Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi Massa Massa Song : ఆవేశానికి అరుపు దేనికి... చరుపు మట్టుకే చాలుగా - పెద్ది మస్సా మస్సా సాంగ్ లిరిక్స్

Peddi Massa Massa Song : ఆవేశానికి అరుపు దేనికి... చరుపు మట్టుకే చాలుగా - పెద్ది మస్సా మస్సా సాంగ్ లిరిక్స్

ABP దేశం 4 months ago

Ram Charan's Peddi Massa Massa Song Telugu Lyrics : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' నుంచి మరో సాంగ్ వచ్చేసింది.

ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్ ఒక ఎత్తైతే ఈ సాంగ్ మరో ఎత్తు. సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా ఉన్న లిరిక్స్ ఇన్స్పైర్ కలిగిస్తున్నాయి.

చికిరి చికిరి, రయ్ రయ్ రా రా, హల్లల్లల్లో సాంగ్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తుండగా... రీసెంట్ 'మస్సా మస్సా' సాంగ్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ పవర్ ఫుల్ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా... విశాల్ మిశ్రా పాడారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఇన్స్పిరేషనల్ లిరిక్స్ ఓసారి చూస్తే...

పల్లవి

ఉలికిపడి ఊగాలా ఉలకైనా నేనురకేస్తాంటే...

అదిరిపడి ఆగాలా పిడుగైనా నేనడుగేస్తే...

కొండరాళ్లే నాపై కండరాలైతే...

నిప్పువానే నాలో నెత్తుటేరైతే...

భూగోళాన్నే ఆపే సత్తా నా సొత్తే...

విశ్వాన్ని పేల్చే విస్ఫులింగాన్నై....

మస్సా మస్సా మస్సా నాకు నేనే చాలోయ్...

చిక్ చిక్ చకతికి మస్సా నా వెన్నే నా దన్నవ్వాలోయ్...

మస్సా మస్సా మస్సా నా దన్నే నా రొమ్మవ్వాలోయ్... రాటు దేలాలోయ్.....

చరణం 1

నిలువెల్లా నాపై చెమటే మండుతుంది నాకై ముడిచమురై...

సెగ వల్లా ఆపై మనసే బుస కొడుతుందోయే బడబాగ్నై...

ఆవేశానికి అరుపు దేనికి... చరుపు మట్టుకే చాలుగా...

ఆక్రోశానికి అణచివేతకి చివరి మలుపిక చూపగా...

ఒక్కో పట్టు ఒక్కొక్క మెట్టుగా ఎక్కేటట్టు నా పట్టు పట్టానా...

ఏ కష్టాలైనా నా పాదాల కింద...

నేనొక తిట్టు ఒక్కొక్క బొట్టులాగా ఎదిగేటట్టు నేనొట్టు పెట్టానా...

నాకు ఏ రోజున నీరాజనం పట్టేదారుందా... నా కట్టే కాలేలోగా...

మస్సా మస్సా మస్సా నాకు నేనే చాలోయ్...

చిక్ చిక్ చకతికి మస్సా నా వెన్నే నా దన్నవ్వాలోయ్...

మస్సా మస్సా మస్సా నా దన్నే నా రొమ్మవ్వాలోయ్... రాటు దేలాలోయ్...

పెద్ది పెద్ది పెద్ది పెద్ది పెద్ది పెద్ది.....

Also Read : Kattalan Review - 'కాటాలన్' రివ్యూ: పుష్ప లాంటి కథ... ఏనుగు దంతాల స్మగ్లింగ్... మలయాళీ యాక్షన్ ఫిల్మ్ హిట్టా? ఫట్టా?

రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్తో అంచనాలు పదింతలయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయగా... ఇప్పటికే భోపాల్, ముంబై, బెంగుళూరులో ప్రమోషన్స్ పూర్తయ్యాయి. గురువారం ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీ టీం. ఇక హైదరాబాద్లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పెద్ది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ దివ్యేందు శర్మ అన్నారు. కేవలం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ మాత్రమే కాదని... చరణ్, జాన్వీలది లవ్ స్టోరీ అయితే మరో లవ్ స్టోరీ కూడా ఉందని చెప్పారు. తనకు, చరణ్కు మధ్య కూడా లవ్ స్టోరీ ఉంటుందని అది చాలా టాక్సిక్ అని అన్నారు. చరణ్, జాన్వీ, దివ్యేందు శర్మలతో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 4న వరల్డ్ వైడ్గా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Blast Zone Review - 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam