Nindu Manasulu Serial Today Episode: సుధాకర్ ఇందిర వాళ్ల దగ్గరకు వచ్చి ప్రేరణకు కంగ్రాట్స్ చెప్పి అందరికీ బంతి భోజనం తీసుకొచ్చాను.. అందరికీ వడ్డించు అని సుధా ఐశ్వర్యతో చెప్తాడు.
ఇవి ఎవరు తెమ్మని చెప్పారు అని ఐశ్వర్య అడిగితే నేను చెప్పానని రంజిత్ అంటాడు. దానికి ఐశ్వర్య అందుకేనా ఇందాక నుంచి భోజనాలకు కూర్చొండి అని చెప్తుంది అని అంటుంది. పెళ్లి అయిన జంటకి పెళ్లి భోజనాలు పెట్టించాలి అనుకున్నా.. హడావుడిగా పెళ్లి అయిపోయినా ఇద్దరూ కలిసి భోజనం చేయాలి అందుకే మీ మామయ్యకి చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశా అని చెప్తాడు.
ఐశ్వర్య భోజనం వడ్డించడానికి వెళ్తూ ఒక విషయం అడగటం మర్చిపోయాను ఓనర్ గారు.. మీరు మా నాన్నని మామయ్య అని ఎందుకు పిలిచారు.. మీకు మా నాన్న తెలుసా మీకు ఎలా మామయ్య అవుతారు అని అడుగుతుంది. మా అమ్మకి తమ్ముడు కాబట్టి అని రంజిత్ అనడంతో అందరూ షాక్ అయిపోతారు. ఇందిర లేచి ఏంటి బాబు నువ్వు ఆ మోసగాడి అక్క కొడుకువా.. ఈ విషయం నీకు ముందే తెలుసా.. తెలిసి మాతో ఎందుకు చెప్పలేదు బాబు.. అసలు ఆ విషయం దాచాల్సిన అవసరం ఏం వచ్చింది అని అడుగుతుంది. అదంతా అయిపోయింది ఆంటీ ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అని రంజిత్ అనేస్తాడు. పెళ్లి చేసుకొని బాధ్యతగా చూసుకోవాల్సిన వాడు మమల్ని దిక్కులేని వాళ్లలా వదిలేశాడు. మీరు మమల్ని ఆయన మీద జాలితో ఇక్కడ ఉండమన్నారా అని అడుగుతుంది. అలా ఆలోచించేవాడినే అయితే ఆరోజే మీ విషయం గురించి మాట్లాడేవాన్ని. మీరు ఆయన భార్య అని ఇక్కడ ఉండమనలేదు.. మీ ప్లేస్లో ఎవరు ఉన్నా ఇలాగే చేసేవాడిని.. బంధుత్వంతోనే బంధాలు నిలబడతాయి అంటే మీరు ఇలా నా ఇంటికి వచ్చేవాళ్లు కాదు.. ఆ గణ అందరి ముందు సమాన హక్కు ఉన్న మిమల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోయాను.. ఇవన్నీ జరుగుతున్నా ఆయన ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కాలేదు.. ఆయన మాట్లాడాలి అనే మా సంబంధం బయట పెట్టాను.. అయినా ఆయన మాట్లాడలేదు.. ఆ గణ ఏదో ప్లాన్తోనే ఇదంతా చేస్తున్నాడు అని అంటాడు.
ఐశ్వర్య రంజిత్తో ఆ గణతో మాకు కాకుండా మీకు కూడా ఏమైనా గొడవ ఉందా.. వాడు మీకు కూడా ఏదైనా అన్యాయం చేశాడా.. అని అడుగుతుంది. సమయం వచ్చినప్పుడు నేనే మీరు అడగకుండా అన్నీ చెప్తా ఇప్పుడు నన్ను ఏం అడగొద్దు అని అంటాడు. ముందు భోజనం చేద్దాం పదండి అని సుధా అందర్ని తీసుకొచ్చి కూర్చొపెడతాడు. ఐశ్వర్య అందరికీ వడ్డిస్తుంది. అందరికీ ప్లేట్స్ పెట్టిన ఐశ్వర్య ఒక ప్లేట్ తక్కువ వచ్చింది అంటే దానికి సుధాకర్ ప్రేరణ, ఐశ్వర్యలకు ఒక్క ప్లేట్లో పెట్టమని అంటాడు. నాకు వద్దు మీరు తినండి తర్వాత తింటానని ప్రేరణ లేచేస్తుంటే సిద్ధూ ఆపి.. ఇద్దరం ఒకే ఆకులో తినాలా.. లేదంటే ఒకరి తర్వాత ఒకరం తినాలా అని అడుగుతాడు. ఒకే సారి ఒకే ఆకులో తినండి అని సుధాకర్ చెప్తాడు. ఐశ్వర్య అక్కా, బావలకు ఒకే ఆకులో వడ్డిస్తుంది.
సుధాకర్ చెప్పడంతో సిద్ధూ ప్రేరణకి స్వీట్ తినిపిస్తాడు. తర్వాత ప్రేరణకు తినిపించమని సిద్ధూ అడిగితే ప్రేరణ కోపంగా చూస్తుంది. దాంతో సిద్ధూ వద్దు అనేస్తాడు. సుధాకర్ ఇందిరతో చూశావా అక్క సిద్ధూ అప్పుడే భార్య మాట వినేస్తున్నాడు అని అంటాడు. ఇందిర తినకుండా చూస్తూ ఉంటే సిద్ధూ ప్రేరణతో నువ్వు తినకపోతే మీ అమ్మ కూడా తినదు బాధ పడుతుంది అని అంటే ప్రేరణ తల్లి కోసం తినడం మొదలు పెడుతుంది. తింటూ ఉన్న ప్రేరణకు ఆకులో సిద్ధూ చేయి తగలడంతో కోపంగా తినకుండా ఆగిపోతుంది. దాంతో సిద్ధూ చేయి పక్కకి పెడతాడు. అప్పుడు తింటుంది. ప్రేరణ పొలమారడంతో సిద్ధూ కంగారు పడటం చూసి అందరూ హ్యాపీగా ఫీలవుతారు.
సిద్ధూ, ప్రేరణల పెళ్లిని తలచుకొని ఇందిర బాధ పడుతుంది. విజయానంద్ మనసులో సిద్ధూ ఏ అమెరికా దాన్నో ఆస్ట్రేలియా దాన్నో చేసుకొని అటు నుంచి అటే వెళ్లిపోకుండా దీన్ని చేసుకున్నాడు.. ఒకవైపు రాజశేఖరం అంటే ఇప్పుడు ఇది.. అయినా సిద్ధూని మంజుల రానివ్వదు కదా.. తల్లీకొడుకుల్ని విడదీసేస్తా అప్పుడు నేను అనుకున్నది జరుగుతుందని అనుకుంటాడు. ఇంతలో గణ వస్తాడు. నేను మీకు చాలా సార్లు చెప్పాను.. ఆ ప్రేరణ మాయలాడి అని సిద్ధూ బాబుకి కూడా చెప్పాను.. ఎవరూ నమ్మలేదు.. తీరా చూస్తే అదే నిజం అయింది.. నా జీవితం నాశనం చేసిన దాన్ని అసలు వదలకూడదు అనుకున్నా కానీ అది ఇప్పుడు మీ కోడలు అయిపోయింది అని అంటాడు గణ. ఆ పరువు లేని దాన్ని మా ఇంటికి తీసుకొచ్చి మా కోడల్ని చేసుకుంటామని అనుకుంటున్నావా.. అది మా ఇంటి కోడలే కాదు అని విజయానంద్ మంజులకు రెచ్చగొడతాడు. పెద్ద వాళ్లగా మీరు ఆశీర్వదించడం తప్ప ఇంకేం చేయలేం.. ఏం పాపం చేశామో ఏంటో ఇలాంటిది దొరికిందని గణ అంటాడు. దానికి మంజుల చెప్పడం అయితే బయల్దేరమని చెప్పండి అని వెళ్లిపోతుంది. ఛా అనుకుంటూ గణ వెళ్లిపోతాడు.
ప్రేరణ గదిలో కూర్చొని బాధ పడుతుంటే సిద్ధూ కూడా కాస్త దూరంలో కూర్చొంటాడు. నీ పర్మిషన్ లేకుండా నీ మెడలో తాళి కట్టానని ఆలోచిస్తున్నావ్.. అడగలేదు అని ఒక్క కారణంతో నన్ను నేరస్తుడిలా చూస్తున్నావ్.. నువ్వు అలా చూసిన ప్రతీసారి నేను ఏదో మహాపాపం చేసినట్లు ఉంది..ప్రేరణ అలా చూడకు ప్లీజ్.. మనం కలవాలి అని ఆ పైవాడు నిర్ణయించాడు.. నేను నీ పర్మిషన్ తీసుకోలేదు అన్న ఒక్క కారణం పక్కన పెట్టి చూడు.. ఈ పెళ్లి ఎంత అద్భుతంగా ఉంటుందో.. నీ మెడలో తాళి ఎంత అపురూపంగా కనిపిస్తుందో అని అంటాడు. ప్రేరణ తాళి చూసి లేదే నాకేం అలా అనిపించడం లేదే.. అదే నువ్వు చెప్పినట్లు ఈ తాళి నాకు అపురూపంగా కనిపించడం లేదు.. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందా అనిపిస్తుంది అని అంటుంది. ఏమైంది చెప్పు.. ఏమైనా తల్లకిందులైపోయిందా.. భూకంపం వచ్చి మొత్తం కుప్పకూలిపోయిందా.. సునామీ వచ్చిందా అని అడుగుతాడు. అవును నాకు సునామీ వచ్చినట్లు ఉంది.. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు ప్రేరణ అని సిద్ధూ అంటే అవును చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాను.. నాకు ఏడుపొస్తుంది.. ఈ పెళ్లి వల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఒక్కసారి అయినా ఆలోచించావా అని ప్రేరణ అడుగుతుంది. నేను ఎవరి గురించి ఆలోచించలేదు.. నాకు నా మనసు చెప్పింది.. నిన్ను పెళ్లి చేసుకోమని.. నీ పక్కనే ఉండమని.. నేను నా హార్ట్ని ఫాలో అయ్యా అంతే అని అంటాడు. అవునా అయితే నా నేను నా హార్ట్ని ఫాలో అవ్వాలి కదా నా హర్ట్ ఏం చెప్తుందో తెలుసా.. ఈ తాళి వద్దు అంటుంది. ఈ పెళ్లి వద్దు అంటుంది.. అని ప్రేరణ చెప్పగానే.. సిద్ధూ చాలా బాధ పడతాడు. నేను అయితే జరిగిన దాన్ని ఓ దైవ కార్యంగా చూస్తున్నాను.. ఇంకేం ఆలోచించకుండా ధైర్యంగా ఉండు.. రేపు నాతో పాటు మా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టు అని అంటాడు. ఏ ఆడపిల్ల అయినా పెళ్లి తర్వాత కొత్త జీవితం గురించి ఆలోచిస్తుంది.. నేను మాత్రం ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాను.. అంటుంది. నా మీద కోపంతో ఈ మాటలు అంటున్నావా.. గౌరవంతో అంటున్నావా.. చెప్పు ప్రేరణ అని సిద్ధూ అడుగుతాడు. ప్రేరణ, సిద్ధూల మాటలు ఇందిర వింటూ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Author : Jhanshi Balleda

