Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pavithra Naik: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!

Pavithra Naik: నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!

ABP దేశం 3 months ago

Pavithra Naik: స్టార్ మా ఛానల్‍లో ప్రసారమవుతున్న సీరియల్స్‍లో 'నిండు మనసులు' ఒకటి. టీఆర్పీ పరంగా టాప్‍లో ఉన్న ఈ సీరియల్ జనాలనీ బాగా ఆకట్టుకుంటుంది.

ఇందులో లీడ్ రోల్‍లో నటిస్తున్న ప్రేరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ బుల్లితెరపై తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ తెలుగులోనూ రాణిస్తుంది. ప్రేరణ అసలు పేరు పవిత్ర బి నాయక్. తెలుగులో 'నువ్వు నేను ప్రేమ' పద్మావతి అనే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో తన రెండో సీరియల్ 'నిండు మనసులు'. ఇందులో హీరోయిన్‍గా అందరినీ ఆకట్టుకుంటుంది.

పవిత్ర ఎడ్యుకేషన్ & కెరీర్

పవిత్ర బి నాయక్ (Pavithra B Naik) టెలివిజన్ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. తెలుగు, కన్నడ టీవీ సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. పవిత్ర కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో 1997 సెప్టెంబర్ 13న జన్మించింది. పాఠశాల విద్య తర్వాత బెంగళూరులోని శ్రీ కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్‌లో తన కెరీర్‌ను స్టార్ట్ చేసంది. ఆభరణాల బ్రాండ్‌ల కోసం అనేక యాడ్స్‌లో నటించింది. 2019లో కన్నడ టెలివిజన్‍లో 'రక్షా బంధన' సీరియల్‌తో తన కెరీర్‍ను ప్రారంభించింది. ఆ తర్వాత పవిత్ర 'ఎల్లి నన్న విలాస' సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. కన్నడ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర.. హోమ్లీ, బబ్లీ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

'గోదావరి' సీరియల్: నువ్వు చచ్చినా నీ శవం చూడటానికి రానురా.. తమ్ముడి కాలర్ పట్టుకొని గెంటేసిన శాంతి..!

సీరియల్స్

  • నిండు మనసులు: ఈ సీరియల్‍లో ప్రేరణగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీఆర్పీలోనూ ఈ సీరియల్ దూసుకుపోతుంది.
  • నువ్వు నేను ప్రేమ: ఈ సీరియల్‌లో పవిత్ర బి నాయక్ పోషించిన 'పద్మావతి' పాత్ర తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అమాయకత్వం, పట్టుదల ఉన్న తిరుపతి అమ్మాయిగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
  • పారు: కన్నడలో ఈ సూపర్ హిట్ సీరియల్‌లో 'జనని' అనే కీలక పాత్రలో నటించి, మంచి పేరు సంపాదించింది.
  • కాదంబరి: ఈ కన్నడ సీరియల్‍లో లీడ్ రోల్ పోషించింది.
  • రక్షా బంధన: కెరీర్ తొలినాళ్లలో ఈ కన్నడ సీరియల్‌లో ఒక కీలక పాత్రలో నటించింది.
  • సింధు భైరవి: ఈ సీరియల్‍లో కీలక పాత్ర పోషించింది.
  • సీరియల్స్ లోకి రాకముందు పవిత్ర కన్నడలో దాదాపు నాలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.

నిండు మనసులు: రంజిత్‌ చేసిన పనికి ఐశ్వర్య సీరియస్! సిద్ధూ ఎఫైర్ పెట్టుకున్నాడా!

సోషల్ మీడియాలోనూ యాక్టివ్

పవిత్ర నాయక్‍కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌(@pavithrabnaik)లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌(@pavithrabnaik6)ని కూడా ఆమె నిర్వహిస్తుంది. ఇందులో తన ట్రావెల్ వ్లాగ్స్, షూటింగ్ లొకేషన్స్ గురించి షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలో రీల్స్, వీడియోలు, ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ వీడియోలు, లేటెస్ట్ ఫొటోషూట్స్ షేర్ చేస్తూ యాక్టివ్‍గా ఉంటుంది. అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటుంది.

పవిత్ర నాయక్ ఒక్కరోజు రెమ్యూనరేషన్?

టెలివిజన్ ఇండస్ట్రీలో నటీనటుల రెమ్యూనిరేషన్ అనేది అధికారికంగా బయటకు రావు కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. పవిత్ర నాయక్ రోజువారీ పారితోషికం ఈ విధంగా ఉంది. "నువ్వు నేను ప్రేమ" సీరియల్ సక్సెస్ తర్వాత పవిత్రకు డిమాండ్ పెరిగింది. దీంతో ఆమె ఒక్కో రోజు షూటింగ్‌కు సుమారు రూ.20,000 నుండి రూ.35,000 వరకు ఛార్జ్ చేస్తున్నట్లు అంచనా. సీరియల్ లీడ్ యాక్ట్రెస్ కావడం వల్ల నెలకు కనీసం 15 నుంచి 20 రోజుల కాల్‌షీట్స్ ఉంటాయి. దీంతో పాటు బ్రాండ్ కొల్లాబరేషన్స్, ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్స్ యూట్యూబ్ ఛానల్‍తో అదనపు ఆదాయం సంపాదిస్తుంది.

బుల్లితెరపై రాణిస్తున్న తెలుగింటి అందం.. అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

ఐఏఎస్ కల

బెంగళూరు శ్రీకృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తండ్రి తనను ఐఏఎస్ చేయాలని కలలు కనేవాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పవిత్రకు ఒక చెల్లి కూడా ఉంది.

Author : Satyaprasad Bandaru

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam