Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nindu Noorella Saavasam Serial Today September 3rd: 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్‌: పార్థును దారి మళ్లించిన రౌడీలు - మనును అనుమానించిన పార్థు

Nindu Noorella Saavasam Serial Today September 3rd: 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్‌: పార్థును దారి మళ్లించిన రౌడీలు - మనును అనుమానించిన పార్థు

ABP దేశం 3 days ago

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరితో కారులో వెళ్తున్న పార్థును డైవర్ట్‌ చేస్తారు రౌడీలు. రౌడీలు తమను డైవర్ట్‌ చేస్తున్నారని మనోహరికి తెలిసిపోతుంది.

ఇక లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన అమర్‌ను కూడా భాగీ నందగిరిహిల్స్‌కు వెళ్దామని దారి మళ్లిస్తుంది. దీంతో నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా జరిగింది.

డైవర్షన్‌ బోర్డు చూసి అనుమానించిన పార్థు

పార్థు, మనోహరితో కొంత దూరం వెళ్లాక మనోహరి ఏర్పాటు చేసిన రౌడీలు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి డైవర్షన్‌ బోర్డు పెట్టి ఉంటారు. అవి చూసిన పార్థు అనుమానంగా రోడ్డుకు అడ్డంగా ఎవరు పెట్టి ఉంటారు ఈ రాళ్లు అంటే ముందు ఏదైనా వర్క్‌ జరుగుతుందేమోనని మనోహరి చెప్తుంది. వెంటనే పార్థు గూగుల్‌ మ్యాప్‌లో చూసి మ్యాప్‌లో చూపించడం లేదు అంటాడు. మ్యాప్‌ అప్‌డేట్‌ కాలేదేమో అంటుంది మనోహరి. మనసులో మాత్రం మా వాళ్లు బాగానే ఏర్పాటు చేశారు అనుకుంటుంది.

మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

లెఫ్ట్‌ సైడు వెళ్లడానికి సంకోచించిన పార్థు

పార్థు ఇప్పుడు ఎలా వెళ్దాం అని అడిగితే.. లెఫ్ట్‌ డైవర్షన్‌ తీసుకోమని బోర్డు పెట్టారు లెఫ్ట్‌ వైపు వెళ్దాం అని మనోహరి చెబితే.. మనం వెళ్లేది నందగిరి హిల్స్‌ కదా లెఫ్ట్‌ వెలితే ఎలా అని పార్థు అడిగితే ఇలా వెళ్లినా ముందుకు వెళ్లాక మళ్లీ ఈ రోడ్డుకు కలుస్తుందేమో అంటుంది మనోహరి. పార్థు మాత్రం అనుమానంగా వద్దు మను రాళ్లు తీసుకుని మనం ఇలాగే వెళ్దాం అని చెప్తాడు. రోడ్డు బాగుంటే బోర్డు ఎందుకు పెడతారు పార్థు అంటూ మనోహరి అడిగితే.. ఒక్కోసారి దారిదోపిడీ దొంగలు ఇలాగే చేస్తారు. వెహికిల్స్‌ను ట్రాప్‌ చేసి ప్రయాణికులను దోచుకుంటారు అని చెప్తుంటే.. మనోహరి భయంగా మనసులో పోలీసోడు పసిగట్టేశాడు అనుకుంటూ అలాంటిదేం ఉండదు పార్థు ఇది టూరిస్ట్‌ ప్లేస్‌ చాలా మంది వస్తారు. పైగా మీ పోలీసొళ్ల నిఘా కూడా ఉంటుంది కదా..? లెఫ్ట్‌ సైడె వెళ్దాం పద అని చెప్పినా పార్థు ఆలోచిస్తుంటాడు.

బలవంతంగా లెఫ్ట్‌ సైడ్‌ తీసుకెళ్లిన మనోహరి

మనోహరి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు పార్థు వెళ్దాం పద అంటే నేను నా గురించి ఆలోచించడం లేదు మను.. నీ గురించి ఆలోచిస్తున్నాను అంటూ రొమాంటిక్ గా పార్థును చూస్తూ… చేయి పట్టుకుని పార్థు నువ్వు ఉండగా నాకేం అవుతుంది చెప్పు అంటుంది మనోహరి. అయితే వెళ్దాం పద అంటూ అంటూ పార్థు కారు స్టార్ట్‌ చేసుకుని లెఫ్ట్ వైపు వెళ్తారు. వాళ్లు వెళ్లిపోయాక రౌడీలు బోర్డు, రాళ్లు తీసేసి పార్థు కారును ఫాలో అవుతారు.

నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

నందగిరిహిల్స్‌ వైపు వెళ్తున్న అమర్‌, భాగీ

మరోవైపు లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లిన అమర్‌తో భాగీ మనం నందగిరిహిల్స్‌కు వెళ్దామని చెప్తుంది. సరేనంటూ అమర్‌ కారును నందగిరిహిల్స్‌ వైపు మళ్లిస్తాడు. అమర్‌, భాగీ కూడా నందగిరిహిల్స్‌ వైపు ఫారెస్టులో వెళ్తుంటారు. భాగీ మనసులో మనోహరి వాళ్లు ఇంకా కనిపించడం లేదేంటి అనుకుంటుంటే.. ఏం ఆలోచిస్తున్నావు భాగీ అంటూ అమర్‌ అడిగితే.. మనం కరెక్ట్‌ రూట్‌లోనే వెళ్తున్నామా..? ఎవరినైనా అడిగితే బాగుండు అంటుంది. అప్పుడే రోడ్డు పక్కన ఒక వ్యక్తి కట్టెలు కొడుతుంటే.. భాగీ కారు ఆపి వెళ్లి మనోహరి వాళ్ల కారు గురించి ఎంక్వైరీ చేస్తుంది. ఆ వ్యక్తి వివరాలు చెప్పగానే.. భాగీ కంగారుగా వెళ్దాం పదండి అంటూ కారులోకి వెళ్తుంది. భాగీ కంగారు చూసి అమర్‌ అనుమానిస్తాడు. ఏమైంది భాగీ ఎందుకు అలా ఉన్నావు.. రాథోడ్‌ ఫోన్‌ చేసినప్పటి నుంచి కంగారుపడుతున్నావు అంటూ అనుమానంగా అడిగితే.. భాగీ ఈయనకు అనుమానం వచ్చినట్టు ఉంది ఏదో ఒకటి చెప్పి కవర్‌ చేయాలి అనుకుంటూ ఏవేవో చెప్తుంది. అమర్‌ సరే సరే ఇక ఆపు నీ సోది అంటూ కారు మూవ్‌ చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

Author : Sudhakar Mansetty

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam