Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి

New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి

ABP దేశం 3 months ago

New Online Gaming Rules: న్యూఢిల్లీ: భారత్లో కొన్ని నెలల కిందట ఆన్లైన్ గేమింగ్ మీద నిర్ణయం తీసుకోగా.. నేటి (మే 1) నుంచి ఆన్లైన్ గేమింగ్కు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ గేమింగ్ రూల్స్, 2026 నేటి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. ఇవి గేమింగ్ ఇండస్ట్రీని క్రమబద్ధీకరించడమే కాకుండా గేమర్లకు సేఫ్ డిజిటల్ స్పేస్ కూడా అందిస్తాయి. ఈ రూల్స్ అమలులోకి రావడంతో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి కేంద్రీకృత చట్టపరమైన ఫ్రేమ్వర్క్ లభిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం ఆన్లైన్ గేమింగ్ను 3 భాగాలుగా విభజించారు. దాంతోపాటు ఇకనుంచి మనీ పెట్టి గేమ్స్ ఆడటంపై పూర్తిగా నిషేధం విధించారు. కొత్త రూల్స్ అమలులోకి రావడంతో ఏం జరుగుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

కొత్త ఆన్లైన్ గేమింగ్ రూల్స్ ద్వారా ఏం మారింది ?

కొత్త గేమింగ్ రూల్స్ను వినియోగదారుల సెక్యూరిటీ, సురక్షితమైన గేమింగ్, ఈ విభాగం వృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇంతకు ముందు వివిధ రాష్ట్రాలకు ఒక్కో తీరుగా రూల్స్ ఉండేవి. ఈ నిబంధనల ప్రకారం, ఇప్పుడు గందరగోళాన్ని తొలగించారు. కొత్త ఆన్లైన్ గేమింగ్ రూల్స్ అమలులోకి రావడంతో డబ్బు పెట్టి ఆడే ఆటలు పూర్తిగా నిషేధించారు. రూల్స్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే రూల్ కూడా ఉంది. ఎవరైనా ఆన్లైన్ పెయిడ్ గేమింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే కనుక వారికి 3 సంవత్సరాల వరకు జైలుశిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. అదేవిధంగా ఎవరైనా ఆన్లైన్ పెయిడ్ గేమింగ్ను ప్రకటిస్తే కనుక ప్రభుత్వం వారికి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష, రూ. 2 కోట్ల భారీ జరిమానా విధించవచ్చు.

3 కేటగిరీలుగా ఆన్లైన్ గేమ్స్

కొత్త ఆన్లైన్ గేమ్స్ నిబంధనల ప్రకారం గేమింగ్ను 3కేటగిరీలుగా విభజించారు. E-స్పోర్ట్స్ విభాగంలో ప్రొఫెషనల్, కాంపిటీటివ్ గేమింగ్, స్కిల్స్ అండ్ స్ట్రాటజీ ఆధారిత గేమ్స్ చేర్చారు. ఆన్లైన్ సోషల్ గేమ్స్లో వినోదంతో పాటు నేర్చుకోవడం ఉంటుంది. సాధారణంగా సేఫ్ అని భావించే ఆటలను ఆన్లైన్ గేమింగ్లో చేర్చారు. మూడవ కేటగిరీ ఆన్లైన్ మనీ గేమ్స్ కాగా దీనిపై పూర్తిగా నిషేధం విధించారు. ఆటల వర్గాలను నిర్ణయించే అధికారం ఒక కేంద్రం చేతిలో ఉంది.

గేమర్స్పై ఏ ప్రభావం చూపుతుంది..

కొత్త ఆన్లైన్ నిబంధనలలో గేమర్స్ భద్రతపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొత్త రూల్స్ వినియోగదారుల వయస్సు ధృవీకరణ, టైమ్ లిమిట్ నియంత్రణ, పేరెంటల్ కంట్రోల్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా తప్పనిసరి చేసింది. అది కొన్ని సమస్యలకు పరిష్కారం చూపింది. ఇది గేమింగ్కు బానిస కావడాన్ని అరికట్టడానికి కొంత దోహదం చేస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ నిబంధనలు ప్రజలను ఆర్థిక నష్టాల నుంచి రక్షించడంలో హెల్ప్ చేస్తాయి.

కొత్త చట్టాలు, రూల్స్ వచ్చాక ఈ విభాగంలో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు డబ్బులు పెట్టి ఆన్ లైన్ గేమింగ్ వెళ్లే వారు సైతం డబ్బులో పోగొట్టుకోకుండా కొంచెం కట్టడి చేసినట్లు రూల్స్ పనిచేస్తాయి.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam