Nindu Manasulu Serial Today Episodeగణ అన్న మాటలు తలచుకొని ఇందిర బాధ పడుతూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో ఇందిర దగ్గరకు రంజిత్ వచ్చి ఏమైందని అడుగుతాడు. మీరు ఈశ్వరి ప్రాణాలు కాపాడిన వాళ్లు మీ గురించి తప్పుగా అనుకుంటున్నారు అని ఆలోచిస్తున్నారు కదా.. అలాంటి వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆంటీ..
వదిలేయండి మీరు మీ గురించి మీ అస్తిత్వం గురించి మాత్రమే ఆలోచించండి అని రంజిత్ అంటాడు.
ఇందిర కన్నీరు పెట్టుకొని మాటలు పడి మాటలు పడి అలసిపోయాను బాబు అని అంటుంది. మీకు ఇద్దరు ముత్యాల్లాంటి కూతుళ్లు ఉన్నారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ కంటే మీ కూతురు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటుంది. భర్త, అత్తమామలు అందరూ దూరం పెడుతున్నా పోరాడుతుంది. మీరు పోరాడండి ఎలాంటి అవసరం కావాలి అన్నా నేను తోడుగా ఉంటాను.. అని ధైర్యం చెప్తాడు. ఉదయం సిద్ధూ ఇంట్లో వ్రతానికి ఏర్పాట్లు జరుగుతాయి.
ఆఫీస్లో పీరియడ్స్ సడెన్గా వస్తే? ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ప్రేరణని ఇరికించడం అంత ఈజీ కాదు మనం ఒకటి అనుకుంటే తను ఇంకొలా ఆలోచిస్తుంది.. తనని ఇరికించాలి అంటే అడ్వాన్స్గా ఆలోచించాలి అని విజయానంద్ అనుకుంటాడు. ఇంతలో ఇందిర, ఐశ్వర్య రావడం చూసి కరెక్ట్ టైంకి వస్తారు.. వీళ్లు వీళ్ల అవతారాలు అని అనుకుంటాడు. సంచులు బాగా బరువుగా ఉన్నాయి ఏం తెచ్చారు అని విజయానంద్ అడిగితే వ్రతం కోసం అమ్మాయి అబ్బాయికి బట్టలు తీసుకొచ్చాం అని అంటుంది. విజయానంద్, ఐశ్వర్య ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటే సాహితి తండ్రిని ఆపి నాన్న ఇంటికి వచ్చిన వాళ్లకి మర్యాదలు చేయాలి కదా అంటుంది. సరే అలాగే నువ్వు చెప్పినట్లే సకల మర్యాదలు చేస్తా అని ఇందిరాదేవి గారు రండి వచ్చి కూర్చొండి అని అంటుంది. ఇందిరాదేవి గారి రెండో కూతురు ఐశ్వర్య గారు రండి వచ్చి కూర్చొండి అని అంటాడు.
పిల్లలకు స్విమ్మింగ్ నేర్పిస్తే కలిగే లాభాలివే.. జీవితాంతం ఉపయోగపడే స్కిల్ ఇది, ఎందుకంటే
అమ్మాయి, అల్లుడు గారిని కలవాలి అని ఇందిర అంటే నేనే తీసుకెళ్తా రండి సకల మర్యాదలు చేయాలి కదా అని తీసుకెళ్తాడు. ప్రేరణ స్నానం చేసి వచ్చి చీర చిరిగిపోవడం చూసి ఎవరు చించారు అంటుంది. ఎలుకలు చింపేశాయేమో అని సిద్ధూ అంటాడు. దానికి మీరే చింపేసుంటారు అని ప్రేరణ అంటూ సిద్ధూ బట్టలు కూడా చూస్తుంది. సిద్ధూ బట్టలు కూడా చినిగిపోయి ఉండటం చూసి షాక్ అయిపోతుంది. అవి కూడా ఎలుకలే చింపేసుంటాయి అని సిద్ధూ అంటే ఇన్ని రోజులు లేని ఎలుకలు ఇప్పుడే ఈ బట్టలే చింపేయాలా అని నోరెళ్లబెడుతుంది. ఇంతలో విజయానంద్ ప్రేరణ తల్లి, చెల్లిని తీసుకొస్తూ అది చూసి మంజు అని అరుస్తాడు. మనం వ్రతానికి పెట్టిన బట్టలు చింపేసింది మంజు అని అంటాడు. ఏంటి ఇది ఇలా చించేశావేంటి అని మంజుల అడుగుతుంది. నాకు తెలీదు మేడం. ఆయన్ను అడిగితే ఎలుకలు చింపేసుంటాయని అంటున్నారు అని అంటుంది. ప్రేరణే ఏదో ఒకటి చేసుంటుందని విజయానంద్ అంటాడు. వ్రతానికి వీళ్లు పెట్టిన బట్టలు కట్టుకునేది ఏంటి.. మా పుట్టింటి వాళ్లు తెచ్చిన బట్టలు వేసుకోవాలనే కదా అని విజయానంద్ అంటాడు. దానికి ఇందిర ఇది వ్రతంలో ఇవ్వడానికి తీసుకొచ్చాం అంతే కాని వీటిని కట్టుకోవడానికి కాదు అంటుంది.
చిన్ని సీరియల్: దేవాకి గన్ గురి పెట్టి బెదిరించిన చిన్ని! కథ క్లైమాక్స్కి వచ్చేసిందా!
మంజు కోపంగా ఇప్పుడు వ్రతంలో ఏం బట్టలు కట్టుకుంటారు అని అడుగుతుంది. దానికి సిద్ధూ మా అమ్మ తీసుకొచ్చిన బట్టలు కట్టుకొని వ్రతంలో కూర్చొవాలి అనుకున్నా కానీ ఇప్పుడు ఆ అదృష్టం లేకుండా పోయింది అంటాడు. ఏవండీ మీ అదృష్టం నేను ఎలా పొగొడతాను.. సరే మీరు నాకు మాటిస్తారా.. మీ అమ్మగారు పెట్టిన బట్టలు ఉంటే వ్రతంలో కూర్చొంటాను అని అంటుంది. దానికి సిద్ధూ సరే కచ్చితంగా చెప్తున్నా మా అమ్మ పెట్టిన బట్టలు ఉంటే నేను వ్రతంలో కచ్చితంగా కూర్చొంటా అని మాటిస్తాడు. దాంతో ప్రేరణ సరే ఒక్క నిమిషం అని మంజుల పెట్టిన బట్టలు తీసుకొస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. విజయానంద్ చూసి బై వన్ గెట్ వన్ కూడా ఇవ్వలేదే అని అనుకుంటాడు. ఇంట్లో నిజంగానే ఎలుకలు తిరుగుతున్నాయని అనిపించి మీరు ఎంతో ప్రేమగా ఇచ్చిన బట్టలు రాత్రే తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టా.. సేమ్ అలాంటివే మరో జత తెప్పించి రాత్రికి రాత్రి ఇక్కడ పెట్టించా అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు.
ఫ్లాష్బ్యాక్లో ప్రేరణ ఐశ్వర్యకి ఆ పిక్స్ పెట్టి సేమ్ అలాంటివే తీసుకురమ్మని చెప్తుంది. పాపం ఎలుకలు ఇవే ఒరిజినల్ అని కొట్టేశాయ్ అని సిద్ధూని చూస్తుంది. ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావడం లేదు అని మంజు వెళ్లిపోతుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత సిద్ధూ ప్రేరణతో నన్నే చీట్ చేస్తావా అంటే నువ్వు చేసింది ఏంటి.. అని అంటుంది. నువ్వు చేసిన పనికి మా అమ్మ హర్ట్ అయింది అని సిద్ధూ నేను చేసిన పనికి కాదు మీరు చేసిన పనికి.. బట్టలు చింపింది నువ్వే అని నాకు తెలుసు అని ప్రేరణ అంటుంది. ఒకసారి వెళ్లి మీ అమ్మతో మాట్లాడు.. వెళ్లి బట్టలు నువ్వే చింపేశా అని చెప్పు.. ఆవిడ చాలా బాధ పడుతుందని అంటుంది.
సింధూజాక్షి పురుగుల మందు ఎందుకు తాగింది.? ఈ విషయం గోపీ ఎవరికి చెప్పాడు..?
సిద్ధూ మంజు దగ్గరకు వెళ్లి బట్టల విషయంలో సారీ అమ్మ.. తల్లి ఎదురుగా ఉన్నా కొడుకుతో మాట్లాడకపోవడం పెద్ద శిక్ష అమ్మా.. అసలు నాకు ఈ వ్రతాలు పూజలు ఇష్టం లేదమ్మా అని సిద్ధూ అంటాడు. ఇలా వ్రతం ఆపడం కరెక్ట్ కాదు.. దైవ కార్యం కచ్చితంగా చేయాలి అంటుంది. బట్టలు చింపినందుకు సారీ అమ్మా అని సిద్ధూ అంటే నా మనసే చంపేసినట్లు బట్టలు చింపడం ఒక లెక్కా అని అంటుంది. నీ తండ్రి స్థానంలో ఉంటూ నిన్ను చూసుకున్న వ్యక్తిని నువ్వు ఎలా అనుమానిస్తావ్.. నలుగురితో ఆ విషయం ఎలా చెప్తావ్.. ఆయన ఎంత బాధ పడుంటారో ఆలోచించావా అని అడుగుతుంది. నువ్వు ఏదో ఒకరోజు నన్ను క్షమిస్తావు అని ఆశతో ఉన్నానమ్మా సిద్ధూ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Author : Jhanshi Balleda

