Peddi Movie First Day First Show Live Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన సినిమా 'పెద్ది'.
జాన్వీ కపూర్ హీరోయిన్. వెంకట సతీష్ కిలారు నిర్మాత. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన చిత్రమిది. ఏపీ, తెలంగాణతో పాటు అమెరికాలోనూ ప్రీమియర్ షోలు మొదలు అయ్యాయి. స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ ఏం జరిగిందో లైవ్ అప్డేట్స్లో తెలుసుకోండి.
- 'పెద్ది' ప్రీమియర్ షో మొదలైంది. సినిమా రన్ టైమ్ 03.09 గంటలు. హైదరాబాద్ సిటీలోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో ప్రీమియర్ షో మొదలైంది.
- ఒలింపిక్స్ లో ఇండియాకు రెండు మెడల్స్ రావడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆలోచనలో పడిన అధికారి బోమన్ ఇరానీ కలకత్తా నుంచి వెళుతూ వెళుతూ విజయనగరం వస్తాడు. అక్కడ ఏ ఆటగాడిని అడిగినా తన ఫేవరెట్ ప్లేయర్ పెద్ది అని చెప్పడంతో అతను ఎవరో తెలుసుకోవాలని బయలుదేరతాడు.
- రామ్ బుజ్జి పాత్రలో మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మను పరిచయం చేశారు.
- క్రికెట్ గ్రౌండ్ లో ఆట కూలి పాత్రలో పెద్దిగా రామ్ చరణ్ ను పరిచయం చేశారు.
- రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్స్, గ్రౌండ్స్ లో కొట్టే సిక్సులు, ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సూపర్.
- సినిమాలో ఫస్ట్ సాంగ్ రై రై రా రా వచ్చింది. రామ్ చరణ్. అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చేలా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విడుదలకు ముందు సూపర్ హిట్ అయ్యింది.
- విజయనగరం కొండ కింద పేరే లేని ఊరు... ఊరికి చేరుకోవడానికి రోజంతా నడవాల్సిన పరిస్థితి... పెద్ది ఊరిని పరిచయం చేశారు.
- అప్పలసూరి పాత్రలో జగపతి బాబును పరిచయం చేశారు.
- రాజకీయ నేత సుభద్ర రాజు కుమార్తె అచ్చియమ్మగా జాన్వీ కపూర్ ను పరిచయం చేశారు.
- అచ్చియమ్మను చూసి పెద్ది మోజు పడతాడు. చికిరి చికిరి పాట వచ్చింది.
- ఎన్నికల ప్రచారంలో ఎవరూ ఊహించని సీన్... సినిమాలో ఫస్ట్ ఫైట్. పెద్ది ఫిరోషియస్ గా కనిపించాడు.
- కోడి రాన్మూర్తి నాయుడు శిష్యుడు గౌర్ నాయుడు పాత్రలో శివ రాజ్ కుమార్ ను... కుస్తీ ఆటగాడిగా తారక్ పొన్నప్పను పరిచయం చేశారు.
- ఫైట్ వల్ల క్రికెట్ గ్రౌండ్ లో పెద్దికి అవమానం జరిగింది. అక్కడే అతని ఆట గౌర్ నాయుడు చూశాడు. కుస్తీ నేర్పుతానని, రమ్మని పిలిచాడు.
- కథ ఒక్కసారిగా సీరియస్ టర్న్ తీసుకుంది. ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెట్టేలా సాగింది ఓ సన్నివేశం. హీరోకి ఒక లక్ష్యం ఏర్పడింది.
- పెద్ది ఆలోచన మారింది. ఆట మారింది... కథలో కాస్త విరామం. ఇంటర్వెల్ ఇచ్చారు.
- ఇంటర్వెల్ తర్వాత సినిమా మళ్లీ మొదలైంది. పెద్ది సహనానికి పరీక్ష పెట్టే సన్నివేశాలు వస్తున్నాయి.
- క్రికెటర్ నుంచి కుస్తీ వీరుడిగా మారిన సందర్భంలో మస్సా మస్సా సాంగ్ వచ్చింది.
- పెద్దిని కలవడానికి అచ్చియమ్మ వచ్చింది. ఇద్దరి మధ్య సన్నివేశం ఆసక్తికరంగా ఉంది.
- కథ మళ్లీ కుస్తీకి మారింది.
- కుస్తీ బరిలో ఇద్దరితో పోటీ పడే సన్నివేశం... బాగా డిజైన్ చేశారు.
- కథలో కీలకమైన మలుపు. పెద్ది తీసుకున్న నిర్ణయం ఎవరూ ఊహించనిది.
- రణధీర్ సిసోడియా పాత్రలో రవి కిషన్ ను పరిచయం చేశారు.
- స్పెషల్ సాంగ్... శృతి, జాన్వీతో రామ్ చరణ్ స్టెప్పులు వేసిన హల్లల్లలో వచ్చింది.
- జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు వెళ్ళాడు పెద్ది. కథలో మరో ట్విస్ట్.
- కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంది.
- ఇప్పటి వరకు విడుదల చేయని, కథలో ఆత్మను ఆవిష్కరించే పాట మరొకటి ఉంది. కీలకమైన సందర్భంలో వచ్చింది.
- క్రికెట్, కుస్తీ నుంచి రన్నింగ్ వైపు పెద్ది వేసిన అడుగు అందరికీ షాక్ ఇస్తుంది. అందులో మరో సందేహం లేదు.
- రన్నింగ్ నేపథ్యంలో ఎమోషనల్ క్లైమాక్స్ అందరి చూపు తిప్పుకోనివ్వదు. సినిమా కంప్లీట్ అయ్యింది. రివ్యూ కోసం ఏబీపీ దేశం చూస్తూ ఉండండి.

