Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.
విక్కీ బాగా మందు తాగిపడిపోతే రూమ్లోకి తీసుకొచ్చి బెడ్పై పడుకోబెట్టే క్రమంలో అతనికి ముద్దుపెడుతుంది. తెల్లారి లేచిన తర్వాత విక్కీ గొడవ చేస్తాడు.అటు లవంగం దమయంతికి సుందరి చిట్టి కాదని చెప్పడంతో అతని చెంపపగులగొట్టి సుందరికి దగ్గరకు వెళ్లి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అటు రాధవిక్కీ మనసులో చోటుకోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటుంది.
విక్కీకి తొలిముద్దు
బాగా తాగి మెట్లపైపడిపోయి ఉంటే విక్కీని తీసుకుని రాధ గదిలోకి వస్తుంది. అతన్ని బెడ్పై పడుకోబెట్టే క్రమంలో విక్కీ తనను మీదకు లాక్కోవడంతో పొరపాటుగా రాధ విక్కికి తొలిసారి బుగ్గమీద ముద్దుపెడుతుంది. అది చూసిని రాధ చాలా మురిసిపోతుంది. తెల్లారిన తర్వాత అద్దంలో చూసుకున్న విక్కీకి ఏం జరిగిందోఅర్థం కాదు. వెంటనే రాధను పిలిచి ఇది ఎలా జరిగిందని అడుగుతాడు.నాకు ఏం తెలుసు మీరు ఏం చేసుకున్నారోనని అంటుంది. మీ చిట్టి వచ్చి ముద్దుపెట్టిందేమోనని అంటాడు. ఆ మాటలు చెప్పగానే విక్కీ ముఖం వెలిగిపోతుంది. నా చిట్టి వచ్చి నాకు ముద్దుపెట్టిందా అని అంటాడు. అయినా అసలు మేం అంతదూరం వెళ్లలేదు కదా...అసలు నా ప్రేమ గురించే చెప్పనప్పుడు ఎలా ముద్దు పెట్టగలనని అంటాడు. నీకు అంతసీను లేదులే అని రాధ అంటుంది. ఆ ముద్దు నేనే పెట్టానని చెబుతుంది. ఎందుకు ముద్దు పెట్టావని అడగ్గా...రాత్రి జరిగింది గుర్తుతెచ్చుకో అంటుంది. అసలు నేను నిన్ను అరవాల్సిందిపోయి నువ్వు నామీద కేకలు వేస్తున్నావేంటని గట్టిగా క్లాస్ పీకుతుంది.
దమయంతికి నిజం చెప్పిన లవంగం
సుందరి అసలు చిట్టి కాదని అనుమానపడిన లవంగం అందరి దగ్గర చెంపదెబ్బలు తిని చివరికి దమయంతి దగ్గరకు వెళ్లి చెబుతాడు. అసలు నీకు ఎందుకు అనుమానం వచ్చిందని అడగ్గా..ఆ అమ్మాయి వాళ్ల తల్లితో మాట్లాడటం నేను విన్నానని చెబుతాడు. అంతే వాడి చెంపపగులగొట్టిన దమయంతి...ఈ విషయం ముందు నాకు చెప్పకుండా ఇంట్లో వాళ్లకు ఎందుకు చెప్పావని తిడుతుంది.ఇదంతా ఇక్కడే మర్చిపోకుంటే నీ సంగతి చూస్తానని బెదిరిస్తుంది. దీంతో లవంగం వెళ్లిపోతాడు. మేడంగారు నిజం తెలుసుకున్నా నన్నే తిడుతున్నారేంటని లవంగం అనుకుంటాడు. బాగా తిని గుర్రుపెట్టి నిద్రపోతున్న సుందరిని నిద్రలేపి దమయంతి తిడుతుంది.నువ్వు చిట్టికాదన్న విషయం అందరికీ తెలిసిపోయేలా ఉందని....ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇంట్లో ఉన్నప్పుడు చిట్టిలాగే ఉండమని అంటుంది.ముందునుంచీ ఆ రాధకు అనుమానంగానే ఉందని...కాబట్టి వీలైంత త్వరగా ఆ రాధను ఇంట్లో నుంచి వెళ్లగొట్టే పనులు చేయమని గుర్రుపెట్టి నిద్రపోతున్నావేంటని అంటుంది. అయినా మీరు ఉండగా నన్ను ఎవరు బయటకు వెళ్లగొడతారని అంటుంది. నీ రంగుబయటపడినప్పుడు మొదటి నేనే ఆ పనిచేస్తానని దమయంతి అంటుంది. మీరే తీసుకొచ్చారని నేను చెబితే అని సుందరి అనగా...ఎవరూ నమ్మరని...ఎందుకంటే నువ్వు వచ్చిన రోజు నిన్ను ముందుగా అనుమానించింది నేనే కాబట్టి ఎవరూ నువ్వు చెప్పింది నమ్మరని...నేనే నిన్ను పోలీసులకు పట్టిస్తాని చెప్పి హెచ్చరిస్తుంది. అమ్మో ఈవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలని సుందరి అనుకుంటుంది.
విక్కీపై రాధ ప్రేమ
మెట్లపై కూర్చుని ఆలోచిస్తున్న విక్కీ దగ్గరకు కాఫీ తీసుకుని వచ్చిన రాధ...నేను కాఫీ తాగాలని అనుకుంటున్నట్లు నీకు ఎలా తెలుసు అని అడగుతాడు. మనసులో ప్రేమ ఉంటే అలా తెలిసిపోతాయని రాధ అంటుంది. అసలు నీకు నిజంగా నీ చిట్టిపై ప్రేమ ఉందా అని అడుగుతుంది.కానీ ఎందుకో చిట్టిపై నీకు ప్రేమ ఉన్నట్లు ఏమాత్రం తెలియడం లేదని చెబుతుంది.
Author : Ajay Kumar

