Dailyhunt
Nissan Gravite CNG Launched: నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీలో సీఎన్‌జీ ఆప్షన్ లాంచ్.. డ్యూయల్ సిలిండర్ సెటప్‌తో వచ్చిన దేశీయ మొదటి ఎంపీవీ!

Nissan Gravite CNG Launched: నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీలో సీఎన్‌జీ ఆప్షన్ లాంచ్.. డ్యూయల్ సిలిండర్ సెటప్‌తో వచ్చిన దేశీయ మొదటి ఎంపీవీ!

ABP దేశం 1 week ago

Nissan Gravite CNG Launched in India with Dual Cylinder: నిస్సాన్ మోటార్ ఇండియా తన పాపులర్ మోడల్ గ్రావైట్ (Gravite) ఎంపీవీలో సరికొత్త సీఎన్జీ వెర్షన్ను లాంచ్ చేసింది.

పర్యావరణ హితంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారి కోసం కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన సీఎన్జీ రెట్రోఫిట్మెంట్ కిట్ను నిస్సాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధరను రూ. 83,000 (ఇంట్రడక్టరీ ప్రైస్) గా నిర్ణయించారు. మీరు ఎంచుకున్న వేరియంట్ ధర కాకుండా ఈ కిట్ కోసం అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

డ్యూయల్ సిలిండర్ స్పెషాలిటీ..
ఈ అప్డేట్లో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏదైనా ఉందంటే అది 'ట్విన్ సిలిండర్' (Twin-cylinder) సెటప్. ఈ సెగ్మెంట్లో ఇటువంటి కాన్ఫిగరేషన్తో వచ్చిన మొదటి ఎంపీవీ ఇదే కావడం విశేషం. ఇందులో ఒక్కోటి 25 లీటర్ల కెపాసిటీ ఉన్న రెండు సిలిండర్లను వాడారు. కారులో స్పేస్ను అడ్జస్ట్ చేస్తూనే ఏడుగురు ప్రయాణికులు సుఖంగా కూర్చునేలా దీన్ని డిజైన్ చేశారు. మే 4, 2026 నుండి అన్ని అధీకృత నిస్సాన్ డీలర్షిప్ల వద్ద ఈ కిట్ ఫిట్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

డిజైన్, స్టోరేజ్..
బయటి నుంచి చూస్తే ఇది పక్కా ఫ్యాక్టరీ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది. సీఎన్జీ నింపే నాజిల్ను పెట్రోల్ లిడ్ కిందే చాలా నీట్గా అమర్చారు. ప్రస్తుతానికి ఈ సిలిండర్లను డిక్కీలో ఒకదానిపై ఒకటి ఉండేలా సెట్ చేశారు. దీనివల్ల ఏడుగురు కూర్చునే వీలున్నా, లగేజీ పెట్టుకోవడానికి మాత్రం కాస్త తక్కువ స్థలం మిగులుతుంది. వినియోగదారుల సౌకర్యం కోసం భవిష్యత్తులో బాడీ కింద భాగంలో (Underbody) సీఎన్జీ ట్యాంక్ అమర్చే ప్లాన్ కూడా నిస్సాన్ దగ్గర ఉంది. దీనివల్ల లగేజ్ స్పేస్ సమస్య కూడా తీరిపోతుంది.

ఇంజిన్, పర్ఫార్మెన్స్..
మెకానికల్ పరంగా చూస్తే గ్రావైట్ సీఎన్జీలో మార్పులేమీ లేవు. ఇందులో మునుపటి లాగే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. పెట్రోల్ వెర్షన్లో ఏఎమ్టీ (AMT) ఆప్షన్ ఉన్నప్పటికీ, సీఎన్జీ కిట్తో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తక్కువ రన్నింగ్ కాస్ట్ తో ఎక్కువ మైలేజ్ కోరుకునే ఫ్యామిలీలకు ఈ కొత్త గ్రావైట్ సీఎన్జీ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. నిస్సాన్ తన సర్వీస్ నెట్వర్క్ ద్వారా ఈ కిట్ను ఇన్స్టాల్ చేస్తోంది కాబట్టి సేఫ్టీ విషయంలో కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు. ఒకవేళ మీరు ఎంపీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ కొత్త సీఎన్జీ ఆప్షన్ను ఒకసారి చెక్ చేసుకోవచ్చు.

Author : Ayesha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam