పనీర్‌ను తెరిచిన ప్యాకెట్‌లో ఉంచకుండా శుభ్రమైన, ఎయిర్‌టైట్ కంటైనర్‌లో భద్రపరచండి. ఇది గాలికి గురికాకుండా కాపాడుతుంది.
పనీర్ పూర్తిగా మునిగేలా చల్లటి నీటిని పోసి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.
ఇలా చేయడం వల్ల పనీర్ తేమగా, మెత్తగా ఉండటానికి సహాయపడుతుంది.
పనీర్‌ను నీటిలో ఉంచితే ఆ నీటిని రోజూ తప్పకుండా మార్చాలి. కొత్త నీరు పోసే ముందు కంటైనర్‌ను కూడా శుభ్రం చేయడం మంచిది.
ఫ్రిజ్ డోర్‌ను తరచూ తెరవడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలో మార్పులు వస్తుంటాయి. పనీర్‌ను ఫ్రిజ్‌లో స్థిరంగా చల్లగా ఉండే లోపలి అరలో ఉంచడం మంచిది.
మరుసటి రోజే ఉపయోగించాల్సిన కొద్దిపాటి పనీర్‌ను శుభ్రమైన తడి మస్లిన్ లేదా కాటన్ గుడ్డలో చుట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టవచ్చు.
పనీర్ త్వరగా పుల్లగా లేదా జిగటగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఎయిర్‌టైట్ కంటైనర్‌నే ఉపయోగించడం మంచిది.
పనీర్‌ను ఎక్కువగా కొనుగోలు చేసి వెంటనే ఉపయోగించకపోతే చిన్న ముక్కలుగా చేసి ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. ఉపయోగించే ముందు ఫ్రిజ్‌లో నెమ్మదిగా డీఫ్రాస్ట్ చేయడం మంచిది.
పనీర్‌కు పుల్లటి లేదా ఘాటైన వాసన రావడం, ఎక్కువగా జిగటగా మారడం, అసాధారణంగా పసుపు లేదా బూడిద రంగులోకి మారడం కనిపిస్తే తినకండి. పాడైన భాగాన్ని మాత్రమే తీసేసి మిగిలినది తినడం కూడా సురక్షితం కాదు.

