Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nuvvu leka Neanu Lenu Serial Today July 31th:రాధ గుడికి వెళ్దామంటే కుదరదన్న విక్కీ...చిట్టిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లడంతో రాధ ఏంచేసింది..?

Nuvvu leka Neanu Lenu Serial Today July 31th:రాధ గుడికి వెళ్దామంటే కుదరదన్న విక్కీ...చిట్టిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లడంతో రాధ ఏంచేసింది..?

ABP దేశం 1 week ago

Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.

స్టేషన్కు వెళ్తున్న విక్కీని గుడికి వెళ్దామని రాధ కోరగా...అర్జెంట్ పని ఉందని రానని చెబుతాడు. అటు దమయంతి విక్కీని బుట్టలో వేసుకోమని సుందరికి చెప్పడంతో ఆమె బావా అంటూ వచ్చి విక్కీని అడగ్గానే బయటకు తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. దీంతో కోపంలో రాధ ఏం చేసిందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం.
గుడికి వెళ్దామన్న రాద...కుదరదన్న విక్కీ
గుడికి తీసుకెళ్లమని రాధ భర్త విక్కీని అడగ్గా....నాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయని కుదరదని అంటాడు.ఓ హత్య కేసు ఇప్పటికిప్పుడే చేధించాలని అంటాడు. ఆ పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు కదా అని అన్నాగాని...నాకు కుదరదంటే కుదరదని తెగేసి చెప్పేసి వెళ్లిపోతాడు. అప్పుడే దమయంతి సుందరి దగ్గరకు వచ్చి విక్కీని వలలో వేసుకోమని చెప్పాను కదా ఎంతవరకు వచ్చిందని అడుగుతుంది. నువ్వు ముందు ఆ విక్కీని బుట్టలో వేసుకుంటే రాధను దూరం చేయవచ్చని చెబుతుంది. అసలు రాధను ఇక్కడి నుంచి పంపించడమే కదా మనకు కావాల్సింది మళ్లీ ఆమెను దూరం చేయడం ఎందుకని ప్రశ్నిస్తుంది. నేను చెప్పిన పని చెప్పినట్లు చేయడమే నీపని అని దమయంతి హెచ్చరిస్తుంది.
విక్కీ దగ్గర చిట్టి వయ్యారాలు
విక్కీ స్టేషన్కు బయలుదేరి వెళ్తండగా చిట్టి ఊపుకుంటూ వస్తుంది. అబ్బా పోలీసు డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావు బావా అని అనగానే విక్కీ చాలా మురిసిపోతాడు. నన్ను బయటకు తీసుకెళ్లవా బావా అని అడుగుతుంది.అప్పుడే అక్కడికి వచ్చిన రాధ మీ బావకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయని కాబట్టి కుదరదంటాడని అంటుంది. ఎలాగైనా రాధను ఉడికించాలని అనుకున్న విక్కీ...అబ్బే ఇప్పుడు అంత అర్జెంట్ పనులు ఏమీ లేవని అంటాడు. అయినా నువ్వు అడిగితే కాదని ఎలా అనగలని అంటాడు. నువ్వు ఏదంటే అది చేస్తానని అంటాడు. పనులన్నీ ఎప్పుడూ ఉండేవే కదా తర్వాత అయినా చూసుకుంటాను అంటాడు. విక్కీ కావాలనే ఇదంతా చేస్తున్నాడని అనుకున్న రాధ చాలా కోపంతో రగిలిపోతుంది. నువ్వు ఇక్కడే ఉండే ఐదు నిమిషాల్లో డ్రెస్ మార్చుకుని వస్తానంటూ వెళ్లిపోతాడు. ఇప్పడు ఎలాగైనా వీళ్లిద్దరూ బైక్పై వెళ్లకుండా ఆపాలని వెళ్లి టైర్లలో గాలి తీస్తుంది రాధ. విక్కీ వచ్చి చిట్టిని ఎక్కించుకుని బయటకు వెళ్దామని బైక్ ఎక్కేసరికి గాలి ఉండదు.ఇదంతా రాధ పనేనని తెలుసుకుని కారులో వెళ్దామంటూ చిట్టిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోతాడు.
అబ్బాయిలా మారువేషం వేసిన రాధ
విక్కీ చిట్టిని బయటకు తీసుకెళ్లడంతో ఉడుక్కున్న రాధ...అక్కడికి వచ్చిన రామలింగంపై అరుస్తుంది.నువ్వే మా పెళ్లిచేశావు కాబట్టి నువ్వే ఆ చిట్టిని మాఆయనకు దూరం చేయాలని అడుగుతుంది. నా దగ్గర ఓ ఐడియా ఉందని చెబుతుంది. దీంతో రామలింగం సరేనంటాడు. చిట్టిని తీసుకుని విక్కీ ఓ రెస్టారెంట్కు వెళ్తాడు.మొదటిసారి అంత పెద్ద హోటల్లుకు వచ్చిన చిట్టీ నోరు వెళ్లబెట్టి చూస్తుంది. తనకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసి తింటుంది. అప్పుడే అక్కడికి రాధ, రామలింగం మారువేషాలు వేసుకుని వస్తారు. రాధ అబ్బాయి గెటప్ వేసుకుని వస్తుంది.వెయిటర్కు డబ్బులు ఇచ్చి మరీ విక్కీ, చిట్టి కూర్చుకున్న టేబుల్ పక్కనే కూర్చుంటారు.విక్కీ చిట్టీతో మాట్లాడటానికి ప్రయత్నించిన ప్రతిసారీ రాధ కల్పించుకుని చెడగొడుతుంటుంది. అతను తన మనసులో మాట చిట్టికి చెప్పకుండా పదేపదే అడ్డుకోవడం చాలా సరదాగా అనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్

Author : Ajay Kumar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam