Ram Charan's Peddi Ticket Rates In Telangana : రామ్ చరణ్ పెద్ది జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఇప్పటికే ప్రీమియర్ షోస్తో పాటు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
మరి తెలంగాణలో టికెట్ రేట్స్పై మూవీ టీం హోం సెక్రటరీని సంప్రదించినా ఎలాంటి రియాక్షన్ లేదు.
హైకోర్టులో పిటిషన్
టికెట్ రేట్స్పై 7 రోజుల పాటు పెంచుకునేందుకు రెండుసార్లు అధికారులను సంప్రదించినా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మేకర్స్ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ రేట్స్ హైక్ చేసేలా అధికారులను ఆదేశాలించాలంటూ పిటిషన్ వేశారు. అయితే, హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో పిటిషన్ విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి కోరగా న్యాయమూర్తి అందుకు అంగీకరించారు.
టికెట్ ధరల పెంపుపై ఎలాంటి జీవో జారీ చేసినా కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. గతంలో ఈ అంశంలో సుమోటోగా విచారించిన విషయాన్ని గుర్తు చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు టైం కోరగా... న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు.
గతంలో రిలీజైన పెద్ద సినిమాల విషయంలో ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిగ్గా రిలీజ్కు ముందే జీవో ఎలా రిలీజ్ చేస్తారంటూ ప్రశ్నించింది. టికెట్ రేట్స్ పెంపు అంశం అధికారులకు తలనొప్పిగా మారగా అనుమతి కోరినా స్పందించడం లేదు. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే తెలంగాణలో టికెట్ ధరలు పెంపు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
మరి ప్రీమియర్ షోస్ వేసుకునేందుకు అయినా పర్మిషన్ వస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ప్రీమియర్, బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇవ్వాలంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. రీసెంట్గా వచ్చిన పెద్ద మూవీస్ టికెట్ రేట్స్ తెలంగాణలో సాధారణంగానే ఉన్నాయి.
ఏపీలో టికెట్ రేట్స్ హైక్
అటు, ఏపీలో మాత్రం టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.600గా నిర్ణయించారు. జూన్ 4 నుంచి 10 రోజుల పాటు 5 షోస్ వేసుకోవడం సహా... సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
ఆదివారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో జీవో జారీ కావడంతో ఫస్ట్ అక్కడ బుకింగ్స్ స్టార్ట్ కానుంది. విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యామ్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం.
NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Author : Ganesh Guptha

