రామ్ చరణ్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi Movie). ముంబైలో ట్రైలర్ లాంచ్ నుంచి మొదలు పెడితే... మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్, ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీ సిటీల్లో ప్రెస్ మీట్స్ నిర్వహించారు.
ఇప్పుడు తెలుగు గడ్డపై భారీ ఎత్తున ఈవెంట్ చేయడానికి రెడీ అయ్యారు. ఏపీలోని విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఎక్కడ? ఎప్పుడు? ఏ టైంకి? వంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి.
జూన్ 1న 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్
Peddi Movie Pre Release Event Venue: జూన్ 1వ తేదీన... అంటే ఈ సోమవారం విజయవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అందుకు ఇందిరా గాంధీ గ్రౌండ్స్ వేదిక కానుంది. 'పెద్ది' ట్రైలర్‌లో రామ్ చరణ్ నటన... ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అభిమానులతో పాటు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలు పెరిగాయి. సో... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టు ఈవెంట్ ఏర్పాట్లు మొదలు పెట్టారు.
పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఈవెంట్!?
జూన్ 1వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ అని యూనిట్ అనౌన్స్ చేసింది. ఐదు గంటలకు ముందు నుంచి సందడి మొదలు అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే... ఐదు కాకుండా ఆరు లేదా ఏడు గంటలకు ఈవెంట్ మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Pawan Kalyan To Attend Peddi Pre Release Event: అబ్బాయి రామ్ చరణ్ కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ రానున్నట్టు సమాచారం. 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఏపీ డెప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ అని యూనిట్ సన్నిహిత వర్గాల కథనం. ఆయన కోసమే ఏపీలోని విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారట.
పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా జరగనున్న 'పెద్ది' ఈవెంట్‌కు హీరో హీరోయిన్లు రామ్ చరణ్, జాన్వీ కపూర్, ఇంకా దర్శక నిర్మాతలు, చిత్ర బృందం హాజరు కానుంది.
జూన్ 3న ప్రీమియర్లు... 4న విడుదల
Peddi Release Date: జూన్ 3వ తేదీన ప్రీమియర్ షోలతో 'పెద్ది' సినిమా విడుదల కానుంది. ఏపీలో ప్రీమియర్ షోలకు అనుమతి లభించింది. అలాగే టికెట్ రేటు పెంచుకోవడానికి వీలుగా జీవో జారీ చేశారు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
Author : Satya Pulagam

