Nindu Manasulu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది.
ఈ రోజు(జులై 1న) ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
02-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
మీ మాటలు తేడాగా ఉన్నాయి బామ్మ..
బామ్మ గెటప్ వేసిన ప్రేరణ సిద్ధూ తనని గుర్తు పట్టలేదు అనుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అంటుంది. డ్రాప్ చేయ్ నానయనా నీకు బంగారం లాంటి పెళ్లాం వస్తుందని అంటుంది. బామ్మ నాకు ఇప్పటికే పెళ్లి అయింది అని సిద్ధూ అంటాడు. బాబు నన్ను కొంచెం డ్రాప్ చేయవా అని అంటే ఏంటి బామ్మ మీకు మీ వాయిస్‌కి సంబంధం లేదు అని సిద్ధూ అంటాడు. నా వయసు 60 అయినా వాయిస్ 16 లా ఉంటుంది బాబు అని అంటుంది. ఇక సిద్ధూ ప్రేరణని ఎక్కించుకొని డ్రాప్ చేయడానికి తీసుకెళ్తాడు. ప్రేరణ సిద్ధూని పట్టుకొంటే బామ్మగారు చేయి తీయండి అంటాడు. నువ్వు స్పీడ్‌గా వెళ్తున్నావ్ బాబు అని ప్రేరణ అంటే స్లోగా వెళ్తా చేయి తీయండి అని అంటాడు. ఇక ప్రేరణ కొంగుని గుడుగులా పెడుతుంది. ఇదెందుకు అని సిద్ధూ అడిగితే ఎండ కదా బాబు అని అంటుంది. నీ బంగారం గురించి చెప్పు బాబు అని ప్రేరణ అంటే.. తన గురించి ఏం చెప్పాలి.. నా బుర్ర తినడం కంటే ఇంకేం చేయదు.. ఏ పని సరిగా చేయదు.. ఓ గయ్యాలి గంపని నెత్తిన మోస్తున్నా అని సిద్ధూ అంటే నీకు ఎంత ధైర్యం ఉంటే నా గురించి ఇలా మాట్లాడుతావ్ అని ప్రేరణ అంటుంది.
ప్రేరణ బామ్మ గారు యాక్టింగ్ చాలు..
సిద్ధూ ఓ చోట బండి ఆపి ప్రేరణ బామ్మగారు ఇక యాక్టింగ్ ఆపండి అని అంటాడు. ఎవరు ప్రేరణ అని అంటే గెటప్ వేసుకుంటే సరిపోదు. అందుకు తగ్గట్టు నటించాలి అని అంటాడు. అయితే గణ కూడా గుర్తు పట్టేసుంటాడా అని అంటుంది. డౌటే అని సిద్ధూ అంటాడు. ఇక ప్రేరణ సిద్ధూతో వెళ్లిన పని ఏమైంది అని అడిగితే ఆ వరుణ్ అక్కడే ఉన్నాడు అని నా అనుమానం అని ప్రేరణ అంటే నువ్వు వెళ్లిందే అనుమానంతో మళ్లీ వెళ్లి అక్కడి నుంచి వచ్చి అనుమానం అని అంటే ఎలా తోడుగా నేను వస్తా అంటే వద్దు అన్నావ్.. ఇప్పుడు చూడు అని సిద్ధూ అంటాడు. ఆ గణ మామూలోడు కాదు సిద్ధూ జిత్తులమారి నక్క.. అని ప్రేరణ అంటుంది. వాడికి మన మీద డౌట్ వచ్చేసింది ఇంకేదో ప్లాన్‌తో రెడీగా ఉంటాడు అని సిద్ధూ అంటాడు.
సాహితి నిజం చెప్పేసేలా ఉందే..
గణ ఓ చోట ఆగి.. సిద్ధూ ప్రేరణ వరుణ్ వైపు నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు.. వాడి కానీ వాళ్లకి దొరికిపోతే ఇంక అంతే.. సాహితి కూడా ప్రతీ దానికి భయపడుతూ తనంతట తానే నిజం బయట పెట్టేసేలా ఉంది.. సాహితికి నాకు పెళ్లి అయిన విషయం ఇంట్లో వాళ్లకి మాత్రమే తెలుసు.. నిజం తెలిస్తే మమల్ని విడదీయాలి అని చూస్తారు.. అదే ఊర్లో అందరికీ మా పెళ్లి గురించి తెలిస్తే నన్నేం చేయలేరు.. అయితే ముందు రిసెప్షన్ చేయమని ఇంట్లో గొడవ చేయాలి అనుకుంటాడు.
నాకు రిసెప్షన్ కావాలి..
గణ ఇంట్లో లేడు ప్రశాంతంగా టీ తాగొచ్చు అని విజయానంద్ మంజుతో అంటే గణ వస్తాడు. ఛా ప్రశాంత అంతా పోయింది అని విజయానంద్ అంటాడు. ఇంట్లో అల్లుడు అంటే పట్టింపే లేదు మర్యాద ఇవ్వరా అని గణ అంటాడు. దానికి విజయానంద్ కాఫీ లేదు అనా అమ్మ ప్రేరణ ఈ గణకి ఒక కాఫీ పడేయమ్మా ఊరికే అరుస్తున్నాడు అని అంటాడు. మామయ్య మీరు చాలా వెటకారం చేస్తున్నారు ఇది బాలేదు అని గణ అంటాడు. నీ బాధ ఏంటో చెప్పు అని విజయానంద్ అంటే నాకు సాహితికి పెళ్లి మాత్రమే జరిగింది మాకు రిసెప్షన్ కావాలి.. మా పెళ్లి దాచి పెట్టడం నాకు ఇష్టం లేదు అందరికీ నా భార్య సాహితి అని తెలియాలి అని గణ అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. ఏంట్రా నిన్ను నా చెల్లి పెళ్లి చేసుకుంటేనే నిన్ను చంపేయాలి అన్నంత కోపం ఉంది ఇంకా రిసెప్షన్ కూడా చేయాలా అని సిద్ధూ అంటాడు. నీ మీద మాకు అనుమానం ఉంది.. అది క్లియర్ అయ్యేవరకు రిసెప్షన్ కాదు కదా చిన్న కొవొత్తి కూడా వెలగనివ్వమని ప్రేరణ అంటుంది. గణ ఎంత చెప్పినా విజయానంద్, సిద్ధూ, ప్రేరణ ఒప్పుకోరు. లంచం తీసుకొని నీ పరువు పోగొట్టుకున్నావ్,, ఇప్పుడు మా పరువు తీస్తావా.. ఓవర్ చేయకుండా ఊరికే ఉండు అని సిద్ధూ అంటాడు. అత్తయ్య గారు మీరైనా చెప్పండి అని గణ అంటే నా భర్తని కాదని నేను ఏ పని చేయను అని మంజుల అంటుంది. ఇప్పుడు రిసెప్షన్ చేయను అంటారు కదా.. కచ్చితంగా రిసెప్షన్ జరుగుతుంది. ఈ ఇంట్లోనే జరుగుతుంది. మీ అందరూ దగ్గరుండి జరిపిస్తారు.. అని ఛాలెంజ్ చేస్తాడు. వీడేదో పెద్ద ప్లాన్ వేశాడు.. మనం మన ప్లాన్ అమలు చేయాలి అని సిద్ధూ అంటాడు. ఏంటి అది అని ప్రేరణ అంటే తర్వాత చెప్తా ముందు వాడేం చేస్తాడో చూద్దాం అని అంటాడు.
ఈ తాళి తీసేయ్ అయితే..
సాహితి తన అన్న వదిన వరుణ్ గురించి తెలుసుకుంటారని టెన్షన్ పడుతుంది. ఇంతలో గణ సాహితిని తన వైపు నుంచి నరుక్కురావాలి అని .. సాహితి దగ్గరకు వెళ్లి ఇప్పటి వరకు జరిగింది చాలు. నేను నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నా.. నువ్వు నన్ను భర్తగా అనుకోకపోతే నేను కట్టిన ఈ తాళిని తీసేయ్ అని అంటాడు. సాహితి తాళి తీసుకొని వద్దు అండీ మీరు నన్ను నమ్మాలి అంటే నేనేం చేయాలి అని అడుగుతుంది. దానికి గణ రిసెప్షన్ చేయమని అడుగుతాడు. నేను చెప్పినా అన్నయ్య ప్రేరణ అడ్డుకుంటారని అంటుంది. వరుణ్ గురించి వాళ్లు ఎంక్వైరీ చేస్తున్నారు.. ఈ లోపు మన రిసెప్షన్ అయిపోతే ఎవరూ మనల్ని విడదీయరు అని అంటాడు.
రిసెప్షన్ జరగాలి అని గట్టిగా అడుగు అనిఅంటాడు. సాహితి సరే అంటుంది. సాహితి వెళ్లి రిసెప్షన్ చేయమని అందర్ని అడుగుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా సాహితి అని విజయానంద్ అంటాడు. సాహితి నువ్వు అయినా మా గురించి ఆలోచిస్తావ్ అనుకున్నా అని సిద్ధూ అంటాడు. మా పెళ్లి గురించి అందరూ అడుగుతారు అంటున్నారు.. మీ పెళ్లి గురించి ఎవరూ అడగలేదా అని గణ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Author : Jhanshi Balleda

