Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nuvvu leka Neanu Lenu Serial Today July 6th:రామచంద్రానికి రక్తం ఇవ్వడానికి వచ్చిన రాధ... రాధను గదిలో పెట్టి తాళం వేయించిన దమయంతి...

Nuvvu leka Neanu Lenu Serial Today July 6th:రామచంద్రానికి రక్తం ఇవ్వడానికి వచ్చిన రాధ... రాధను గదిలో పెట్టి తాళం వేయించిన దమయంతి...

ABP దేశం 1 week ago

Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.

రామచంద్రానకి అర్జెంట్గా రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెప్పగా...ఇవ్వడానికి ముందుకు వచ్చిన రాధను దమయంతి అడ్డుకుంటుంది. అయినా సరే ఇవ్వడానికి వెళ్తున్న రాధను మోసం చేసి గదిలో బంధిస్తుంది. భర్త సాయంతో బయటకు వచ్చిన రాధ...రక్తమిచ్చి రామచంద్రాన్ని కాపడటంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా మారుతుంది.
ఆస్పత్రిలో క్షీణించిన రామచంద్రం ఆరోగ్యం
దమయంతి కుట్రతో కిందపడిపోయిన రామచంద్రాన్ని విక్కీ ఆస్పత్రికి తీసుకురాగా..తలకు బలమైన గాయం కావడం వల్ల రక్తం చాలా పోయిందని అందుకే ఆయన పరిస్థితి విషమిస్తోందని డాక్టర్లు చెబుతారు.అర్జెంట్గా రక్తం ఎక్కించకపోతే ఆయన కోమాలోకి వెళ్తారని చెబుతారు. అయితే ఆయనకు ఎంతో అరుదుగా దొరికే AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావడం వల్ల ఎక్కడా దొరకడం లేదని చెబుతారు. మేం ట్రై చేస్తున్నామని మీరు కూడా మీకు తెలిసిన వాళ్ల దగ్గర ట్రై చేయమని చెబుతారు.
విక్కీతోపాటు మిగిలిన వాళ్లంతా వాళ్ల ఫ్రెండ్స్ను తెలిసిన వాళ్లను బ్లడ్ కోసం అడుగుతూనే ఉంటారు. ఎంత ప్రయత్నించినా రామచంద్రానికి కావాల్సిన బ్లడ్ మాత్రం దొరకదు. దీంతో దమయంతి చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు బ్లడ్ దొరక్క ఈ రామచంద్రం చచ్చిపోతే.....రాధ వల్లే చనిపోయాడని చెప్పి దాన్ని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేయవచ్చని ఆనందపడిపోతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలడమంటే ఇదేనని సంతోషిస్తుంది.
ఆస్పత్రి సిబ్బందిపై విక్కీ గొడవ
ఇంత పెద్ద ఆస్పత్రిలో కావాల్సిన బ్లడ్ దొరక్కపోవడం ఏంటని విక్కీ అక్కడి సిబ్బందిపై గొడవపడతాడు.మేం కూడా అన్ని బ్లడ్ బ్యాంకులు,డోనర్స్కు ఫోన్ చేశామని ఎక్కడా ఈ అరుదైనా గ్రూప్ బ్లడ్ దొరకడం లేదని చెబుతారు. దీంతో వాళ్లపై గొడవపడి విక్కీ అందరికీ ఫోన్లు చేస్తూ వెళ్లిపోతాడు. ఇదంతా చూసిన రాధ...అక్కడి సిబ్బంది వద్దకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీస్తుంది. రామచంద్రం గారికి AB నెగిటివ్ గ్రూప్ బ్లడ్ కావాలని అది దొరక్కపోవడంతో గొడవ చేస్తున్నారని చెబుుంది. నాది కూడా అదే గ్రూప్ బ్లడ్ అని కావాలంటే నేను ఇస్తానని చెబుతుంది.ఈ మాటలు విన్న దయమంతి...నువ్వు మా బావగారికి బ్లడ్ ఇవ్వడానికి వీళ్లేదని అంటుంది.నీ వల్లే ఆయన ఆస్పత్రి పాలయ్యారని...ఇప్పుడు నువ్వు బ్లడ్ ఇచ్చి బతికించినా ఆయన బాధపడిపోతారని అంటుంది. మీరు ఎన్ని చెప్పినా నేను బ్లడ్ ఇచ్చే తీరతానని రాధ చెప్పి వెళ్లిపోతుంది.
దమయంతి కుట్రలు
రాధ బ్లడ్ ఇచ్చి ఇప్పుడు రామచంద్రాన్ని బతికిస్తే మళ్లీ దీన్ని అందరూ నెత్తిమీదపెట్టుకుని పూజిస్తారని దమయంతి అనుకుంటుంది. ఆస్పత్రి నర్సుకు డబ్బులిచ్చి కుట్రకు తెరతీస్తుంది. నర్సు రాధ దగ్గరకు వచ్చి మీ బ్లడ్ శాంఫిల్ తీసుకుంటానని చెప్పి ఓ గదిలోకి తీసుకెళ్లి బయట తాళం పెడుతుంది. ఎంతసేపటికి నర్సు రాకపోయేసరికి రాధకు అనుమానం వచ్చి చూస్తే బయట గొళ్లెం పెట్టి ఉందని తేలుస్తుంది.ఇదంతా దమయంతి కుట్రేనని భావించి కాగితంపై తాను లోపల చిక్కుకున్నానని ఎవరైనా కాపడండి అంటూ తలుపు సందులో నుంచి బయటకు వేస్తుంది.అటుగా వెళ్తున్న విక్కీ చూసి తాళం పగులగొట్టి రాధను బయటకు తీసుకొస్తాడు.
మళ్లీ అడ్డుకున్న దమయంతి
రామచంద్రాన్ని బతికించడానికి ఏ దేవుడు దిగివస్తాడా అని అందరూ ఆశగా ఎదురుచూస్తుండగా....రాధను తీసుకుని విక్కీ రావడం చూసి దమయంతి షాక్ తింటుంది. బ్లడ్ ఇవ్వడానికి వెళ్తుండగా...మరోసారి అడ్డుకుంటుంది.ఈ రాధ బ్లడ్ ఇస్తే బావగారు బతికినా చచ్చినట్లేనని అంటుంది. ఈ సమయంలో ఇలాంటివి తగదని విక్కీ వాళ్ల అత్తయ్యకు గట్టి హెచ్చరిక చేస్తాడు.

Author : Ajay Kumar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam