప్ట్ పోస్టర్‌లో 'When Power Meets Purpose, Mass Becomes A Moment' అని క్యాప్షన్ ఇచ్చారు. దాంతో ఇదొక పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతోంది. మరి ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? క్వశ్చన్ మొదలైంది.
అనిరుధ్ కావాలని అభిమానుల ఒత్తిడి?
కొరటాల శివ లాస్ట్ సినిమా 'దేవర'కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఆ సినిమా విజయంలో అనిరుధ్ అద్భుతమైన నేపథ్య సంగీతం, పాటలు కీలక పాత్ర పోషించాయి. అందుకని, బాలయ్య సినిమాలో కూడా అనిరుధ్ ఉంటే బాగుంటుందని నందమూరి అభిమానుల నుంచి కాస్త ఒత్తిడి ఉంది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి రెండు సమస్యలు ఉన్నాయి. అందులో మొదటిది తమన్.
బాలయ్య సినిమా నుంచి తమన్‌ను తప్పిస్తారా?
బాలకృష్ణ సినిమా అంటే తమన్ మ్యూజిక్ కంపల్సరీ అని తెలుగు చిత్రసీమతో పాటు ప్రేక్షకులలో బలమైన ముద్ర పడింది. రజనీకి బక్కోడు, బాలయ్యకు బండోడు అని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా ఉన్నాయి. నందమూరి తమన్ అని బాలయ్య ఏకంగా నామకరణం చేశారు. కొన్నేళ్లుగా ఆయన చేసిన హిట్, సూపర్ హిట్ సినిమాలకు తమన్ సంగీతం అందించారు. మరి, అటువంటి తమన్ వద్దని అనిరుధ్ ని తీసుకోవాలంటే కొంచెం కష్టమే. దర్శకులకు బాలయ్య ఫ్రీడమ్ ఇస్తారు. ఆయన ఎప్పుడూ డిమాండ్ చేసింది లేదు. కాకపోతే అనిరుధ్ ఫిక్స్ అని అనుకోవడానికి లేదు. ఆయనను సినిమాలోకి తీసుకుని రావడానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి.
అనిరుధ్ రెమ్యూనరేషన్ & డెడ్ లైన్!?
అనిరుధ్ పాటలు ఇవ్వడానికి మాత్రమే కాదు... నేపథ్య సంగీతం పూర్తి చేయడానికి కూడా టైమ్ తీసుకుంటారని ఒక టాక్ ఉంది. ఆయన హడావిడిగా ఏదో ఒకటి చేసి ఇచ్చే రకం కాదు. ఆయనతో పని తొందరగా కాదని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని బాలయ్య, కొరటాల ప్లాన్ చేస్తున్నారు. మరి అనిరుధ్ అంటే టైమ్ కి ఇస్తారా? లేదా? అనేది చూడాలి.
అనిరుధ్ అంటే రెండో సమస్య... ఆయన రెమ్యూనరేషన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 21 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని వినికిడి. మరి, ఆ రేంజ్ డిమాండ్ చేస్తే బడ్జెట్ పరిమితుల కారణంగా నిర్మాతలు ఆలోచిస్తారు. అదీ సంగతి. ఈ సినిమాను కొరటాల మిత్రుడు సుధాకర్ మిక్కిలినేనికి చెందిన యువ సుధా ఆర్ట్స్, సుధాకర్ చెరుకూరికి చెందిన ఎస్.ఎల్.వి సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
Also Read: Trisha - Karuppu Update: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Author : S Niharika

