Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Olive Oil For Hair : ఆలివ్ ఆయిల్ వంటకేనా? జుట్టుకు కూడా అప్లై చేయవచ్చా? లాభ, నష్టాలు ఇవే

Olive Oil For Hair : ఆలివ్ ఆయిల్ వంటకేనా? జుట్టుకు కూడా అప్లై చేయవచ్చా? లాభ, నష్టాలు ఇవే

ABP దేశం 1 week ago

 ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు సహజమైన తేమను అందించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పొడిబారిన, రఫ్‌గా మారిన జుట్టుకు ఇది కండిషనర్‌లా పనిచేయొచ్చు.

తరచూ హెయిర్ డ్రైయర్, స్ట్రెయిటనర్ వాడేవారికి కొంత ఉపశమనం కలిగించవచ్చు.

జుట్టు పొడిబారినప్పుడు చివర్లు చిట్లిపోవడం, మధ్యలోనే విరిగిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఆలివ్ ఆయిల్ జుట్టు కుదుళ్లను మృదువుగా ఉంచి, హెయిర్ షాఫ్ట్‌పై రక్షణ పొరను ఏర్పరచడం ద్వారా విరిగిపోయే ప్రమాదాన్ని కొంత మేర తగ్గించవచ్చు.

కొంతమందిలో స్కాల్ప్ పొడిబారి దురద, పొట్టు వంటి సమస్యలు కనిపిస్తాయి. ఆలివ్ ఆయిల్‌ను మితంగా మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్‌కు తేమ అందుతుంది. దీంతో పొడిబారడం తగ్గి కొంత సౌకర్యంగా అనిపించవచ్చు.

ఆలివ్ ఆయిల్‌ను హెయిర్ కేర్ రొటీన్‌లో భాగం చేసుకుంటే జుట్టు మరింత మెత్తగా, మెరిసేలా కనిపించవచ్చు. ముఖ్యంగా డ్యామేజ్ అయిన జుట్టు ఆరోగ్యంగా కనిపించడానికి ఇది సహాయపడుతుంది.

చాలామంది ఆలివ్ ఆయిల్ రాస్తే జుట్టు వేగంగా పెరుగుతుందని భావిస్తారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది జుట్టు పెరగడాన్ని నేరుగా పెంచకపోయినా.. జుట్టు విరిగిపోకుండా కాపాడడం ద్వారా జుట్టు పొడవుగా కనిపించేందుకు సహాయపడవచ్చు.

ఆలివ్ ఆయిల్‌ను అధిక పరిమాణంలో ఉపయోగిస్తే జుట్టు బరువుగా, జిడ్డుగా కనిపించవచ్చు. ముఖ్యంగా ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారు తరచూ వాడితే దుమ్ము, మురికి ఎక్కువగా పేరుకునే అవకాశం ఉంటుంది.

డాండ్రఫ్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే వారికి ఎక్కువసేపు ఆయిల్ ఉంచడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే కొందరిలో చర్మ అలర్జీ లేదా చికాకు కూడా రావచ్చు. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి.

ఆలివ్ ఆయిల్‌ను స్వల్పంగా గోరువెచ్చగా చేసి స్కాల్ప్, జుట్టుకు మసాజ్ చేసి 30 నిమిషాల నుంచి 1 గంట వరకు ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయడం మంచిది.

వారానికి 1-2 సార్లు వాడటం చాలామందికి సరిపోతుంది. అయితే ప్రతి ఒక్కరి జుట్టు స్వభావం వేరు కాబట్టి ఫలితాలు కూడా వ్యక్తికి వ్యక్తికి మారవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam