Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.
రామచంద్రం బర్త్డేకు చిట్టీ రాబోతుందని తెలిసి ఇంట్లో ఒకటే సందడి వాతావరణం నెలకొంటుంది. మామయ్య ఆశలు పెంచుకుంటున్నాడని నిజం చెప్పేందుకు విక్కీ ప్రయత్నించగా....రాధ అతన్ని ఒట్టేసి ఆపుతుంది. మరోవైపు చిట్టి ఇంటికి రాగానే ఇదే బర్త్డే పార్టీలో ఎలా చంపాలో దమయంత, భవానీ శంకర్ కుట్రలు పన్నడంతో ఈరోజు ఎపిసోడ్ రసవత్తరంగా మారుతుంది.
విక్కీ ఇంట్లో సందడి
రామచంద్రం బర్త్డే కావడం...చాలారోజుల తర్వాత ఆయన పుట్టినరోజు జరుపుకోనుండటంతో ఇంట్లో అందరూ ఆయనకు కానుకలు తీసుకుని గుమ్మం ముందే నిలబడతారు. ఇంతలో రాధ కొత్తబట్టలు తీసుుకని వచ్చి డోర్ తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది. అందరూ ఆయన నిద్రపోతున్నారని అనుకుంటే...రామచంద్రం మాత్రం మేల్కొనే ఉంటారు. ఎందుకు అన్నయ్యా అప్పుడే లేచారని సునంద అడిగితే...చిట్టి వస్తుందన్న ఆనందంలో అసలు రాత్రి నిద్రేపట్టలేదని చెబుతాడు. దీంతో అందరూ ఎమోషనల్ అయ్యి....ఆయనకు గిఫ్ట్లు ఇస్తారు. వెంటనే రెడీ అయ్యి కిందకు రమ్మని చెబుతారు.
నిజం చెప్పేస్తానన్న విక్కీ..అడ్డుకున్న రాధ
చిట్టిమీద ఆశలు పెట్టుకున్న మామయ్య...ఆమె రాదని తెలిస్తే ఎంత బాధపడతారోనని విక్కీ భయపడుతుంటాడు. ఆమె రాదన్న నిజం తెలిసి ఆయనకు ఏమైనా అవుతుందేమోనని ఆందోళన చెందుతాడు.నిజం ఆయనకు చెప్పడం వల్ల ఇప్పుడు మాత్రమే ఫీలవుతారని...అదే రాత్రికి పార్టీలో అందరి ముందు చిట్టీ రాదని తెలిస్తే తట్టుకోలేడేమోనని అనుకుంటాడు. ఇదే విషయం రాధకు చెబుతాడు. నువ్వు ఆడిన ఓ చిన్న అబద్ధం ఇంతమందిని బాధపెట్టేలా ఉందని ....ఇది ఎటువైపు దారితీస్తుందో అర్థం కావడం లేదని అంటాడు. కాబట్టి ఇంకా అందరూ చిట్టిమీద ఆశలు పెంచుకోక ముందే దీనికి ముగింపు ఇస్తానని...ఇప్పుడే వెళ్లి మామ్యయకు చెబుతానని అంటాడు. అదంతా నేను చూసుకుంటానని నువ్వు ఏమీ రాధ సముదాయిస్తుంది. అయినా విక్కీ వాళ్ల మామయ్యకు నిజం చెప్పేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా...ఈ నిజం ఎవరికైనా చెబితే మీ మామయ్యపై ఒట్టేనంటూ ఒట్టుపెడుతుంది. దీంతో విక్కీ ఆగిపోతాడు.
దమయంతి కుట్రలు
కొత్త బట్టలు వేసుకుని రామచంద్రం కిందకు వస్తాడు. ఇంట్లో చాలారోజుల తర్వాత ఇంత సందడి నెలకొనడం చూసి ఆనందపడిపోతాడు. బర్త్డే ఏర్పాట్లు ఎవరికివారు ముందుండి చేయడం చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు. రాత్రికి చిట్టి వస్తుందని తెలిసి అందరూ ఆనందంతో ఎదురుచూస్తుంటారు. కానీ మరోవైపు దమయంతి, భవానీ శంకర్ అసూయతో రగిలిపోతుంటారు. దమయంతి తన కోపాన్ని అనుచుుకునేందుకు ధ్యానం చేస్తుంటుంది. ఇప్పుడు ఇదంతా ఏంటమ్మా అని వాళ్ల అన్నయ్య భవానీ శంకర్ అడగ్గా...చిట్టినీ చూడగానే నాకు కోపంతో చంపేయాలని అనిపిస్తుందని...దమయంతి అంటుంది.ఈ ఇంట్లో నా కూతురు కాకుండా ఇంకో కూతురు ఉంటే నేను తట్టుకోలేనని అంటుంది. కానీ ఆ చిట్టిని కోపంతో కాకుండా ఆలోచనతో చంపాలనే నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నానని అంటుంది. ఇదే బర్త్డే పార్టీలో మనవాళ్లు చేరిపోయి....మూడోకంటికి తెలియకుండా ఆ చిట్టిని పైకి పంపించే ఏర్పాట్లు నేను చేశానని భవానీ శంకర్ అంటాడు. రాత్రికి బర్త్డే పార్టీకి అన్ని ఏర్పాట్లు చేయడంో రాధ కొత్త బట్టలు కట్టుకుని వస్తుంది. ఆమెను చూసి విక్కీ చాలా ఆనందపడతాడు. ఆమెకాలి పట్టిపడిపోతే...తనే స్వయంగా రాధ కాలుపట్టుకుని పట్టి పెట్టడం చూసి వాళ్ల అమ్మానాన్న ఎంతో మురిసిపోతారు.
Author : Ajay Kumar

