Dailyhunt
Peddi Special Song : మృణాల్ కాదు... కపుల్ ఫ్రెండ్లీ బ్యూటీ? - పెద్ది స్పెషల్ సాంగ్‌పై క్రేజీ బజ్

Peddi Special Song : మృణాల్ కాదు... కపుల్ ఫ్రెండ్లీ బ్యూటీ? - పెద్ది స్పెషల్ సాంగ్‌పై క్రేజీ బజ్

ABP దేశం 1 week ago

Manasa Varanasi To Dance With Ram Charan In Peddi Special Song : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చూపంతా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'పైనే ఉంది.

ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. స్పెషల్ సాంగ్ షూటింగ్ ఒక్కటే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తుండగా... అది త్వరగా కంప్లీట్ చేసేందుకు మూవీ టీం సన్నాహాలు చేస్తోంది.

మృణాల్ కాదు...

ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ చరణ్తో స్పెషల్ సాంగ్లో స్టెప్స్ వేయనున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగింది. డెకాయిట్ మూవీ ప్రమోషన్స్తో పాటు ఈ సాంగ్ కోసమే ఆమె హైదరాబాద్లో కొద్ది రోజులు ఉన్నారనే టాక్ వినిపించింది. అయితే, అనూహ్యంగా మృణాల్ ఈ సాంగ్ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ను తీసుకున్నారంటూ ఫిలింనగర్ వర్గాల టాక్.

రీసెంట్గా కపుల్ ఫ్రెండ్లీ మూవీతో బిగ్ సక్సెస్ కొట్టిన హీరోయిన్ మానసా వారణాసి. పెద్ది స్పెషల్ సాంగ్లో చరణ్తో ఆమె స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ బుచ్చిబాబు... సాంగ్ కోసం ఆమెను సంప్రదించారట. ఇక ఇదే పాటలో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా కనిపించనున్నట్లు టాక్. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయితే ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్రమోషనల్ ఈవెంట్స్పై టీం ఫోకస్ చేయనుంది.

Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ బిగ్ సర్ప్రైజ్ - ఎవరూ ఊహించని టైటిల్... ఏంటో తెలుసా?

రిలీజ్ ఎప్పుడు?

ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే, మూవీ రిలీజ్ మళ్లీ వాయిదా పడనుందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. రీసెంట్గా చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత SKN కామెంట్స్ దీనికి మరింత బలం చేకూర్చాయి. ఆ తర్వాత ఆయన తన కామెంట్స్పై సారీ చెప్పారు. రాకాస ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనూ పెద్ది చెప్పిన టైంకే రిలీజ్ చేస్తామని స్వయంగా చరణే చెప్పారు.

అయినా, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే వాయిదా పడుతుందనే ప్రచారమే ఇండస్ట్రీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్తో పాటు మూవీ ప్రమోషన్స్కు ఉన్న ఈ కొద్ది రోజులు చాలదంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ క్రమంలో జూన్ ఫస్ట్ వీక్ అంటే 4వ తేదీన కానీ, లాస్ట్ వీక్ 24న కానీ రావొచ్చంటూ రెండు తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు, ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. మరి దీనిపై మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam